Auto-debit-for-LIC-Insurance-polacies-latest-update

Auto-debit-for-LIC-Insurance-polacies-latest-update

బీమాకూ ఆటో డెబిట్ , పాలసీదారులకు ఊరట

బీమా పాలసీలన్నీ కాలపరిమితికి లోబడి ఉంటాయి. ప్రస్తుతం 15 నుంచి 30 రోజులగ్రేస్‌ పీరియడ్‌లోగా బీమా ప్రీమియం చెల్లించకపోతే అదనపుచార్జీలు, ఇంకా ఆలస్యమైతే పాలసీలు రద్దయిపోతున్నాయి. ఈ క్రమంలోనే ఈ సమస్య పరిష్కారానికి బీమా కంపెనీలన్నీ ఆటో డెబిట్‌ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. హౌజింగ్‌ లోన్‌ తరహాలోనే పాలసీదారు అకౌంట్‌ నుంచి ఇన్సూరెన్స్‌ ప్రీమియంలు ఆటో డెబిట్‌ అవుతాయి.
కరోనా నేపథ్యంలో పాలసీదారులకు ఊరటనిస్తూ బీమారంగ సంస్థలు ఆటో డెబిట్‌ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చాయి. దీనివల్ల భౌతిక చెల్లింపుల భారం తగ్గడంతోపాటు అనవసరపు చార్జీలనుంచి రక్షణ లభించినట్లయింది. మరోవైపు ఆరోగ్య బీమా పాలసీదారుల కోసం బీమా కంపెనీలు ఆటోమెటిక్‌ రీచార్జ్‌ను అందుబాటులోకి తెచ్చాయి. హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలో కవరేజీని పెంచుతూ ఈ ఆటోమెటిక్‌ రీచార్జ్‌ను చేర్చారు. ఉదాహరణకు రూ.5 లక్షలకు ఆరోగ్య బీమా పాలసీ ఉందనుకుందాం. అనారోగ్యంతో దవాఖానలో చేరినప్పుడు ఈ రూ.5 లక్షల కవరేజీకి లోబడే బిల్లు అయితే ఎలాంటి సమస్యా ఉండదు. కానీ అంతకన్నా ఎక్కువైతే? అలాంటప్పుడే ఆటోమెటిక్‌ రీచార్జ్‌ ఉపయోగపడుతుంది. ఇలా అదనంగా మరో రూ.5 లక్షల కవరేజీని కూడా కలుపుకోవచ్చు. మెడికల్‌ ఎమర్జెన్సీల సమయంలో ఈ సౌకర్యం అత్యంత ఉపయోగకారిగా ఉంటుంది.*
ఎలా పొందాలి?*
ఏడాదిలో బీమా మొత్తంతోపాటు నో క్లెయిమ్‌ బోనస్‌లకు మించి బిల్లు ఉంటేనే వర్తిస్తుంది. ఇప్పటికే కవరైన క్లెయిమ్‌లకు ఇది వర్తించదు. ఒకే ఒక్కసారి క్లెయిమ్‌ చేసినా ఇది వర్తించదు. అయితే ఉపయోగించని ఆటోమెటిక్‌ రీచార్జ్‌లో వచ్చిన బీమా మొత్తాన్ని వచ్చే ఏడాదిలో వాడుకోవచ్చు. ఫ్లోటర్‌ మెడిక్లెయిమ్‌ పాలసీ అయితే ఆటోమెటిక్‌ రీచార్జ్‌ సదుపాయం చాలా ఉత్తమం. కుటుంబ సభ్యులు కూడా ప్రయోజనాన్ని పొందవచ్చు. ఇందులో అదనపు చార్జీలుంటాయి. బీమా మొత్తానికి మించి దవాఖాన బిల్లు అయినప్పుడు అత్యంత ఉపయోగకరంగా ఉం టుంది. గత రెండేండ్లుగా దవాఖానలో అడ్వాన్స్‌డ్‌ ట్రీట్‌మెంట్‌ ఖర్చులు బాగా పెరిగిపోయాయి. దీంతో సమగ్ర సూపర్‌ మెడిక్లెయిమ్‌ పాలసీని అదనపు బెనిఫిట్స్‌తో తీసుకోవడం వల్ల అత్యవసర సమయంలో ఉపయోగకరంగా ఉంటుంది.
ఆన్‌లైన్‌లో ఎల్‌ఐసీ పాలసీ అప్‌డేట్‌ ఇలా..
ఎల్‌ఐసీ పాలసీ ప్రీమియం సమాచారాన్ని మొబైల్‌లో కోరుకునేవారు తమ కాంటాక్ట్‌ వివరాలను వెంటనే అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మీకు ఎల్‌ఐసీ నుంచి ప్రీమియం వివరాలు మీ మొబైల్‌కు వస్తాయి. ఇదంతా ఆన్‌లైన్‌లో సులువుగానే జరిగిపోతుంది.
www.licindia.in లో లాగిన్‌ అవ్వాలి
హోం పేజీలో పైన ‘కస్టమర్‌ సర్వీసెస్‌’ కనిపిస్తుంది*
దీని మీద క్లిక్‌ చేస్తే ఓ జాబితా వస్తుంది*
ఇందులో ‘అప్‌డేట్‌ యువర్‌ కాంటాక్ట్‌ డీటెయిల్స్‌ ఆన్‌లైన్‌’ను ఎంచుకోవాలి*
ఇప్పుడు ఓ కొత్త పేజీ తెరుచుకుంటుంది*
ఇందులో ‘అప్‌డేట్‌ యువర్‌ కాంటాక్ట్‌ డీటెయిల్స్‌’ లింక్‌పై క్లిక్‌ చేయాలి*
ఆ తర్వాత మీ పేరు, పుట్టినతేదీ, మొబైల్‌ నెంబర్‌, ఈ-మెయిల్‌ తదితర వివరాలివ్వాలి*
అన్ని వివరాలు సరైనవే అయితే సబ్మిట్‌పై క్లిక్‌ చేయాలి*
ఆపై పాలసీ నంబర్లను నమోదు చేయాలి*
అనంతరం ‘వ్యాలిడేట్‌ పాలసీ డీటెయిల్స్‌’, ‘వ్యాలిడేట్‌ పాలసీ నంబర్ల’పై క్లిక్‌ చేయాలి*
ఇలా చేస్తే మీ కాంటాక్ట్‌ వివరాలు విజయవంతంగా అప్‌డేట్‌ అయినట్లే*
ఇదే పద్ధతిలో సులువుగా మీ పాలసీ ప్రీమియంలనూ ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు.

www.licindia.in

error: Content is protected !!
Scroll to Top