Self-assessment-1-f.a-1-exams-timetable-syllabus-2024-25

Self-assessment-1-f.a-1-exams-timetable-syllabus-2024-25

27-08-2024 నుండి 02-09-2024 వరకు ప్రైమరీ వారికి
27-08-2024 నుండి 04-09-2024 వరకు హై స్కూల్ వారికి 
“Self Assessment Model Paper – 1” పరీక్ష ఉంటుంది 
పరీక్ష పేపర్లు ప్రభుత్వం నుండి సప్లై చేయబడతాయి. 
గతంలో మాదిరిగానే ఇది OMR based పరీక్ష 
unaided పాఠశాలలు మినహా మిగిలినవారికి ఈ సమాచారం వెంటనే తెలియజేయండి.
SELF ASSESSMENT-1 (F.A-1) EXAMS TIME TABLE CLICK HERE
Self Assessment-1 EXAMS 1ST TO 5TH CLASS SYLLABUS CLICK HERE
SELF ASSESSMENT-1 EXAMS 6th to 10th class  SYLLABUS CLICK HERE

school-complex-august-2024-schedule

school-complex-august-2024-schedule

School Complex Meetings/Trainings AUGUST 2024

స్కూల్ కాంప్లెక్స్ షెడ్యూల్ నందు ఎటువంటి మార్పు లేదు.
Dear All MEOs
స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్స్ రీ షెడ్యూల్ చేయబడినవి అని ఒక మెసేజ్ గ్రూపులలో వైరల్ అవుతుంది
ఇప్పటివరకు హయ్యర్ అథారిటీ నుంచి ఎటువంటి మెసేజ్లు పంపబడలేదు కావున స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్స్ యధావిధిగా జరుగునని గమనించవలెను.

SCHOOL COMPLEX FEED BACK FORM CLICK HERE
స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్స్ కి అందరూ ఉపాధ్యాయులు హాజరు కావలెను కావున ప్రస్తుతం ఉన్న షెడ్యూల్ ప్రకారం ఎటువంటి సెలవులు  ఆ రోజుల లో ఉపాధ్యాయులకు ఇవ్వవద్దు
ఏమైనా మార్పులు ఉన్నచో ఈ గ్రూపులో మీకు తెలియ చేయబడును అప్పటివరకు ప్రొసీడింగ్స్ లో ఉన్న షెడ్యూల్ ప్రకారమే స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్స్ జరుగుతాయని గమనించవలెను.
Dear MEOs/HMs
Please note
Message regarding postponement of school complex meetings circulating in several groups is fake
Conduct school complex as per schedule already communicated without any deviation.
School Complex Meeting/Trainings*
ఈ నెల 17.08.2024 మరియు  19.08.2024 తేదీలలో SCHOOL COMPLEX MEETINGS ని ఈ క్రింది పేర్కొనబడిన విధంగా నిర్వహించవలెను.*
PRIMARY SCHOOL COMPLEXES :*
Date : 17.08.2024 : 50% మండల Primary Teachers School Complex meeting కు హాజరు కావలెను.*
Date : 19.08.2024 : Remaining 50% మండల Primary Teachers School Complex meeting కు హాజరు కావలెను.*
SUBJECT – SCHOOL COMPLEXES :*
Date :* *17.08.2024*
1. Telugu*
2. Maths*
3.Biological Science* *(BS)*
Date :* *19.08.2024*:
1. Hindi*
2.English*
3.P.S*
4. Social*
పైన పేర్కొన్న విధంగా Primary & Subject School Complex లను  నిర్వహించవలెను*
Note :                                       

