Microsoft Hyderabad-recruitment-2024

Microsoft Hyderabad-recruitment-2024

Microsoft Hyderabad : హైదరాబాద్‌ మైక్రోసాఫ్ట్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ పోస్టులు.. అప్లయ్‌ చేసుకోవడానికి లింక్‌ ఇదే

Microsoft Hyderabad : ప్రముఖ ఐటీ సంస్థ మైక్రోసాఫ్ట్ కంపెనీ.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన వాళ్లు హైదరాబాద్‌లో పనిచేయాల్సి ఉంటుంది. అప్లయ్‌ చేసుకోవడానికి లింక్‌ ఇదే.. క్లిక్‌ చేయండి.

Microsoft Hyderabad Software Engineering Jobs Online Registration Link CLICK HERE

ఇతర సమాచారం :

  • పోస్టు: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్
  • కంపెనీ: మైక్రోసాఫ్ట్
  • పని అనుభవం: టెక్నికల్‌ ఇంజినీరింగ్, కోడింగ్‌లో ఏడాదికిపైగా అనుభవం ఉండాలి.
  • అర్హత: కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
  • నైపుణ్యాలు అండ్‌ పరిజ్ఞానం: సీ, సీ++, సీ#, జావా, జావాస్క్రిప్ట్‌, పైథాన్‌ పరిజ్ఞానం. కోడ్ బేస్‌లు, డీబగ్ సర్వర్-సైడ్, మల్టీ-థ్రెడ్ అప్లికేషన్‌లు. ఏజిలీ/ స్క్రమ్ మెథడాలజీలు తదితరాల్లో అనుభవం.
  • జాబ్‌ లొకేషన్‌: హైదరాబాద్‌ పనిచేయాల్సి ఉంటుంది.
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా అప్లయ్‌ చేసుకోవాలి.

ap-elections-2024-results-live

ap-elections-2024-results-live

ఎన్నికలు -2024 ఫలితాలను AP అధికారిక ఎన్నికల సంఘం వారి ప్రకటన క్రింది లింక్ లో చూడగలరు…

https://results.eci.gov.in/AcResultGenJune2024/partywiseresult-S01.htm

👆👆👆
*ఆంధ్రప్రదేశ్ శాసన సభ ఎన్నికల సంఘం అధికారిక ఫలితాలు*

https://results.eci.gov.in/PcResultGenJune2024/partywiseresult-S01.htm

👆👆👆
*ఆంధ్రప్రదేశ్ లోక్ సభ ఎన్నికల సంఘం అధికారిక ఫలితాలు*

ఆంధ్రప్రదేశ్‌లో మంగళవారం ఓట్ల లెక్కింపు జరగనుంది. 
 
ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. 
 
ఉదయం 8.30 కి EVM ల కౌంటింగ్ ప్రారంభిస్తారు. 
 
కాగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బరిలో ఉన్న 2387 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 
 
25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీలో ఉన్న 454 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
 
 అత్యధికంగా తిరుపతి అసెంబ్లీ స్థానంలో పోటీలో ఉన్న 46 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. 
 
అత్యల్పంగా చోడవరంలో ఆరుగురు అభ్యర్థులు మాత్రమే పోటీ చేశారు. 
 
అత్యధికంగా విశాఖ పార్లమెంటు బరిలో 33 మంది అభ్యర్థులు… 
 
రాజమండ్రి పార్లమెంటు పరిధిలో అత్యల్పంగా  12 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 
 
తొలి ఫలితం  నరసాపురం, కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 13 రౌండ్లతో వెల్లడవ్వనుంది. 
 
 రంపచోడవరం, చంద్రగిరి నియోజకవర్గాల్లో 29 రౌండ్లతో చివరిగా ఫలితం వెలువడనుంది. 
 
భీమిలి, పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గాల్లో 26 రౌండ్లు కౌంటింగ్ జరుగుతుంది. 
 
రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య అన్ని నియోజకవర్గాల తుది ఫలితాలు వెలువడే విధంగా చర్యలు చేపట్టారు అధికారులు.

