Opening-online nominations-2024-25-inspire-manak-instructions

Opening-online nominations-2024-25-inspire-manak-instructions

చివరి తేదీ : 15-09-2024
ప్రస్తుతం స్కూల్ యొక్క నామినేషన్లు గత వారం క్రితం కొత్తగా డెవలప్ చేసిన inspire Manak app నందు మాత్రమే upload అవుతున్నాయి.
app లో చాలా easy గా అవుతున్నాయి.
మన మిత్రుల సౌకర్యార్థం App లో ఏ విధంగా నామినేషన్ సబ్మిట్ చేయాలో వివరిస్తున్నాను.
https://apteachers360.com/
Step 1 :* Play Store లో inspire manak App download చేసుకుని ఇన్స్టాల్ చేయాలి.

INSPIRE MANAK MOBILE APP LINK
*Step 2 :* User name and password తో login అవ్వాలి.
*Step 3:* నామినేషన్ల సంఖ్య 5 ఎంటర్ చేసి డిక్లరేషన్ okay చేసి నెక్స్ట్ కి వెళ్ళాలి.
*Step 4:* ఇప్పుడు Add student అనే icons ఐదు display అవుతాయి… అందులో మొదటి add student మీద క్లిక్ చేయగానే స్టూడెంట్ details open అవుతాయి.
మొదట గా స్టూడెంట్ ఫోటో upload చేయాలి. తరువాత స్టూడెంట్ బేసిక్ details
1.Student Name as per bank account
2. Father Name
3. Mother Name
4. Gender
5. DOB
6. Aadhar number

7. Physical Handicapped
7. Contact Number
8. Mail Id

9.Class

10. Category.

11. Idea/Innovation Title (English Only)

12.Brief Write-up on the Idea/Innovation

13. Guide Teacher Name

14. Name of the Bank

15. Name and address of the Bank

16. Account Number

17. Repeat Account Number

18. Account Holder Name

19. IFSC Code

20. Repeat IFSC Code of Bank

21. Passbook Image (Image format, file size maximum 2Mb)

22. Language of the synopsis file (pdf or word file, maximum size 2Mb)

23. Upload Idea/Innovation Photo (Optional)

24. Upload Idea/Innovation Video (Optional)

25. SAVE

ఇంతటితో ఒక స్టూడెంట్ details upload అయిపోతాయి. ఇదే విధంగా మిగతా స్టూడెంట్ nominations కూడా సబ్మిట్ చేయవలెను.

ఇన్‌స్పైర్ అవార్డ్ మనక్ స్కీమ్ అనేది 10-15 ఏళ్లలోపు మరియు చదువుతున్న పాఠశాల విద్యార్థులలో సృజనాత్మక ఆలోచనను పెంపొందించే ప్రాథమిక లక్ష్యంతో ఈ డిపార్ట్‌మెంట్ ద్వారా అమలు చేయబడిన ఒక ప్రధాన కార్యక్రమం.

 ఈ లింక్‌ని ఉపయోగించి: www.inspireawards-dst.gov.in. 2024-25 కోసం ఆన్‌లైన్ నామినేషన్లు 01 July 2024 నుండి పునఃప్రారంభo.

ప్రతీ ఉన్నత పాఠశాల తప్పనిసరిగా 5 ప్రాజెక్టులు,  ప్రాధమికోన్నత పాఠశాల 3 ప్రాజెక్టు లు nominate చేయాలి. 

పాఠశాలలు తమ ఆన్‌లైన్ నామినేషన్లను 15 సెప్టెంబరు 2024 వరకు సమర్పించగలరు.

All the HMs are informed that INSPIRE MANAK login will show “Invalid User ID or Password”.
We have to Click on “FORGET PASSWORD”.
Then we have to Type Application No. and Captcha.
Then Click on “Get Password”.
A link will be mailed to your registered mail.
Click the link.
A window displays asking User ID (Old User ID), Password, Retype Password, Enter Captcha and Click on “Save”.
New Password will be saved succesfullly.
Now you can login to Your School INSPIRE login.
Note: You may remain your “OLD PASSWORD” also.

INSPIRE MANAK MOBILE APP LINK CLICK HERE

Inspire Manak website School Login

CHECK YOUR SCHOOL APPLICATION NUMBER , MOBILE & E MAIL CLICK HERE

542 INSPIRE SCIENCE PROJECTS & YOUTUBE LINKS

SCIENCE PROJECTS MODELS & WRITE UP (TELUGU) PDF

APPLICATION FOR ONLINE NOMINATIONS IN INSPIRE MANAK AWARDS

Procedure to submit Inspire Manak Project

First the following information may be collected given in three steps before to submit the project:

APPLICATION FOR ONLINE NOMINATIONS IN INSPIRE MANAK AWARDS

STEP:  I Particulars of the students being nominated for the INSPIRE awards

1.    Student name (As per Bank Pass Book) *:

2.    Father name *:

3.    Mother name *:

4.    Gender *:

5.    Date of Birth *:

6.    Aadhar Number(UID) :

7.    Contact Number:

8.    Physically Handicapped:

9.    E-mail address, if any (of the nominated students):

10. Class *:

11. Category *:

12. Idea /Innovation Title *:

13. Brief write-up on the Idea /Innovation (not exceeding 300 words) *:

14. Teacher Guide Name:

STEP: II Direct credit in the bank a/c of selected student through Electronic

Fund Transfer (EFT) mode.

(Details of bank account of nominated student for receiving the Award amount Rs10000/- through ECS)

1.    Name of Bank *:

2.    Name & Address of Bank *:

3.    Account Number *:

4.    Repeat Account Number *:

5.    Account Holder’s Name *:

6.    IFSC Code of Bank *:

7.  Repeat IFSC Code of Bank * :

STEP: III Upload details

  1. Student Photo:

(Photo should be in jpg, pnj, gif, bmp or jpeg format and size should not be more than 2MB)

2. Select Project Synopsis Language 

  1. Upload Project Synopsis(File type should be in pdf and word format).maximum file size should be 2MB)
  2. Upload Idea /Innovation Photo.

(Photo should be in jpg, pnj, gif, bmp or jpeg format and size should not be more than 2MB.)

  1. Upload Idea/Innovation Video/Audio

(Video should be in mp4,3gp,flv,Avi,wmv,amr,MP3 format and size should not be more than 5MB)

Open the website by clicking the following link or copy and paste the link on the browser

http://www.inspireawards-dst.gov.in/

  1. Login into the school authority
  • To Login- Click Here.
  1. Fill the boxes
  2. Enter user name
  3. Enter password
  4. Enter captcha code
  5. Click login
  6. Page 1 will open
  7. Enter the information as given STEP I and II above

10.Click SUBMIT

11.Upload   Student photo,

project synopsis,

Project photo

Project Video

Click Save and Upload

12.Farward to District authority

  1. Take Print out of the Acknowledgement

ఎవరైనా మీ Inspire User ID , password మరచిపోతే వెంటనే మీ మీ డివిజన్ కోఆర్డినేటర్లను సంప్రదించి తెలుసుకోవాలి.  ముందుగానే Topic లను ఎంచుకుని division level orientation Program జరిగేనాటికి సిద్దంగా ఉండాలి.

 students A/c numbers, Aadhar numbers, DOB, Cast , Photo , Father & Mother names ను సిద్దంగా ఉoచుకోవాలి. 

ONLINE APPLICATION 2024-25

INSPIRE WEBSITE

APPLICATION FOR ONLINE NOMINATIONS IN INSPIRE MANAK AWARDS

FOR MORE DETAILS HERE ABOUT INSPIRE SCIENCE PROJECTS PDF

to-know-the-aadhar-card-history-details

to-know-the-aadhar-card-history-details

Aadhaar: మీ ఆధార్‌ కార్డ్‌ను ఎక్కడెక్కడ ఉపయోగించారో ఎలా తెలుసుకోవాలంటే..