 NTV Telugu News LIVE

ETV LIVE

https://www.youtube.com/watch?v=GI-8sFxRoyw

SAKSHI TV LIVE 

https://www.youtube.com/watch?v=j_XjJmh0BXk

ap-ecet-2024-results-rank-cards

ap-ecet-2024-results-rank-cards

AP ECET Results: ఏపీ ఈసెట్‌-2024 ఫలితాలు విడుదల, 90.41 శాతం ఉత్తీర్ణత నమోదు – ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్ చేసుకోండి

AP ECET Results: ఏపీలో బీఈ, బీటెక్‌, బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ ప్రవేశాలకు నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు నేడు విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు.

AP ECET 2024 Rank Cards: ఏపీలో ఇంజినీరింగ్ కళాశాలల్లో రెండో సంవత్సరం లేటరల్ ఎంట్రీ ప్రవేశాలకు నిర్వహించిన ‘ఏపీఈసెట్-2024’ పరీక్ష ఫలితాలు నేడు (మే 30) విడుదలయ్యాయి. అనంతపురం జేఎన్‌టీయూ ప్రాంగణంలో ఫలితాలను అధికారులు విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలు చూసుకోవచ్చు. అభ్యర్థులు తమ స్ట్రీమ్, రిజిస్ట్రేషన్ నెంబరు, హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ఈసెట్ ఫలితాలు చూసుకోవచ్చు. అదేవిధంగా రిజిస్ట్రేషన్ నెంబరు, హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ఈసెట్ ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా మే 8న నిర్వహించిన ఈసెట్ పరీక్షకు మొత్తం 36,369 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఏపీఈసెట్ ఫలితాల్లో 90.41 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇందులో బాలురు 89.35 శాతం బాలురు ఉత్తీర్ణులు కాగా.. బాలికలు 93.34 శాతం బాలురు ఉత్తీర్ణులయ్యారు.

AP ECET 2024 ఫలితాలు ఇలా చూసుకోండి..

AP ECET-2024 RESULTS CLICK HERE

Step 1: ఈసెట్ ఫలితాల కోసం అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి-https://cets.apsche.ap.gov.in/ECET/ECET/ECET_HomePage.aspx 

Step 2: అక్కడ హోంపేజీలో కిందిభాగంలో కనిపించే  AP ECET 2024 Results లింక్ మీద క్లిక్ చేయాలి. 

Step 3: ఆ తర్వాత వచ్చే పేజీలో అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, ఈసెట్ హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదు చేయాలి.

Step 4: ఈసెట్ ఫలితాలు కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపిస్తాయి.

Step 5: ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకొని, ప్రింట్ తీసుకోవాలి. భవిష్యత్ అవసరాల కోసం భద్రపరచుకోవాలి. 

ఈసెట్ ఫలితాల కోసం క్లిక్ చేయండి

ఈసెట్ ర్యాంకు కార్డుల కోసం క్లిక్ చేయండి..

Sale-Text-books-ap-cost-of-govt-text-books-for-2024-25

Sale-Text-books-ap-cost-of-govt-text-books-for-2024-25

AP Cost of Govt Text Books for 2024-25 | 1st to 10th APSCERT Text Books Price Calculator*
▪️ఏపీ ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు ప్రైవేట్ స్కూల్స్ కి సరఫరా కొరకు నిర్దేశించిన ధరల వివరాలు విడుదల 
▪️ప్రైవేట్ స్కూల్స్ బుక్స్ ఆర్డర్ పెట్టె విధానం, పుస్తకాలు లభించే షాప్ ల వివరాలు, తరగతి వారీగా ఒక్కో టెక్స్ట్ బుక్ / వర్క్ బుక్ ధర  కింది వెబ్ పేజీ లో కలవు 
User manual sale book for the AY 2024-2 CLICK HERE
Sale Component Title Master with rates for the A.Y 2024-25 CLICK HERE
ANDHRA PRADESH GOVERNMENT NEW TEXT BOOKS 2024-25 FOR 1ST CLASS TO 10TH CLASS ALL SUBJECTS PDF FILES.