అయితే మన ఆధార్‌ కార్డును ఎక్కడెక్కడ ఉపయోగించాం.? వేరే వారు ఎవరైనా మన ఆధార్‌ కార్డును దుర్వినియోగం చేస్తున్నారా.? అన్న అనుమానం వస్తే తెలుసుకోవడానికి ఒక ట్రిక్ అందుబాటులో ఉంది. ఇందుకోసం ఆధార్‌ కార్డ్‌ హిస్టరీని చెక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో మీ అనుమతి లేకుండా ఎవరైనా మీ కార్డును ఉపయోగిస్తే సులువుగా తెలుసుకోవచ్చు…ఆధార్‌ కార్డ్‌ వినియోగం ప్రస్తుతం అనివార్యం. సిమ్‌ కార్డ్‌ మొదలు, ఫ్లైట్ టికెట్ వరకు అన్నింటికీ ఆధార్‌ కార్డ్‌ ఉండాల్సిందే. దీంతో ఎక్కడ పడితే అక్కడ ఆధార్‌ కార్డ్ జిరాక్స్‌లు ఇస్తున్నాము. అయితే కొన్ని సందర్భాల్లో ఆధార్‌ దుర్వినియోగం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కొందరు నేరస్థులు మన ప్రయేమం లేకుండానే ఆధార్‌ కార్డును దుర్వినియోగం చేస్తున్నారు.

అయితే మన ఆధార్‌ కార్డును ఎక్కడెక్కడ ఉపయోగించాం.? వేరే వారు ఎవరైనా మన ఆధార్‌ కార్డును దుర్వినియోగం చేస్తున్నారా.? అన్న అనుమానం వస్తే తెలుసుకోవడానికి ఒక ట్రిక్ అందుబాటులో ఉంది. ఇందుకోసం ఆధార్‌ కార్డ్‌ హిస్టరీని చెక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో మీ అనుమతి లేకుండా ఎవరైనా మీ కార్డును ఉపయోగిస్తే సులువుగా తెలుసుకోవచ్చు. ఇంతకీ ఆధార్‌ హిస్టరీ ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

* ఇందుకోసం ముందుగా ఆధార్‌ అధికారిక వెబ్‌సైట్‌పోర్టల్‌లోకి వెళ్లాలి.

 అనంతరం ఎడమ వైపు కనిపించే My Aadhaar ఆప్షన్‌లో కనిపించే Aadhaar services ఆప్షన్‌ను సెలక్ట్‌ చేసుకోవాలి.

* తర్వాత కిందికి స్క్రోల్‌ చేసి Aadhaar Authentication History ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. వెంటనే లాగిన్‌ కోసం కొత్త పేజీ ఓపెన్‌ అవుతుంది.

* లాగిన్‌ ఆప్షన్‌పై క్లిక్ చేసిన తర్వాత ఆధార్‌ నెంబర్‌, క్యాప్చాను ఎంటర్‌ చేయాలి. మొబైల్‌ నెంబర్‌కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేయాలి.

* తర్వాత ఓపెన్‌ అయ్యే స్క్రీన్‌లో కిందికి స్క్రోల్‌ చేస్తే Authentication History ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

* అనంతరం ‘ఆల్‌’ ఆప్షన్‌ను క్లిక్‌ చేసిన వెంటనే డేట్‌ను ఎంపిక చేసుకొని Fetch Authentication History ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

* దీంతో ఆధార్‌కు లింక్‌ చేసిన ఓటీపీ, బయోమెట్రిక్‌, డెమోగ్రాఫిక్‌ ద్వారా మీ ఆధార్‌ కార్డును ఆరు నెలలుగా ఎక్కడెక్కడ వినియోగించారనే వివరాలు వెంటనే స్క్రీన్‌పై కనిపిస్తాయి.

government-jobs-recruitment-at-ssc-ibps-railway-pnb-jobs

government-jobs-recruitment-at-ssc-ibps-railway-pnb-jobs

Government Jobs : 35,985 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. నోటిఫికేషన్లు విడుదల

Central Government Jobs : టెన్త్‌, డిగ్రీ, పీజీ, డిప్లొమా, ఇంజినీరింగ్‌ తదితర కోర్సులు పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్‌. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌, ఐబీపీఎస్‌, రైల్వే వంటి సంస్థలు పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేశారు. వివరాల్లోకెళ్తే..

SSC CGL Notification 2024 : డిగ్రీ అర్హతతో.. 17,727 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కంబైన్డ్ గ్రాడ్యుయేట్‌ లెవల్ (CGL) పరీక్ష-2024కు సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదల చేసింది. SSC CGL 2024 పరీక్ష ద్వారా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని గ్రూప్-బీ, గ్రూప్-సీ విభాగాల్లోని ఖాళీలను భర్తీ చేయనున్నారు. వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని మొత్తం 17,727 గ్రూప్-బి, గ్రూప్-సి విభాగాల్లోని ఖాళీలను భర్తీ చేయడానికై SSC దరఖాస్తులు కోరుతోంది. ఏదైనా డిగ్రీ విద్యార్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. టైర్-1, టైర్-2 తదితర పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు లింక్‌ ఇదే.. క్లిక్‌ చేయండి.

SSC MTS Notification 2024 : 10th Class అర్హతతో 8,326 ప్రభుత్వ ఉద్యోగాలు.. అప్లికేషన్‌ లింక్‌ ఇదే

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC).. మరో భారీ జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కేంద్ర మంత్రిత్వ శాఖలు/ విభాగాలు/ కార్యాలయాల్లో మల్టీ-టాస్కింగ్ స్టాఫ్, హవల్దార్ పోస్టుల భర్తీకి సంబంధించిన SSC MTS 2024 నోటిఫికేషన్‌ను ఇటీవల విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 8,326 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. జనరల్ సెంట్రల్ సర్వీస్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లయ్‌ చేసుకోవచ్చు. ఆసక్తిగల అభ్యర్థులు జులై 31వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు లింక్‌ ఇదే.. క్లిక్‌ చేయండి.

IBPS Clerk Notification 2024 : డిగ్రీ అర్హతతో.. 6128 క్లర్క్‌ ఉద్యోగాలు

బ్యాంక్‌ ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్‌. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్సన‌ల్ సెల‌క్షన్ (IBPS).. 2025-2026 సంవత్సరానికి సంబంధించి కామ‌న్ రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్ (CRP)-XIV నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 6128 క్లర్క్‌ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ మొత్తం పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోనూ ఖాళీలున్నాయి. దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత‌తో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో జులై 1వ తేదీ నుంచి 21 తేదీల మధ్య దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు లింక్‌ ఇదే.. క్లిక్‌ చేయండి.

PNB Apprentice Recruitment 2024 : పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో 2700 అప్రెంటిస్‌ ఖాళీలు

న్యూఢిల్లీలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) ప్రధాన కార్యాలయం, మానవ వనరుల విభాగం.. భారీ అప్రెంటిస్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా దేశ వ్యాప్తంగా పీఎన్‌బీ శాఖల్లో 2,700 అప్రెంటిస్ ఖాళీల భర్తీ చేయనుంది. మొత్తం ఖాళీల్లో ఆంధ్రప్రదేశ్‌లో 27 పోస్టులు.. తెలంగాణలో 34 ఖాళీలు ఉన్నాయి. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో జులై 14వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు లింక్‌ ఇదే.. క్లిక్‌ చేయండి.

Railway RRC Jobs : రైల్వేలో 1104 అప్రెంటిస్ పోస్టులు.. ఎలాంటి రాత పరీక్ష లేదు

గోరఖ్‌పూర్‌లోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్- నార్త్ ఈస్ట్రన్‌ రైల్వే.. ఎన్‌ఈఆర్‌ పరిధిలోని పలు యూనిట్లలో అప్రెంటిస్‌షిప్ శిక్షణకు సంబంధించి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 1104 అప్రెంటిస్‌ పోస్టులను భర్తీ చేయనుంది. ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, పెయింటర్, మెషినిస్ట్, టర్నర్, మెకానిక్ డీజిల్, ట్రిమ్మర్ టేడ్రుల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. కనీసం 50 శాతం మార్కులతో 10వ తరగతి, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పూర్తి వివరాలకు లింక్‌ ఇదే.. క్లిక్‌ చేయండి.

B.Sc-Nursing-B.P.T-Physiotherapy-AHS-Paramedical-Courses-svims-2024-25

B.Sc-Nursing-B.P.T-Physiotherapy-AHS-Paramedical-Courses-svims-2024-25

PROSPECTUS FOR THE ACADEMIC YEAR 2024-25 (Web-based counselling) For B.Sc. Nursing, B.P.T. (Physiotherapy) & B.Sc. AHS (Paramedical) Courses.