2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి 1 నుండి 10వ తరగతి వరకు పాఠ్య పుస్తకాలను పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్ లో ఉంచింది. డౌన్లోడ్ చేసుకోండి..!!*_అఫిషియల్ పాఠ్య పుస్తకాల డౌన్లోడ్ లింక్ : 
1st CLASS TEXT BOOKS CLICK HERE
2nd CLASS TEXT BOOKS CLICK HERE
3rd CLASS TEXT BOOKS CLICK HERE
4TH CLASS TEXT BOOKS CLICK HERE
5TH CLASS TEXT BOOKS CLICK HERE
6TH CLASS TEXT BOOKS CLICK HERE
7TH CLASS TEXT BOOKS CLICK HERE
8TH CLASS TEXT BOOKS CLICK HERE
9TH CLASS TEXT BOOKS CLICK HERE
10TH CLASS TEXT BOOKS CLICK HERE
*Dear RJDs, DEOs, Dy EOs and MEOs,*
1) The Andhra Pradesh government mandates the use of state-prescribed textbooks in all recognized government and private schools. These textbooks must be provided to all private school students.
2) Comprehensive guidelines and an SOP for textbook indenting and distribution to private schools have been designed as done last year to ensure textbooks are provided to students studying in private schools.
3) Printed textbooks for the 2024-25 academic year are available at designated bookshops, with title-wise rates notified.
4) To collect books, private school HMs must place orders at school login https://cse.ap.gov.in with a 5% advance payment. The remaining balance is payable at the bookshop where the books can be collected. The list of designated bookshops is available in their logins.
5) Regional Joint Directors (RJDs) and District Education Officers (DEOs) are requested to follow the instructions issued by the Commissioner of School Education (CSE) sir and the SOP on textbook sales and distribution. Detailed information, including MRP rates of each title, class-wise set costs, bookshop details, and available bookshops, is annexed.
You are requested to communicate these instructions to all field functionaries and private school management in the state to ensure that all students in private schools receive the government-prescribed textbooks for the AY 2024-25.
CSE AP OFFICIAL WEBSITE LINK CLICK HERE

whatsapp-ai-feature-updates

whatsapp-ai-feature-updates

WhatsApp Update వాట్సాప్ కొత్త ఫీచర్‌తో DP ఆటోమెటిక్‌గా సెట్ అవుతుందట.. ఇంకా ఏయే ఫీచర్లంటే…!

WhatsApp Update స్మార్ట్‌ఫోన్ వాడే యూజర్లందరూ కచ్చితంగా వాట్సాప్ యాప్ వాడతారనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది వాడుతున్న ఏకైక మెసెజింగ్ యాప్ వాట్సాప్. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత టెక్నాలజీ ప్రపంచంలో వాట్సాప్ యూజర్ల అవసరాలకు అనుగుణంగా కొత్త కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. అతి త్వరలో మరో సరికొత్త ఫీచర్‌ను త్వరలో తీసుకురానుంది. ఇప్పటివరకు మెసెజెస్, ఆడియో, వీడియో కాల్స్‌కు మాత్రమే పరిమితమైన వాట్సాప్ తాజాగా AI ఫీచర్‌ను జోడించనుంది. ప్రస్తుతానికి ఈ కొత్త ఫీచర్ టెస్టింగ్ దశలో ఉంది. దీని ద్వారా మీ DPని చాలా ఈజీగా అప్డేట్ చేయొచ్చు. దీని ప్రత్యేకత ఏంటంటే మీ DP ఆటోమేటిక్‌గా క్రియేట్ అవుతుంది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇటీవలే వెలుగులోకి వచ్చింది. టిప్‌స్టర్ ఈ ఇన్ఫర్మేషన్‌ను షేర్ చేసింది.

ప్రొఫైల్ ఫోటో సెట్ చేయండి..

ఈ ఫీచర్ వచ్చిన తర్వాత, మీరు AI రూపొందించిన ప్రొఫైల్ చిత్రాన్ని మీ DPగా వాడొచ్చు. ఇది మీకు పూర్తిగా భిన్నమైన అనుభూతిని కలిగిస్తుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ డెవలప్‌మెంట్‌పైనే వాట్సాప్ పని చేస్తోంది. ఒకసారి ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిందంటే చాలు.. యూజర్లు దీన్ని కచ్చితంగా, చాలా ఇష్టంగా వాడతారని నిపుణులు చెబుతున్నారు. అయితే దీనికి సంబంధించి వాట్సాప్ కంపెనీ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు

rank-cards-5th-class-mjpapbc-welfare-residential-schools

Rank Card For 5th Class Admissions in MJPAPBC Welfare Residential Educational Institutions 2024-25

Mahatma Jyotiba Phule Andhra Pradesh Backward Classes Welfare Residential Educational Institutions(Vijayawada) GOVERNMENT OF ANDHRA PRADESH

మహాత్మా జ్యోతిబాపూలే
బి.సి. సంక్షేమ సంస్థలలో 2024-25 విద్యా సం. 5వ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు, ర్యాంక్ కార్డ్స్ విడుదల.*
Rank Card For 5th Class Admissions in MJPAPBC Welfare Residential Educational Institutions 2024-25
https://mjpapbcwreis.apcfss.in/fifth-rankcard

AP EAPCET 2024 Response Sheets-Master Question Paper with Key-objections

AP EAPCET 2024 Response Sheets-Master Question Paper with Key-objections

AP EAPCET: ఏపీ ఎప్‌సెట్ ఇంజినీరింగ్ స్ట్రీమ్ ఆన్సర్ ‘కీ’ విడుదల, అభ్యంతరాల నమోదుకు మే 26 వరకు అవకాశం

P EAPCET 2024 Engineering Stream Answer Key: ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఎప్‌సెట్ పరీక్షలు మే 23తో ముగిసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అగ్రికల్చర్, ఫార్మా పరీక్షలకు సంబంధించిన ఆన్సర్ కీని విడుదల చేసిన అధికారులు మే 24న ఉదయం 10 గంటలకు ఇంజినీరింగ్ విభాగానికి నిర్వహించిన పరీక్షల ఆన్సర్ కీని, మాస్టర్ క్వశ్చన్ పేపర్లను, అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో వాటిని అందుబాటులో ఉంచారు. ఆన్సర్ ‘కీ’ పై మే 26న ఉదయం 10 గంటల వరకు అభ్యంతరాలు తెలిపడానికి అవకాశం ఇచ్చారు. 

Master Question Papers With Preliminary Keys

మే 25 వరకు అగ్రికల్చర్, ఫార్మసీ ఆన్సర్ కీ అభ్యంతరాలకు అవకాశం..
ఏపీ ఎప్‌సెట్ పరీక్షలకు సంబంధించి మే 16, 17 తేదీల్లో నిర్వహించిన అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగాలకు సంబంధించిన ప్రిలిమినరీ ఆన్సర్ ‘కీ’ని జేఎన్‌టీయూ కాకినాడ మే 23న విడుదల చేసిన సంగతి తెలిసిందే. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది. ఆన్సర్ కీతోపాటు అభ్యర్థుల రెస్పాన్స్‌ షీట్లను కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఆన్సర్ కీపై ఏమైనా సందేహాలుంటే తెలిపేందుకు అవకాశం కల్పించారు. అభ్యర్థులు మే 25న ఉదయం 10 గంటల వరకు ఆన్సర్ కీపై అభ్యంతరాలను తెలియజేయవచ్చు.

ఏపీ ఎప్‌సెట్ పరీక్షలకు 93.47 శాతం అభ్యర్థులు హాజరు..
ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశాలకు మే 16న ప్రారంభమైన ఎప్‌సెట్ పరీక్షలు మే 23తో ముగిశాయి. ఇందులో మే 16, 17 తేదీల్లో అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగాలకు; మే 18 నుంచి 23 వరకు ఇంజినీరింగ్‌ విభాగానికి పరీక్షలు నిర్వహించారు. హైదరాబాద్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా 142 పరీక్ష కేంద్రాల్లో ఎప్‌సెట్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు మొత్తం 3,62,851 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. వీరిలో 3,39,139 మంది విద్యార్థులకు పరీక్షలకు హాజరయ్యారు. మొత్తం 93.47 శాతం హాజరు నమోదైంది. ఇంజినీరింగ్‌ విభాగంలో మొత్తం 2,74,213 మందికి గాను 2,58,373 (94.22 శాతం) మంది పరీక్షలు రాశారు. ఇక బైపీసీ విభాగానికి సంబంధించి మొత్తం 88,638 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. ఇందులో 80,766 (91.12 శాతం) విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.