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలోని శ్రీ వేంకటేశ్వర ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(స్విమ్స్)- బీఎస్సీ నర్సింగ్, బీపీటీ (ఫిజి యోథెరపీ), బీఎస్సీ ఏహెచ్ఎస్(పారామెడికల్) ళోప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఏపీ ఈఏపీసెట్ 2024 ర్యాంక్, కౌన్సె లింగ్ ద్వారా అడ్మిషన్స్ ఇస్తారు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ నిబంధనల మేరకు రిజర్వేషన్లు వర్తిస్తాయి.బీఎస్సీ నర్సింగ్ చేయదలచిన వారికి ప్రోగ్రామ్ వ్యవధి నాలుగేళ్లు. మొత్తం 100 సీట్లు ఉన్నాయి.

ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులకు పది సీట్లు కేటాయించారు. ప్రోగ్రామ్ ఫీజు ఏడాదికి రూ.41,000. ఈ ప్రోగ్రామ్‌కు ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్( ఐఎస్సీ) గుర్తింపు ఉంది. బీపీటీ కోర్స్ చేయదలచిన వారికి ప్రోగ్రామ్ వ్యవధి నాలుగున్నరేళ్లు ఇందులో ఎనిమిది సెమిస్టర్లు, ఆర్నెళ్లఇంటర్న్షిప్ ఉంటాయి. మొత్తం 50 సీట్లు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులకు అయిదు సీట్లు ప్రత్యేకించారు. ప్రోగ్రామ్ ఫీజు ఏడాదికి రూ.41,000. ఈ ప్రోగ్రామ్నకు ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజియోథెరపిస్ట్స్(ఐఏపీ) గుర్తింపు ఉందన్నారు.

బీఎస్సీ(పారామెడికల్) కోర్సు ప్రోగ్రామ్ వ్యవధి నాలుగేళ్లు. ఇందులో ఆరు సెమిస్టర్లు, ఏడాది ఇంటర్న్షిప్ ఉంటాయి. ప్రోగ్రామ్ ఫీజు ఏడాదికి రూ.29,000, ఈ ప్రోగ్రామ్కు ఏపీ పారామెడికల్ బోర్డు గుర్తింపు ఉందన్నారు. స్పెషలైజేషన్లు-సీట్లు యొక్క వివరాలు చూసామంటే… అనస్తీషియా టెక్నాలజీ 12, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ 20, రేడియోగ్రఫీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ 9, కార్డియాక్ పల్మ సరీ పెర్ఫ్యూజన్ టెక్నాలజీ 2, ఈసీజీ అండ్ కార్డియోవాస్క్యులర్ టెక్నాలజీ 8. డయాలసిస్ టెక్నాలజీ 12, ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ టెక్నాలజీ 1. న్యూరోఫిజియాలజీ టెక్నాలజీ 4, రేడియోథెరపీ టెక్నాలజీ 5, న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీ 2 ఉన్నాయి.

అర్హత వివరాలు

గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంగ్లీష్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రధాన సబ్జెక్టులుగా ఇంటర్/ పన్నెండోతరగతి/తత్సమాన కోర్సు ఉత్తీర్ణులైనవారు, సంబంధిత విభాగంలో ఇంటర్ ఒకేషనల్ ప్రోగ్రామ్ పూర్తిచేసినవారు,ఇంటర్ ఒకేషనల్ తో పాటు సంబంధిత బ్రిడ్జ్ కోర్సు ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. కనీసం 45 శాతం మార్కులు ఉండాలి. ఏఐఎస్ఎస్సీఈ/ ఐసీఎస్ఈ/ఎస్ఎస్సీఈ/ హెచ్ఎస్సీఈ/ఎన్ఐఐఓఎస్ అభ్యర్థులు కూడా అర్హులే.

ఏపీ ఈఏపీసెట్ 2024లో ర్యాంక్ సాధించి ఉండాలన్నారు. వయసు 2024 డిసెంబరు 31 నాటికి కనీసం 17 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్టంగా 35 ఏళ్లు మించకూడదు. 25 ఏళ్లు నిండిన అభ్యర్థులందరూ డిక్ల రేషన్ ఫారం సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నారు. దరఖాస్తు ఫీజు జనరల్ అభ్యర్థులకు రూ.2506, బీసీ, ఎస్సీ, ఎస్టీ, అభ్యర్థులకు రూ.2077ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూలై 22 గా పరిగణించారు.

AP EAPCET 2024 ర్యాంక్ ఆధారంగా శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్ యూనివర్సిటీ)… 2024-25 విద్యా సంవత్సరానికి గాను అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల.*

Courses:* B.Sc  Nursing, BPT, B.Sc. (AHS) (Paramedical)
Eligibility:* Inter (Bi.P.C) & AP EAPCET 2024 Rank

I.  B.Sc  Nursing – 100 seats

II. BPT – 50 seats

III. B.Sc. (AHS) – 78 seats  (in 10 specialities)

B.Sc Anaesthesia Technology (AT) – 12

B.Sc Medical Lab Technology  (MLT) – 20

B.Sc Neurophysiology Technology – 04

B.Sc Radiography & Imaging Technology (RIT) – 09

B.Sc Cardiac Pulmonary Perfusion Technology (CPPT) -02

B.Sc ECG and Cardiovascular Technology (ECG & CVT)-08

B.Sc Dialysis Technology (DT) –  12

B.Sc Emergency Medical Services Technology (EMST) –  04

B.Sc  Radiotherapy  Technology (RT) – 05

10.B.Sc Nuclear Medicine Technology (NMT) – 02
SVIMS BPT/B.Sc Nursing/B.Sc Paramedical Courses Admissions 2024-25 Notification, Eligibility, Schedule, Fee Payment, Online Apply Link CLICK HERE

SVIMS OFFICIAL WEBSITE LINK CLICK HERE

Online application instructions and link

UG Prospectus 2024-25

UG Admissions 2024-25 selection procedure

ssc-mts-notification-online-registration-2024

ssc-mts-notification-online-registration-2024

SSC MTS Notification: ‘టెన్త్’ అర్హతతో 8326 ఉద్యోగాలు, మల్టీటాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ వచ్చేసింది!

SSC MTS 2024: మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎగ్జామినేషన్-2024 నోటిఫికేషన్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జూన్ 28న విడుదల చేసింది. దీనిద్వారా కేంద్రప్రభుత్వ విభాగాల్లో 8326 పోస్టులను భర్తీచేయనున్నారు.

SSC MTS Notification 2024: కేంద్రప్రభుత్వంలోని పలు విభాగాల్లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (నాన్ టెక్నికల్), హవాల్దార్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జూన్ 28న విడుదల చేసింది. దీనిద్వారా 8326 పోస్టులను భర్తీచేయనున్నారు. ఇందులో మ‌ల్టీ టాస్కింగ్(నాన్ టెక్నికల్)-4887, హవిల్దార్-3439 పోస్టులు ఉన్నాయి. పదోతరగతి లేదా తత్సమాన అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జూన్ 28న ప్రారంభమైంది. అభ్యర్థులు జులై 31 వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అక్టోబరు-నవంబరు మధ్య కాలంలో కంప్యూటర్ ఆధారిత రాతపరీక్షలు నిర్వహించనున్నారు. 

వివరాలు..

✪ మ‌ల్టీ టాస్కింగ్ (నాన్ టెక్నిక‌ల్‌) స్టాఫ్ ఎగ్జామినేషన్-2024

మొత్తం ఖాళీల సంఖ్య: 8,326.

1) మల్టీటాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్): 4,887 పోస్టులు

2) హవాల్దార్ (సీబీఐసీ, సీబీఎన్): 3,439 పోస్టులు 

అర్హత: పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత. హవాల్దార్ పోస్టులకు నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

వయోపరిమితి: 01.08.2024 నాటికి మల్టీటాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు 18-25 సంవ‌త్సరాల మధ్య ఉండాలి. 02.08.1999 – 01.08.2006 మధ్య జన్మించి ఉండాలి. హవాల్దార్, ఎంటీఎస్ విభాగంలో కొన్ని పోస్టులకు 18-27 సంవ‌త్సరాల మధ్య ఉండాలి. 02.08.1997 – 01.08.2006 మధ్య జన్మించి ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10-15 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష, ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్(పీఈటీ), ఫిజికల్ స్టాండర్ట్ టెస్ట్ (పీఎస్‌టీ), డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: రూ.100. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. 

కరెక్షన్ ఫీజు: దరఖాస్తు వివరాల్లో తప్పులుంటే సరిదిద్దుకునేందుకు మొదటిసారి రూ.200, రెండోసారి అయితే  రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి దరఖాస్తుల సమయంలో పొరపాట్లు లేకుండా వివరాలు నమోదచేయడం మంచిది.

పరీక్ష విధానం..

✦ మొత్తం 270 మార్కులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. రెండు సెషన్లలో పరీక్ష నిర్వహిస్తారు. 120 మార్కులకు మొదటి సెషన్, 150 మార్కులకు రెండో సెషన్ పరీక్షలు నిర్వహిస్తారు.

✦ మొదటి సెషన్‌లో న్యూమరికల్ & మ్యాథమెటికల్ ఎబిలిటీ నుంచి 20 ప్రశ్నలు-60 మార్కులు, రీజినింగ్ ఎబిలిటీ & ప్రాబ్లం సాల్వింగ్ నుంచి 20 ప్రశ్నలు-60 మార్కులు ఉంటాయి. సెషన్ పరీక్ష సమయం 45 నిమిషాలు. ప్రత్యేక అవసరాలు గల అభ్యర్థులకు 60 నిమిషాలు.   

✦ రెండో సెషన్‌లో జనరల్ అవెర్‌నెస్ నుంచి 25 ప్రశ్నలు-75 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ & కాంప్రహెన్షన్ నుంచి 25 ప్రశ్నలు-75 మార్కులు ఉంటాయి. సెషన్ పరీక్ష సమయం 45 నిమిషాలు. ప్రత్యేక అవసరాలు గల అభ్యర్థులకు 60 నిమిషాలు.

✦ పరీక్షలో అర్హత మార్కులను జనరల్-30%, ఓబీసీ/ఈడబ్ల్యూఎస్-25%, ఇతరులకు-20%  గా నిర్ణయించారు.

✦ మొత్తం 15 భాషల్లో కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహిస్తారు. హిందీ, ఇంగ్లిష్, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, కొంకణి, మలయాళం, మణిపురి, మరాఠి, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ మాధ్యమాల్లో పరీక్ష ఉంటుంది.

ఫిజికల్ ఈవెంట్లు:  హవల్దార్ పోస్టులకు ఫిజికల్ పరీక్షలు (PET, PST) నిర్వహిస్తారు. అభ్యర్థులకు ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్టులో భాగంగా వాకింగ్ నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పురుష అభ్యర్థులు 15 నిమిషాల్లో 1600 మీటర్లు వాకింగ్ చేయాల్సి ఉంటుంది. ఇక మహిళలు అయితే 20 నిమిషాల్లో 1 కిలోమీటర్ నడవాల్సి ఉంటుంది. గర్భధారణ చేసిన మహిళలను ఫిజికల్ టెస్టులకు అనుమతించరు. ఇక ఫిజికల్ స్టాండర్ట్ టెస్టులో భాగంగా పురుషులకు ఎత్తు, ఛాతీ కొలతలు; మహిళలలకు ఎత్తు, బరువు అంశాలు ప్రామాణికంగా తీసుకుంటారు.  

దక్షిణాదిలో పరీక్ష కేంద్రాలు: చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, పుదుచ్చేరి, చెన్నై, కోయంబత్తూరు, మధురై, సేలం, తిరుచిరాపల్లి, తిరునల్వేలి, వెల్లూరు, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 27.06.2024.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 31.07.2024 (11 PM).

➥ ఆన్‌లైన్ విధానంలో ఫీజు చెల్లించడానికి చివరితేది: 01.08.2024 (11 PM) 

➥ దరఖాస్తుల సవరణకు అవకాశం: 16.08.2024 – 17.08.2024 (11 PM) 

➥ కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష తేది: అక్టోబరు-నవంబరు, 2024.

Notification

Online Application

Website

AP DSC-2024-complete-details

AP DSC-2024-complete-details

AP DSC Application: జులై 1 నుంచి ‘మెగా డీఎస్సీ’ దరఖాస్తుల స్వీకరణ, నియామక ప్రక్రియకు డెడ్ లైన్ ఇదే!

AP DSC 2024: ఏపీలో మెగా డీఎస్సీ దరఖాస్తు ప్రక్రియ జులై 1 నుంచి ప్రారంభంకానుంది. డీఎస్సీ ప్రక్రియను డిసెంబరు 10లోపు పూర్తిచేయాలని ఏపీ మంత్రి మండలి నిర్ణయించింది.

AP DSC 2024 Application: ఏపీలో మెగా డీఎస్సీ నిర్వహణకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. జూన్ 24న జరిగిన కేబినెట్ మీటింగ్‌లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 16,347 పోస్టులను డిసెంబర్ 10లోపు భర్తీ చేయాలని మంత్రి వర్గం నిర్ణయించింది. మెగా డీఎస్సీ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జులై 1 నుంచి ప్రారంభం కానుంది. మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా కొత్తగా టెట్‌ నిర్వహణ, టెట్‌ లేకుండా డీఎస్సీ నిర్వహణ ప్రతిపాదనలపై మంత్రి వర్గ భేటీలో చర్చించారు.  డీఎస్సీ నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్‌ను కూడా అధికారులు క్యాబినెట్‌లో చర్చించారు. టెట్ లేకుండా అయితే నవంబరు 15లోపు, టెట్‌తో అయితే డిసెంబరు 10లోపు డీఎస్సీ ప్రక్రియ ముగించాలని నిర్ణయించారు. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఒకటి రెండు రోజుల్లో వెలువడే అవకాశం ఉంది. ఆ తర్వాతే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడనుంది. 

*🌷DSC పోస్టులు.. జిల్లాల వారీగా ఖాళీలు ఇవే🌷*

*🌴AP: 16,347 DSC పోస్టులకు జులై 1న షెడ్యూల్ విడుదల కానుంది.*

*🍁జిల్లా, మండల పరిషత్, మున్సిపల్ స్కూళ్లలో 14,066 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.*

*🌴SKLM – 543,*
*🍁VZM – 583,*
*🌴విశాఖ – 1134,*
*🍁తూ. గో – 1346,*
*🌴ప. గో – 1067,*
*🍁కృష్ణా – 1213,*
*⛱️గుంటూరు – 1159,*
*🌴 ప్రకాశం – 672,*
*🍁 నెల్లూరు – 673,*
*🌴చిత్తూరు – 1478,*
*🍁కడప – 709,*
*🌴అనంతపురం – 811,*
*🍁కర్నూలు – 2678*
*ఖాళీలు ఉన్నాయి.*

*⛱️ఇక రెసిడెన్షియల్, మోడల్ స్కూళ్లు, బీసీ, గిరిజన స్కూళ్లలో 2,281 పోస్టులు భర్తీ కానున్నాయి.*..

జులై 1 నుంచి దరఖాస్తుల స్వీకరణ..
జులై 1 నుంచి డీఎస్సీ ప్రక్రియను ప్రారంభించి డిసెంబర్‌ 10లోపు ముగిసేలా ప్రణాళికను రూపొందించారు మెగా డీఎస్సీకి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ జులై 1 నుంచి ప్రారంభంకానుంది. అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలోనే దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.

ఏపీలో గత ప్రభుత్వం 6100 టీచర్ పోస్టులతో ఫిబ్రవరి 12న డీఎస్సీ-2024 నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. దీనికి 4,72,487 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో ఎస్టీజీ-2280 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్-2299 పోస్టులు, టీజీటీ-1264 పోస్టులు, పీజీటీ-215 పోస్టులు, ప్రిన్సిపల్-42 పోస్టులు ఉన్నాయి. ఏప్రిల్‌ అభ్యర్థుల నుంచి ఫిబ్రవరి 12 నుంచి ఫిబ్రవరి 25 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఈ నోటిఫికేషన్‌లో గరిష్ఠ వయోపరిమితి 44 ఏళ్లు కాగా.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అదనంగా ఐదేళ్ల సడలింపు, దివ్యాంగులకు 54 ఏళ్లుగా వయోపరిమితి నిర్ణయించారు. అయితే ఎన్నికల కోడ్‌ కారణంగా అది వాయిదా పడింది. ఆ తర్వాత అధికారం చేపట్టిన చంద్రబాబు ప్రభుత్వం ఈ నోటిఫికేషన్‌ను రద్దు చేసి పోస్టుల సంఖ్య పెంచింది. 