ఇంటర్ మార్కులకు వెయిటేజీ..
ఏపీ ఎప్‌సెట్‌-2024లో ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇవ్వనున్నారు. ఇందుకోసం ఇతర బోర్డులకు సంబంధించిన విద్యార్థులు తమ ఇంటర్‌ మార్కుల మెమోలను అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. విద్యార్థులకు ఏమైనా సందేహాలుంటే పరిష్కరించేందుకు ఫోన్‌ నెంబర్లు: 0884-2359599, 2342499 అందుబాటులో ఉంచారు. వీటిద్వారా సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. 

tv9-kab-education-summit-2024-in-hitex-exibition

tv9-kab-education-summit-2024-in-hitex-exibition

TV9–KAB Education Summit 2024: ఉన్నత విద్య, భవిష్యత్తుపై సందేహాలున్నాయా..? మెగా ఎడ్యుకేషన్‌ సమ్మిట్‌.. పూర్తి వివరాలివే..

మీ పిల్లల ఉన్నత భవిష్యత్తు.. విద్య, అవకాశాలపై సందేహాలున్నాయా..? అయితే.. ఎంట్రీ ఫ్రీ.. సూచనలు కూడా ఫ్రీ.. త్వరలోనే హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వేదికగా టీవీ9 – కేఏబీ ఎడ్యుకేషన్‌ సమ్మిట్‌ జరగనుంది. TV9, KAB Education Consultants సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ఎడ్యుకేషన్ సమ్మిట్‌కు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరై నిపుణులతో మాట్లాడి తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.. వాస్తవానికి ప్రతీ సంవత్సరం TV9 నిర్వహిస్తోన్న ఎడుకేషన్ సమ్మిట్ ద్వారా ఎంతో మంది ఇంటర్(+2), డిప్లొమా విద్యార్థులు తదుపరి విద్యావకాశాల గురించి, కాలేజీల గురించి, ఇన్‌స్టిట్యూట్‌ల గురించి తెసుకోవడంతో పాటు తెలుగు రాష్ట్రాలలో ప్రతిష్టాత్మకమైన ఉన్నత విద్యా ప్రవేశ పరీక్షలు EAPCET, NEET, JOSAA, E-CET వెబ్ కౌన్సిలింగ్‌లలో అప్షన్స్ నమోదు చేసుకోవడానికి ఎక్స్‌పర్ట్ సలహాలు, సూచనలు పొందుతున్నారు.

ప్రతిష్టాత్మక కాలేజీలు, ఇన్‌స్టిట్యూట్‌లు, డీమ్డ్ యూనివర్సిటీల ప్రతినిధులతో కలిసి నేరుగా మాట్లాడే అవకాశం కల్పించే ఈ TV9 Education Summit 2024 మే 31 నుంచి జూన్ 2వ తేదీ వరకు హైదరాబాద్ హైటెక్ సిటీ లోని HITEX Exhibition Centre లో జరగబోతోంది.

TV9, KAB Education Consultancy సంయుక్తంగా నిర్వహించే.. అతిపెద్ద ఎడ్యుకేషనల్ సమ్మిట్ హైదరాబాద్‌లో 31 మే, జూన్ 1, 2 వ తేదీలలో జరగనుంది.. జూన్ 8, 9వ తేదీలలో విజయవాడలో, జూన్ 9న విశాఖపట్నంలో జరగనుంది..

ఎన్నో ప్రఖ్యాత కాలేజీలు యూనివర్సిటీలు పాల్గొనే ఈ Education Summitలో, విద్యార్థులు +2, Diploma తరువాత తదుపరి విద్యావకాశాలు, పలురకాల కోర్సులు, వాటికి సంబందించిన కాలేజీలు, యూనివర్సిటీల వివరాలు తెలుసుకోవచ్చు.