గత ప్రభుత్వం విడుదలచేసిన డీఎస్సీని రద్దుచేసిన.. టీడీపీ ప్రభుత్వం తాజాగా కొత్త నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది. పాఠశాల విద్యాశాఖ పరిధిలోని విద్యాసంస్థల్లో 16 వేలకుపైగా పోస్టులు ఖాళీలు ఉన్నట్లు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఈ మేరకు 16,347 పోస్టులతో మెగా డీఎస్సీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇంచ్చింది. కొత్త నోటిఫికేషన్ ద్వారా జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పోరేషన్ పాఠశాలలు, ఏపీ ఆదర్శ పాఠశాలలు, ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ, ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ, ఏపీ ట్రైబల్ వెల్పేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ, ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ, మహాత్మా జోతిబాపూలే బీసీ గురుకులాల్లో ఉపాధ్యాయ పోస్టులను భర్తీచేయనున్నారు.

మెగా డీఎస్సీ 2024 పోస్టుల వివరాలు..

క్ర.సం. విభాగం పోస్టుల సంఖ్య
1) స్కూల్ అసిస్టెంట్ (SA) 7725
2) సెకండరీ గ్రేడ్ టీచర్ (SGT) 6371
3) ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT) 1781
4) పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT) 286 
5) ప్రిన్సిపల్స్ 52
6) ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (PET) 132
మొత్తం ఖాళీలు 16,347

ap-cabinet-1st-meeting-details

ap-cabinet-1st-meeting-details

Andhra Pradesh: కేబినెట్‌ తొలి భేటీ .. ఎజెండా మేటి.. సమపాళ్లలో సంక్షేమం, అభివృద్ధి

ఏపీలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం… సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు వెళుతోంది. తొలిసారి సమావేశమైన చంద్రబాబు మంత్రివర్గం… నవ్యాంధ్ర నవ నిర్మాణం కోసం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుతో పాటు… అభివృద్ధికి బాటలు వేసేలా ప్రణాళిక రూపొందించాలని నిర్ణయించింది. సంక్షేమం ఓవైపు.. అభివృద్ధి మరోవైపు… ఈ రెండూ కొనసాగిస్తూనే రాజకీయంగానూ తనదైన దూకుడుతో ముందుకెళ్లాలని కూటమి సర్కార్‌ ప్లాన్‌ చేస్తున్నట్టు అర్థమవుతోంది.

మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌కు ఆమోదం తెలిపిన మంత్రి మండలి.. ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుకు కూడా ఓకే చెప్పింది. పెన్షన్ల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేబినెట్‌… 66లక్షల మందికి… సచివాలయం సిబ్బందితో ఇంటింటికీ ఆ మొత్తాన్ని అందజేయాలని నిర్ణయించింది. అయితే, వాలంటీర్ల విషయంలో మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు మంత్రివర్గం.

1. *మెగా డీఎస్సీ* :

2. *ఆంధ్రప్రదేశ్ భూహక్కు చట్టం (ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్) 2022 రద్దు*:

3. *సామాజిక పింఛన్లకు సంబంధించి గతంలో ఉన్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకంగా పేరు మార్పు చేస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది*.

4.*రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ నైపుణ్య సెన్సెస్-2024 నిర్వహణకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.* 

5. *రాష్ట్రం లోని పేదవారి ఆకలి దప్పులను తీర్చే లక్ష్యంతో సబ్సిడీ ధరకు నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు గతంలో మంజూరు చేసిన అన్నా క్యాంటీన్‌లను పున: ప్రారంభించేందుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.*

6. విజయవాడలోని డా.వైయస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయంగా పునర్ నామకరణం చేస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది.*

7. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ గా దమ్మాలపాటి శ్రీనివాస్ ను నియమిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.*

ఇతర అంశాలు* :

• ప్రజల్లో గత ప్రభుత్వం అనుసరించిన విధానాలపై అవగాహన కల్పించేందుకు 7 శ్వేత పత్రాలను విడుదల చేయాల్సిందిగా మంత్రి వర్గానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. 
• పోలవరం, అమరావతి, విద్యుత్, పర్యావరణం( ల్యాండ్, శాండ్, మైన్స్, జియాలజీ మొదలైనవి), లిక్కర్ అండ్ ఎక్సైజ్, లా అండ్ ఆర్డర్ మరియు ఆర్థిక శాఖల పై శ్వేత పత్రాలను విడుదల చేసి ప్రజలకు అవగాహన కల్పించారు.
• ఈ నెల 28 నుండి జులై 18 వరకు రెండు మూడు రోజులకొకసారి శ్వేత పత్రాలు విడుదల చేయడం జరుగుతుంది. 
• గత 5 సంవత్సరాల్లో  సంస్థలు ఏ విధంగా కుంటు పడ్డాయన్న విషయాన్ని ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులకు ఉందన్నారు.
• ఇవే గాక అన్ని పంచాయతీలు, మున్సిపాలిటీల పారిశుద్ధ్య పనులను వెంటనే ప్రారంభించాలి.
• చివరి ఆయకట్టుకు నీరు అందించే దిశలో కాల్వలు, చెరువుల్లో పూడిక, డెక్క తొలగించే కార్యక్రమాన్ని సత్వరమే చేపట్టాలి.
• వర్షాకాలం ప్రారంభం అయినందున సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉండటంతో ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజల ఆరోగ్య పరిరక్షణకు కావాల్సిన అన్ని ఏర్పాట్లతో సమాయత్తం కావాలని మంత్రి వర్గానికి సూచనలు జారీ
• అధ్వాన్నంగా మారిన రోడ్లు, రహదారులు గతుకులమయం అయినందున వెంటనే పాట్ హోల్స్ ను పూడ్చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆర్ అండ్ బీకి ఆదేశాలు జారీ..
• మత్తు, మాదక ద్రవ్యాల వినిమయం రాష్ట్రంలో అధికమైన నేపథ్యంలో వాటి నుండి యువతను కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఒక కార్యాచరణ ప్రణాళికను తయారు చేసేందుకు ఐదుగురు మంత్రులతో సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో విద్యాశాఖ, ఆరోగ్యశాఖ, హోం, ఎక్సైజ్, ట్రైబల్ వెల్ఫేర్ వంటి శాఖల మంత్రులు ఉంటారు. భావితరాల భవిష్యత్ కాపాడటం కోసం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.

జూలై 1న పేదల అకౌంట్లలో రూ. 4408 కోట్లు

తొలి కేబినెట్‌ భేటీలోనే పెన్షన్లపై నిర్ణయం తీసుకోవడంతో… పేదలకు ఎంతో కీలకమైన సంక్షేమపథకాలకు పెద్దపీట వేస్తామని కొత్త ప్రభుత్వం సంకేతాలిచ్చినట్టుగా స్పష్టమవుతోంది. దాదాపు 64లక్షల మందికి చేరనున్న వివిధ రకాల పెన్షన్ల కోసం.. గత ప్రభుత్వం కన్నా పదివేల కోట్లు అదనంగా ఖర్చు చేస్తోంది ప్రస్తుత ప్రభుత్వం. ఈ పెంపువల్ల.. ప్రతీనెలా అదనంగా 819 కోట్ల రూపాయల ఆర్థిక భారం ప్రభుత్వంపై పడనుంది. అయినా వృద్దులు కోసం ఈ నిర్ణయం తీసుకున్నామంటోంది సర్కారు. పెంపునకు సంబంధించి గత మూడు నెలల బకాయి పెన్షన్‌ 1650 కోట్ల రూపాయలను కూడా విడుదల చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. అంటే, జూలై ఒకటిన 4,408 కోట్ల రూపాయలను కేవలం పేదల అకౌంట్లలో వేయనుంది ప్రభుత్వం.

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దుకు ఆమోదం

గత ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపింన ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దును కూడా కేబినెట్‌ సమర్థించింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజు.. చంద్రబాబు చేసిన ఐదు సంతకాల్లో ఈ అంశం కూడా ఒకటి కావడం విశేషం. అందుకే, దీనికి ప్రాధాన్యతను ఇచ్చిన కేబినెట్‌… యాక్ట్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. అయితే, ఈ చట్టం ద్వారా నష్టపోయిన రైతులకు న్యాయం చేసే అంశంలో ఎలా వ్యవహరిస్తారనేది తెలియాల్సి ఉంది.