ఇంజనీరింగ్, మెడిసిన్, అగ్రికల్చర్, ఫార్మసీ, హోటల్ మేనేజ్‌మెంట్, బిజినెస్ మేనేజ్‌మెంట్, CA లాంటి ఎన్నో కోర్సులు కాలేజీల గురించి గైడెన్స్ ఇస్తూ ఎన్నో ప్రఖ్యాత విద్యాసంస్థల గురించి తెలియజేసే ఈ Education Summit విద్యార్థులకు ఎంతో ఉపయోగపడనుంది.. భవిష్యత్తుపై సందేహాల నివృత్తి, ఉన్నత విద్యకు సంబంధించిన సమాచారాన్నిఅందించడంతోపాటు.. రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రతిష్టాత్మకమైన ఉన్నత విద్యా ప్రవేశ పరీక్షలు EAPCET, NEET, JOSAA, E-CET వెబ్ కౌన్సిలింగ్ లలో అప్షన్స్ నమోదు చేసుకోవడానికి ఎక్స్ పర్ట్ సలహాలు, సూచనలు విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అందించనుంది..

తెలుగు రాష్ట్రాల్లో TV9, KAB Education Summit 2024 నిర్వహణ వివరాలు..

  • Hyderabad: 31 May, 1st & 2nd June‘ 2024, Hall 3, HITEX Exhibition Centre, Hitech City.
  • Vijayawada: June 8th & 9th’ 2024 – SS Convention Centres, Lane Opp: PVP Mall, MG Road.
  • Visakhapatnam: June 9th’ 2024 – VMRDA Children’s Arena, Siripuram.

new-rules-for-getting-driving-licence-training

new-rules-for-getting-driving-licence-training

Driving License: ఎక్కడ డ్రైవింగ్ నేర్చుకుంటే.. అక్కడే లైసెన్స్.. జూన్ 1 నుంచే అమల్లోకి

డ్రైవింగ్ లైసెన్స్” కోసం ఇకపై జూన్ 1 నుండి కొత్త నిబంధన అమలులోకి వస్తుంది

డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆర్టీవో కార్యాలయం చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయారా? ఇకపై మీకా బాధ అక్కర్లేదు. జూన్ 1 నుంచి ప్రైవేటు శిక్షణ సంస్థలే డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించి లైసెన్స్ చేతికి అందిస్తాయి.

డ్రైవింగ్ లైసెన్స్ విధానంలో కేంద్రం భారీ మార్పులు చేస్తూ నిబంధనలు జారీచేసింది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచే ఇది అమల్లోకి వస్తుంది. ప్రైవేటు సంస్థలకు డ్రైవింగ్ సర్టిఫికెట్ జారీచేసేందుకు అనుమతినిచ్చిన కేంద్రం అందుకు కొన్ని నిబంధనలు విధించింది

ఆ సంస్థలకు కనీసం ఎకరం భూమి ఉండాలి. ఫోర్ వీలర్ డ్రైవింగ్ శిక్షణ కోసం అదనంగా మూడు ఎకరాల భూమి ఉండాలి. ముఖ్యంగా ఆ సెంటర్ అందరికీ అందుబాటులో ఉండాలి. రాకపోకలకు ఎలాంటి అంతరాయమూ ఉండకూడదు. శిక్షణ ఇచ్చే వారు కనీసం హైస్కూలు విద్యను పూర్తిచేసి ఉండాలి.

డ్రైవింగ్‌లో ఐదేళ్ల అనుభవం ఉండాలి. బయోమెట్రిక్స్, టెక్నాలజీపై ప్రాథమిక అవగాహన ఉండాలి.

ఇవన్నీ ఉంటేనే ప్రభుత్వం ఆ సంస్థలకు అనుమతినిస్తుంది. లైట్ వెహికల్ ట్రైనింగ్‌ను కచ్చితంగా 4 వారాల్లో పూర్తిచేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కనీసం 29 గంటల శిక్షణ ఇవ్వాలి. ఇది థియరీ, ప్రాక్టికల్ రూపంలో ఉండాలి. థియరీలో 8 గంటలు, ప్రాక్టికల్‌లో 21 గంటల శిక్షణ ఇవ్వాలి.