యువతలో విశ్వాసం నింపేలా స్కిల్‌ సెన్సెస్‌

ఏపీలో నిరుద్యోగ సమస్యను తొలగించేందుకు గట్టిగా కృషి చేయాలని నిర్ణయించింది కేబినెట్‌. నిజం చెప్పాలంటే నిరుద్యోగ అంశం ఎన్నికల్లో కీలక పాత్ర పోషించింది. అందుకే, యువతలో నమ్మకాన్ని నింపేలా.. స్కిల్ సెన్సెస్ కార్యక్రమాన్ని అమలు చేయాలని డిసైడ్‌ అయ్యింది ప్రభుత్వం. తద్వారా యువతకు, నిరుద్యోగులకు తామిస్తున్న ప్రాధాన్యతను తెలియజెప్పొచ్చని భావిస్తోంది. అంతేకాదు, యువతను పెడదోవ పట్టిస్తున్న గంజాయిని పూర్తి నిర్మూలించేందుకు.. కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మహమ్మారిని రాష్ట్రం నుంచి తరిమేందుకు.. ఏం చేయాలన్న దానిపై చర్చించేందుకు ఐదుగురు మంత్రులతో సబ్‌ కమిటీ ఏర్పాటు చేసింది. మంత్రులు అనిత,లోకేష్,కొల్లు రవీంద్ర,సత్య కుమార్,సంధ్యా రాణి ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీ పనిచేయనుంది.

ఈనెల 31 నుంచి 7శాఖలపై శ్వేతపత్రాలు

సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లుగా ముందుకెళ్తూనే… రాజకీయంగా ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు ప్రణాళిక రచిస్తోంది కూటమి ప్రభుత్వం. అందుకే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజల కళ్లకు కట్టేలా చూపించేందుకు… ఈ నెల 31 నుంచి 7 శాఖల్లో శ్వేత పత్రాలు విడుదల చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. పోలవరం,అమరావతి, విద్యుత్, ల్యాండ్ -సాండ్, లిక్కర్, లా అండ్ ఆర్డర్, ఆర్థికశాఖలపై వైట్ పేపర్లు రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతోంది.

పోలవరం నుంచే శ్వేతపత్రాలు మొదలు!

ఏపీకి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టును… రాష్ట్రప్రభుత్వం టాప్‌ ప్రయారిటీగా భావిస్తోంది. వీలైనంత త్వరగా ప్రాజెక్టును పూర్తి చేయాలని భావిస్తున్న చంద్రబాబు.. గత ప్రభుత్వం ఏం చేసిందనే విషయానికి సంబంధించి, ప్రజల ముందు నిజానిజాలు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. అందుకే, ముందుగా పోలవరంపైనే శ్వేత పత్రం విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు.

పోలవరం ఖర్చు, నిధులపై శ్వేతపత్రం!

గతంలో ఇదే పోలవరంపై.. అసెంబ్లీ వేదికగా పెద్ద యుద్ధమే జరిగింది. నాడు అధికార పక్షంగా వైసీపీ… ప్రతిపక్ష టీడీపీని టార్గెట్‌ చేసింది. గత ప్రభుత్వ తీరు వల్లే ప్రాజెక్ట్‌ ఆలస్యమైందన్న ఆరోపణలు గుప్పించింది. అయితే, పోలవరం విషయంలో అసలేం జరిగిందో ప్రజలకు తెలియజెప్పాలన్న కృతనిశ్చయంతో కూటమి సర్కార్‌ ఉంది. అందుకే దీనికి సంబంధించి శ్వేత పత్రాన్ని విడుదల చేసి… ఎప్పుడెన్ని నిధులు వచ్చాయ్‌? ఎక్కడెక్కడ ఎలా ఖర్చయ్యాయ్‌? నిధులు దుర్వినియోగమయ్యాయా? లేక డైవర్షన్‌ జరిగిందా? అనే వివరాలను ప్రజల ముందు పెట్టేందుకు సిద్ధమవుతోంది.

పోలవరం తర్వాత కీలకం అమరావతి

పోలవరం తర్వాత.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న అంశం రాజధాని అమరావతి. చంద్రబాబు మానస పుత్రికగా పురుడు పోసుకున్న అమరావతి.. 2019 తర్వాత నిర్లక్ష్యానికి గురైంది. గత ప్రభుత్వం మూడు రాజధానుల నినాదం ఎత్తుకోవడంతో… అమరావతి అభివృద్ధి ఆగిపోయింది. ఇప్పటికే అమరావతి ప్రాంతమంతా పర్యటించిన చంద్రబాబు.. అక్కడి నిర్మాణాలను పరిశీలించారు. సో.. రాజధాని ప్రస్తుత పరిస్థితిపై ఒక శ్వేత పత్రాన్ని విడుదల చేస్తే.. ప్రజలకు పూర్తి వివరాలు తెలుస్తాయన్నది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. ఎందుకంటే గత టర్మ్‌లో అత్యంత వివాదాస్పదమైన అంశంగా.. పొలిటికల్‌ డిబేట్‌గా నిలిచింది రాజధాని అమరావతి. దాదాపు 2019 నుంచి 2024 దాకా.. దీని మీదే రాజకీయ వేడి ఎగిసిపడింది. అందుకే కొత్త ప్రభుత్వానికి ఇది సవాల్‌గా మారనుంది. అమరావతి అభివృద్ధి కొనసాగించేలా అప్పుడే పనులు మొదలెట్టిన ప్రభుత్వం… శ్వేత పత్రం ద్వారా మరిన్ని విషయాలను ప్రజల ముందుకు తీసుకురావాలనుకుంటోంది.

జూలై 18లోపు శ్వేతపత్రాలు విడుదల

రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించిన మరికొన్ని అంశాలపైనా వైట్‌ పేపర్‌ రిలీజ్‌ చేసేందుకు కేబినెట్‌ నిర్ణయించింది. విద్యుత్‌, శ్యాండ్‌, లా అండ్‌ ఆర్డర్‌, లిక్కర్‌ అంశాలపైనా శ్వేత పత్రాలు విడుదల చేయాలని డిసైడైంది. విద్యుత్‌శాఖపై అప్పటి పాలక, ప్రతిపక్షాల మధ్య ఏరేంజ్‌లో మాటల యుద్ధం నడిచిందో… ఇసుక విషయంలో ఏ స్థాయి రచ్చ చెలరేగిందో ప్రపంచమంతా చూసింది. అందుకే ఈ అంశాలపైనా ఫోకస్‌ చేసింది కేబినెట్‌. ఇక లా అండ్‌ ఆర్డర్‌.. లిక్కర్‌ అంశాలూ.. గతంలో చాలా వివాదాస్పదమయ్యాయి. అందుకే వీటిపైనా శ్వేత పత్రం విడుదల చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. మొత్తంగా ఏడు శాఖలపై శ్వేత పత్రాలను జులై 18 లోగా రిలీజ్ చేయాలని టైమ్‌ ఫిక్స్‌ చేసింది.

ఒకేసారి 183 అన్నా క్యాంటీన్లు

ఇక, ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా 183 అన్న క్యాంటీన్ల ప్రారంభానికి ఆమోదం తెలిపింది కేబినెట్‌. గంజాయి, డ్రగ్స్ నివారణపై కీలకంగా చర్చించిన మంత్రివర్గం… 100 రోజుల్లో డ్రగ్స్ అరికట్టేలా యాక్షన్ ప్లాన్‌ను ప్రతిపాదించింది. ఇకనుంచి మంత్రులకు జిల్లాల వారిగా ఇంచార్జీ బాధ్యతలు కూడా దక్కనుండంతో… నిర్దేశిత లక్ష్యాలు మరింత ముందుకు తీసుకెళ్లొచ్చనే భావనలో ప్రభుత్వం ఉంది.

new-law-against-anti-paper-leak Law-2024

new-law-against-anti-paper-leak Law-2024

పేపర్‌ లీక్‌చేస్తే 10 ఏళ్ల జైలు శిక్ష.. రూ.కోటి జరిమానా!