హెవీ మోటార్ వాహనాల డ్రైవింగ్‌కు ఆరువారాల పాటు కనీసం 39 గంటల ట్రైనింగ్ ఇవ్వాలి. ఇందులో 8 గంటల థియరీ, 31 గంటల ప్రాక్టికల్ తరగతులు ఉండాలి. ఫీజుల విషయానికొస్తే.. లెర్నర్ లైసెన్స్ 200 రూపాయలు, లెర్నర్ లైసెన్స్ రెన్యువల్ 200 రూ. , పెర్మనంట్ లైసెన్స్ 200 రూపాయలు, ఇంటర్నేషనల్ లైసెన్స్ 1000 రూపాయలుగా ఉంది.

IIIT Sri City PhD Admissions-2024-25

IIIT Sri City PhD Admissions-2024-25

IIIT Sri City PhD Admissions: ట్రిపుల్‌ఐటీ శ్రీసిటీ, చిత్తూరులో పీహెచ్‌డీ కోర్సులు – దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా

చిత్తూరు-శ్రీ సిటీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ (IIIT) 2024 విద్యాసంవత్సరానికి (మాన్‌సూన్‌)గాను పీహెచ్‌డీ ఫుల్‌టైం/పార్ట్‌టైమ్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

IIIT Sri City PhD Admissions: చిత్తూరు-శ్రీ సిటీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ (IIIT) 2024 విద్యాసంవత్సరానికి (మాన్‌సూన్‌)గాను పీహెచ్‌డీ ఫుల్‌టైం/పార్ట్‌టైమ్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. సంబంధిత స్పెషలైజేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మే 20న ప్రారంభమైంది. అభ్యర్థులు జూన్ 20 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తు ఫీజుగా జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.200 చెల్లిస్తే సరిపోతుంది. ఫుల్‌టైమ్ పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌కు రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. అదేవిధంగా పార్ట్-టైమ్ పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌కు షార్ట్‌లిస్ట్, టెక్నికల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ఎంపికైనవారికి సంస్థ/ఎంహెచ్‌ఆర్డీ నిబంధనల మేరకు రూ.37,000 -రూ.42,000 వరకు ఫెలోషిప్ అందిస్తారు. 

వివరాలు..

* పీహెచ్‌డీ ప్రోగ్రామ్ 

1)  పీహెచ్‌డీ ఫుల్‌టైం ప్రోగ్రామ్- మాన్‌సూన్‌ 2024

విభాగాలు: సీఎస్‌ఈ, ఈసీఈ, మ్యాథమెటిక్స్ & డేటా సైన్స్.

అర్హతలు..

➥ సీఎస్‌ఈ విభాగానికి మాస్టర్స్ డిగ్రీ (ఎంఈ/ఎంటెక్) అర్హత ఉండాలి. (లేదా) సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్‌తోపాటు ఎంఎస్ రిసెర్చ్ (లేదా) సంబంధిత విభాగంలో ఎంఈ/ఎంటెక్‌తోపాటు ఎంఎస్సీ (కంప్యూటర్ సైన్స్) ఉత్తీర్ణత ఉండాలి. 

➥ ఈసీఈ విభాగానికి మాస్టర్స్ డిగ్రీ (ఎంఈ/ఎంటెక్) అర్హత ఉండాలి. (లేదా) సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్‌తోపాటు ఎంఎస్ రిసెర్చ్ (లేదా) సంబంధిత విభాగంలో ఎంఈ/ఎంటెక్‌తోపాటు ఎంఎస్సీ (కంప్యూటర్ సైన్స్) ఉత్తీర్ణత ఉండాలి. 

➥ మ్యాథమెటిక్స్ & డేటా సైన్స్ విభాగానికి మ్యాథమెటిక్స్/స్టాటిస్టిక్స్ విభాగాల్లో 60 శాతంతో డిగ్రీతోపాటు పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.

2)  పీహెచ్‌డీ పార్ట్‌టైమ్ ప్రోగ్రామ్- మాన్‌సూన్‌ 2024

విభాగాలు: సీఎస్‌ఈ, ఈసీఈ, మ్యాథమెటిక్స్ & డేటా సైన్స్.