వరుస పేపర్‌ లీక్‌లతో కేంద్రం ఉక్కిరిబిక్కిరి అవుతుంది. పేపర్‌ లీకేజీలకు పాల్పడుతున్న వారిపై కేంద్రం ఉక్కుపాదం మోపనుంది. పబ్లిక్ పరీక్షల్లో పేపర్ లీక్‌లు, చీటింగ్‌లను అరికట్టడానికి ప్రభుత్వం పబ్లిక్ ఎగ్జామినేషన్స్(ప్రివెన్షన్‌ ఆఫ్‌ అన్‌ఫెయిర్‌ మీన్స్‌) యాక్ట్‌ 2024ను తీసుకువచ్చింది. ఆ చట్టం జూన్‌ 21 నుంచి అమల్లోకి వచ్చినట్లు గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది

వరుస పేపర్‌ లీక్‌లతో కేంద్రం ఉక్కిరిబిక్కిరి అవుతుంది. పేపర్‌ లీకేజీలకు పాల్పడుతున్న వారిపై కేంద్రం ఉక్కుపాదం మోపనుంది. పబ్లిక్ పరీక్షల్లో పేపర్ లీక్‌లు, చీటింగ్‌లను అరికట్టడానికి ప్రభుత్వం పబ్లిక్ ఎగ్జామినేషన్స్(ప్రివెన్షన్‌ ఆఫ్‌ అన్‌ఫెయిర్‌ మీన్స్‌) యాక్ట్‌ 2024ను తీసుకువచ్చింది. ఆ చట్టం జూన్‌ 21 నుంచి అమల్లోకి వచ్చినట్లు గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీంతో నీట్‌, యూజీసీ నెట్‌ పరీక్షల లీకేజీలతో వెల్లువెత్తిన భారీ వివాదాల మధ్య ఈ చట్టం అమల్లోకి వచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే చట్టం చేసినా ఎన్నికల నేపథ్యంలో అమలు తేదీని ప్రకటించలేదు. జూన్‌ 20న జరిగిన విలేకర్ల సమావేశంలో దీనిపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్‌ను మీడియా ప్రశ్నించింది. న్యాయశాఖ నిబంధనలు రూపొందిస్తోందని, త్వరలో నోటిఫై చేస్తామని ఆయన ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు చేసిన 24 గంటల్లోనే కేంద్ర చట్టాన్ని అమల్లోకి తెస్తూ నోటిఫికేషన్‌ జారీ చేయడం విశేషం.

తాజాగా అమల్లోకి వచ్చిన ఈ చట్టం ప్రకారం.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వంటి ప్రధాన సంస్థలు నిర్వహించే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC), స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC), రైల్వేలు, బ్యాంకింగ్ రిక్రూట్‌మెంట్ వంటి పబ్లిక్ పరీక్షలలో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. చట్టవిరుద్ధంగా పరీక్ష పేపర్లను బయటికి తెచ్చినా, ప్రశ్నలు, జవాబులను లీక్‌ చేసినా, కంప్యూటర్‌ నెట్‌వర్క్‌ను ట్యాంపరింగ్‌ చేసినా, నకిలీ పరీక్షలు నిర్వహించినా నేరంగా పరిగణిస్తారు. నిందితులకు 5 నుంచి 10 ఏళ్ల వరకు జైలుశిక్షతోపాటు రూ.కోటి వరకు జరిమానా విధిస్తారు.

వ్యవస్థీకృత నేరాలను పాల్పడినట్లు రుజువైతే సర్వీస్ ప్రొవైడర్‌లలోని సీనియర్ అధికారులు ఉద్దేశపూర్వకంగా ఇలాంటి కార్యకలాపాలలో పాల్గొన్నట్లు రుజువైతే కనీసం మూడేళ్ల నుంచి 10 యేళ్ల వరకు జైలు శిక్ష తప్పదు. అలాగే రూ. 1 కోటి జరిమానా. వ్యవస్థీకృత పరీక్షల మాల్‌ప్రాక్టీస్‌లో పాల్గొన్న ఎగ్జామినేషన్ అధికారులు లేదా సర్వీస్ ప్రొవైడర్‌లకు కనిష్టంగా ఐదేళ్లు, గరిష్టంగా 10 యేళ్ల జైలు శిక్ష విధిస్తారు. దీనితోపాటు రూ. 1 కోటి జరిమానా ఉంటుంది.

PM Kisan-17th-installments-Know Your Status

PM Kisan-17th-installments-Know Your Status

eKYC is MANDATORY for PMKISAN Registered Farmers. OTP Based eKYC is available on PMKISAN Portal or nearest CSC centres may be contacted for Biometric based eKYC.

PM Kisan: నేడు రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్‌ డబ్బులు..స్టేటస్‌ చెక్‌ చేసుకోవడం ఎలా?

కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతుంది. రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు రకరకాల పథకాలను సైతం అమలు చేస్తోంది. కేంద్రం అమలు చేస్తున్న పథకాల్లో పీఎం కిసాన్‌ స్కీమ్‌ ఒకటి. ఈ పథకంలో భాగంగా రైతుకు ఏడాదికి రూ.6000 అందుతాయి. ఈ మొత్తం ఒకేసారి కాకుండా ఏడాదిలో మూడు విడతలుగా అంటే రూ.2000 చొప్పున..

కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతుంది. రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు రకరకాల పథకాలను సైతం అమలు చేస్తోంది. కేంద్రం అమలు చేస్తున్న పథకాల్లో పీఎం కిసాన్‌ స్కీమ్‌ ఒకటి. ఈ పథకంలో భాగంగా రైతుకు ఏడాదికి రూ.6000 అందుతాయి. ఈ మొత్తం ఒకేసారి కాకుండా ఏడాదిలో మూడు విడతలుగా అంటే రూ.2000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది మోడీ సర్కార్‌. ఇప్పటి వరకు రైతులకు 16వ విడత డబ్బులు అందుకోగా, ఇప్పుడు 17వ విడత రావాల్సి ఉంటుంది. మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీ ఈ మొత్తాన్ని విడుదల చేయనున్నారు. వారణాసి పర్యటనలో భాగంగా మోడీ ఈ డబ్బులు విడుదల చేస్తారు. ఈ పథకం ద్వారా మొత్తం 9.26 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.20 వేల కోట్ల మొత్తాన్ని జమ.

డబ్బుల స్టేటస్​ చెక్‌ చేసుకోవడం ఎలా?

  • ముందుగా పీఎం కిసాన్ బెనిఫీషియరీ స్టేటస్, ఇన్​స్టాల్​మెంట్ స్టేటస్​ చెక్​ చేసుకోవడానికి ఈ https://pmkisan.gov.in/ పోర్టల్​ను ఓపెన్ చేయండి.
  • ఆ తర్వాత Know Your Status అనే ఆప్షన్​పై క్లిక్ చేయాలి.
  • తర్వాత రిజిస్ట్రేషన్ నంబర్​ను ఎంటర్​ చేసి, క్యాప్చా కోడ్​ను ఎంటర్‌ చేయాలి.
  • ఇప్పుడు Get Data అనే ఆప్షన్​పై క్లిక్ చేస్తే స్క్రీన్​పై మీ బెనిషియరీ స్టేటస్​ కనిపిస్తుంది.

PM KISAN OFFICIAL WEBSITE LINK CLICK HERE

PGCIL-Recruitment-435-jobs-notification

PGCIL-Recruitment-435-jobs-notification

PGCIL Recruitment: పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 435 ఇంజినీర్‌ ట్రైనీ పోస్టులు, రూ.1.40 లక్షల వరకు జీతం

PGCIL Jobs: పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఇంజినీర్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఇంజినీరింగ్ డిగ్రీతోపాటు గేట్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

Power Grid Corporation of India Notification: న్యూఢిల్లీలోని ‘పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (PGCIL)’ తోపాటు సెంట్రల్ ట్రాన్స్‌మిషన్ యుటిలిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(CTUIL)లోని వివిధ విభాగాల్లో ఇంజినీర్‌ ట్రైనీ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. గతేడాది సెప్టెంబరు 26న విడుదల చేసిన నోటిఫికేషన్(Advt. No. CC/08/2023)కు అనుబంధంగా తాజా నోటిఫికేషన్‌ను PGCIL విడుదల చేసింది. బీఈ, బీటెక్‌, బీఎస్సీ ఉత్తీర్ణతతోపాటు గేట్-2024 అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో జులై 4 వరకు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాలి. అయితే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ల వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

వివరాలు..

* ఇంజినీర్‌ ట్రైనీ పోస్టులు

ఖాళీల సంఖ్య: 435.

పోస్టుల కేటాయింపు: యూఆర్(జనరల్)-192, ఓబీసీ-107, ఎస్సీ-63, ఎస్టీ-34, ఈడబ్ల్యూఎస్-39.

విభాగాల వారీ ఖాళీలు..

➥ ఎలక్ట్రికల్: 331 పోస్టులు

➥ ఎలక్ట్రానిక్స్: 14 పోస్టులు

➥ సివిల్: 53 పోస్టులు 

➥ కంప్యూటర్ సైన్స్: 37 పోస్టులు 

అర్హత: కనీసం 60 శాతం మార్కులతో గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి ఇంజినీరింగ్ విభాగంలో బీఈ, బీటెక్‌, బీఎస్సీ (ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ (పవర్)/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/ పవర్ సిస్టమ్స్ ఇంజినీరింగ్/ పవర్ ఇంజినీరింగ్ (ఎలక్ట్రికల్)/ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్‌ టెలికమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్/ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్/ సివిల్ ఇంజినీరింగ్/ కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ ఇంజినీరింగ్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) ఉత్తీర్ణులై ఉండాలి. గేట్‌-2024 ఉత్తీర్ణులై ఉండాలి. మంచి స్కోరు సాధించి ఉండాలి.

వయోపరిమితి: 18-28 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఓబీసీలకు 3 సంవత్సరాలు; ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు; దివ్యాంగులకు 10 సంవత్సరాలు; ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు భారత ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు ఫీజు: రూ.500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: గేట్-2024 స్కోర్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ల వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా ఎంపిక చేస్తారు. మొత్తం 100 మార్కులకు ఎంపిక విధానం ఉంటుంది. ఇందులో గేట్ మార్కులకు 85 శాతం, గ్రూప్ డిస్కషన్‌కు 3 శాతం, పర్సనల్ ఇంటర్వ్యూకు 12 శాతం వెయిటేజీ ఉంటుంది. పర్సనల్ ఇంటర్వ్యూలో జనరల్ అభ్యర్థులు కచ్చితంగా 40 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఇతరులు 30 శాతం మార్కులు సాధిస్తే అర్హత సాధించినట్లే. 

పే స్కేల్: నెలకు రూ.40,000 నుంచి రూ.1,40,000.

ముఖ్యమైన తేదీలు..

 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 12.06.2024.

➥ ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 04.07.2024.

Notification

Online Application

Website

btech-pass-jobs-apply-for-these-life-setting-jobs

btech-pass-jobs-apply-for-these-life-setting-jobs

BTech పాసై ఖాళీగా ఉన్నారా? లైఫ్ సెట్ అయ్యే ఈ జాబ్స్ కు వెంటనే అప్లై చేసుకోండి

Software రంగంలో నిలదొక్కుకోవాలనుకునే వారు B.Tech education ను అభ్యసించేందుకు ఆసక్తి చూపుతున్నారు. IT jobs లపై యువతలో ఫుల్ క్రేజ్ ఉంది. కానీ ప్రస్తుతం ఐటీ రంగంలో ఉద్యోగుల తొలగింపు కంటి మీద కునుకు లేకుండా జరుగుతోంది.

పెద్ద కంపెనీలు లేఆఫ్లు ప్రకటించి భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. కొత్తగా BTech passed వారికి ఐటీ కంపెనీల్లో ఉద్యోగం దొరకడం కష్టంగా మారింది. ఇలాంటి సమయంలో National Fertilizers Limited బీటెక్ ఉత్తీర్ణులకు శుభవార్త అందించింది. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

National Fertilizers Limited , నోయిడా దేశవ్యాప్తంగా వివిధ యూనిట్లలో ఖాళీగా ఉన్న మేనేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 164 పోస్టులను భర్తీ చేస్తారు. B.Tech, BE, B.Sc Engineering, M.Sc, MBA, PG Degree, PG Diploma 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు 1,40,000. అభ్యర్థులు Online లో దరఖాస్తు చేసుకోవాలి. అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు July 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన సమాచారం:

⫸ ఖాళీల సంఖ్య: 97.

వయోపరిమితి: 31.05.2024 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు ఫీజు: రూ.700. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్‌ఎం అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.

వార్షిక వేతనం: రూ.12.99 లక్షలు.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 01.07.2024.

Notification

Online Application

Website

social-security-pensions-Enhancement of the existing pension amount

social-security-pensions-Enhancement of the existing pension amount

AP News: ఒక్కొక్కరికి రూ. 7 వేలు.. వారందరికీ కొత్త ప్రభుత్వం డబుల్ ధమాకా.. జీవో జారీ

NTR Bharosa Pension scheme : పింఛను పథకం పేరు ‘ఎన్టీఆర్‌ భరోసా’గా మార్పు – పింఛనుదారులపై వరాల జల్లు

G.O.MS.NO.43, DATED; 13-06-2014

పెన్షన్ల విషయంలో ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్‌ భరోసా పేరుతో ఈ పథకాన్ని అమలు చేసేలా కొత్త జీవోను జారీ చేసింది. చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా.. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా.. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు చంద్రబాబు ప్రభుత్వం భరోసానిచ్చింది.

పెన్షన్ల విషయంలో ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ పథకానికి పెట్టిన ‘ఎన్టీఆర్ భరోసా’ పేరుతో ఈ పథకం ఇప్పుడు కొనసాగనుంది. గురువారం పెన్షన్ల పెంపు ఫైల్‌పై చంద్రబాబు సంతకం చేయడంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) నీరభ్‌కుమార్ ప్రసాద్ తాజాగా ఉత్తర్వులు జారీచేశారు. చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా.. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా.. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు చంద్రబాబు ప్రభుత్వం భరోసానిచ్చింది. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు ఇప్పుడు అందుతున్న 3వేల పెన్షన్‌ను ప్రభుత్వం రూ. 4 వేలకు పెంచింది. ఈ పెన్షన్ పెంపు మొత్తం ఏప్రిల్ నెల నుంచే అమలు కానుంది. అంటే జూలై 1న ఇచ్చే పెన్షన్‌లో గడిచిన మూడు నెలల పెంపు డబ్బులు కూడా కలిపి వృద్ధులు, వితంతువులకు రూ. 7 వేలు ఇచ్చేలా జీవో జారీ చేసింది చంద్రబాబు ప్రభుత్వం.

ఇక దివ్యాంగుల పెన్షన్ డబుల్ చేస్తూ 6 వేలకు పెంచింది. పూర్తిస్థాయిలో అస్వస్థతకు గురైనవారికి, తీవ్ర అనారోగ్యంతో మంచాన పడినవారికి, వీల్‌ఛైర్‌లో ఉన్నవారికి అందే రూ. 5 వేల పెన్షన్‌ను రూ. 15 వేలకు పెంచింది చంద్రబాబు ప్రభుత్వం. కిడ్నీ, కాలేయం, గుండె మార్పిడి చేసుకున్న వారికి, డయాలసిస్‌ స్టేజ్‌కు ముందున్న కిడ్నీ వ్యాధిగ్రస్తుల పెన్షన్‌ను రూ. 5 వేల నుంచి రూ. 10 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

మరోవైపు గురువారం సాయంత్రం 4.41 గంటలకు ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు.. మొదటిగా ఐదు ఫైల్స్‌పై సంతకాలు చేశారు. అందులో ఒకటి పెన్షన్ల పెంపు. 2014లో టీడీపీ అధికారంలోకి రాగానే 200 రూపాయలున్న వృద్ధుల పెన్షన్ ఏకంగా ఐదు రేట్లు పెంచి వెయ్యి చేశారు. ఆ తర్వాత దాన్ని 2వేలకు పెంచారు. ఈ సారి ఎన్నికల ప్రచారంలో వృద్దుల పెన్షన్ నాలుగు వేలకు పెంచుతామని చంద్రబాబు హామీనిచ్చారు. అంతేకాదు ఏప్రిల్ నుంచి పెంచిన పెన్షన్‌ వర్తింపజేస్తామని ప్రకటించారు. ఆ హామీని నెరవేరుస్తూ మూడో సంతకం చేశారు సీఎం చంద్రబాబు.

error: Content is protected !!