అర్హతలు..

➥ సీఎస్‌ఈ/ఈసీఈ విభాగానికి కనీసం 60 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ (ఎంఈ/ఎంటెక్) లేదా ఎంఎస్ (రిసెర్చ్) ఉత్తీర్ణత ఉండాలి. (లేదా) ఎంఎస్సీ డిగ్రీ (కంప్యూటర్స్/ ఎలక్ట్రానిక్స్/ ఫిజిక్స్) ఉత్తీర్ణులై ఉండాలి. (లేదా) కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి.

➥ ఈసీఈ విభాగానికి మాస్టర్స్ డిగ్రీ (ఎంఈ/ఎంటెక్) అర్హత ఉండాలి. (లేదా) సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్‌తోపాటు ఎంఎస్ రిసెర్చ్ (లేదా) సంబంధిత విభాగంలో ఎంఈ/ఎంటెక్‌తోపాటు ఎంఎస్సీ (కంప్యూటర్ సైన్స్) ఉత్తీర్ణత ఉండాలి. 

➥ మ్యాథమెటిక్స్ & డేటా సైన్స్ విభాగానికి 60 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ (మ్యాథమెటిక్స్) ఉత్తీర్ణులై ఉండాలి.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.200 చెల్లిస్తే సరిపోతుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ప్రవేశ విధానం: ఫుల్‌టైమ్ పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌కు రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. అదేవిధంగా పార్ట్-టైమ్ పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌కు షార్ట్‌లిస్ట్, టెక్నికల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

ముఖ్యమైన తేదీలు…

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 20.05.2024.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 20.06.2024.

PhD Admissions (Full-Time) Monsoon 2024 Notification

Online Application

PhD Admissions (Part-Time) – Monsoon 2024 Notification

Online Application

Website

mParivahan-app-driving-license-no-problem

mParivahan-app-driving-license-no-problem

mParivahan App | ఈ యాప్స్ ఉంటే.. డ్రైవింగ్ లైసెన్స్.. ఆర్సీ వెంట లేకున్నా నో ప్రాబ్లం

MParivahan App | ఇప్పుడు ప్రతి ఒక్కరూ టూ వీలర్.. కారు నడుపుతున్నారు. అయితే, వాహనాల యజమానులు రోడ్లపైకి వస్తే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాల్సిందే. ఒకవేళ పొరపాటుగా డ్రైవింగ్ లైసెన్స్ మరిచిపోయినా, ఆర్సీ, పొల్యూషన్ సర్టిఫికెట్, బీమా పాలసీ సర్టిఫికెట్ వంటి పత్రాలు లేకున్నా వాహనాల యజమానులు ఇబ్బందుల్లో పడ్డట్లే.

మోటారు వాహన చట్టం ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్, ఇతర పత్రాలు లేకుండా ట్రాఫిక్ పోలీసులకు చిక్కారో సుమారు రూ.5000 వరకూ ఫైన్ పే చేయాల్సిందే.

అయితే, అంతా డిజిటలైజేషన్ అవుతున్న నేపథ్యంలో ఆందోళన చెందనక్కర్లేదు. డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, తదితర పత్రాలు వెంట పెట్టుకోవాల్సిన అవసరం లేదు. టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలు ఒకే చోట ఉండేలా యాప్స్ రూపొందించిందీ కేంద్ర ప్రభుత్వం. డిజిలాకర్, ఎం-పరివాహన్ వంటి మొబైల్ యాప్ ల్లో డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్ సీ), పొల్యూషన్ సర్టిఫికెట్, బీమా పాలసీ సర్టిఫికెట్ అప్ లోడ్ చేసుకోవచ్చు. 2018 నుంచి కేంద్ర రోడ్డు రవాణా శాఖ ఈ డిజిలాకర్, ఎం-పరివాహన్ యాప్స్‌లో అప్ లోడ్ పత్రాలను నిజమైన డాక్యుమెంట్స్ గా పరిగణించాలని తెలిపింది.

mParivarthan app download link click here

mParivarthan main website link click here

error: Content is protected !!