1.ప్రతి Complex కు ఎంపిక చేయబడిన ముగ్గురు రిసోర్స్ పర్సన్స్ కాంప్లెక్స్ ను సమర్థవంతంగా నడిచేటట్లు సంబధిత MEO లు పర్యవేక్షించవలెను* *మరియు సబ్జెక్టు ఎక్సపెర్ట్స్ list మీకు పంపబడుతుంది వారు సబ్జెక్టు సంబంధిత విషయాలను లీడ్ చేయవలెను*
2. కాంప్లెక్స్ మీటింగ్ నందు సంబదిత రిజిష్టర్స్.  మైంటైన్ చేయవలెను.*
3. మీటింగ్ కి హాజరైన ప్రతి ఉపాధ్యాయుడు app నందు సంబదిత సమాచారము పూర్తిచేయాలి*.                4.స్కూల్ అసిస్టెంట్స్ అందరు ఉపాధ్యాయులు కాంప్లెక్స్ మీటింగ్ లకు తప్పక హాజరు కావలెను.*               
5.Meeting Minutes ని నమోదు చేయవలెను.*
6. Meetings విజిట్ చేసిన అధికారులందరూ DYEO,MEO,COMPLEX HM & SECTORIAL OFFICERS విధిగా సంబదిత Google ఫార్మ్ ను పూర్తి చేయవలెను.*
7. Meeting కి సంబందించిన DOCUMENTATION ను  జిల్లా కార్యాలయం నకు అందజేయవలెను.

All the RJDSE, DEOs, AMOs, and APCs in the state are hereby informed to conduct school complex training at the complex level without any deviation and ensure 100% attendance in all school complexes. MEO-II to make monitoring visits. District officers and DIET Principals to make monitoring visits and fill the monitoring form.

Don’ts in the Complex Trainings:

1. No Union Meeting Discussions.

2. No Discussions on service matter, No personnel discussions.

3. No felicitation activities like transfers, promotions, no meeting with shawls and garland.

4. No personnel parties, birthday parties, no visits, no site seeing programmes.

5. All the teachers of govt, govt-aided, KGBV schools, residential must attend the school complex meeting.

REVISED SCHOOL COMPLEX AUGUST 2024 MONTH SCHEDULE CLICK HERE

SSLV-D3-ISRO Launched EOS-08

SSLV-D3-ISRO Launched EOS-08

షార్‌ నుంచి విజయవంతంగా ఎస్‌ఎస్‌ఎల్‌వీ డీ3 ప్రయోగం

SSLV-D3: షార్‌ నుంచి విజయవంతంగా ఎస్‌ఎస్‌ఎల్‌వీ డీ3 ప్రయోగం- 17 నిమిషాల్లో కక్షలోకి చేరిన ఉపగ్రహాలు

ISRO Launched EOS-08: ఇస్రో మరో రాకెట్‌ను విజయవంతంగా నింగిలోకి పంపించింది. ఎస్‌ఎస్‌ఎల్‌వీ డీ3 ద్వారా 17 నిమిషాల్లో ఉపగ్రహాలను కక్షలోకి పంపించింది.

Earth Observation Satellite -08: షార్‌ నుంచి ఎస్‌ఎస్‌ఎల్‌వీ డీ3 విజయవంతంగా ప్రయోగించారు. ఉదయం 9.17 నిమిషాలకు ఈ స్మాల్‌ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ నింగిలోకి పంపించారు. దీనికి నిన్న అర్థరాత్రి 2 గంటల నుంచి కౌంట్ డౌన్ ప్రక్రియ కొనసాగుతోంది. 

9.17 నిమిషాలకు ప్రారంభమైన ప్రయోగం… దాదాపు 17 నిమిషాల్లో పూర్తి అయింది. ఈ వెహికల్‌ ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్‌ (EOS–08)తో పాటు ఎస్‌ఆర్‌–0 డెమోశాట్‌ అనే చిన్న తరహా ఉపగ్రహాలను మోసుకెళ్లింది. వీటనిని సర్క్యులర్‌ ఆర్బిట్‌లో ఉంచింది. ఈ ఉపగ్రహాలు రక్షణ రంగంతో పాటు ఇతర రంగాలకు సర్వీస్‌ అందించబోతున్నాయి. 

119 టన్నుల బరువు కలిగి 34 మీటర్లు పొడువు 2 మీటర్లు వెడల్పు ఉన్న SSLVD-D3 రాకెట్‌ ప్రయోగం మొదటి దశలో 87 టన్నుల ఘన ఇంధనాన్ని ఉపయోగించారు. దీన్ని కేవలం 124 సెకన్లలో పూర్తి చేశారు. తర్వాత 7.7 టన్నుల ఘన ఇంధనంతో 384.2 సెకన్లకు, మూడో దశను 4.5 టన్నుల ఘన ఇంధనంతో 674.9 సెకన్లకు పూర్తి చేశారు. నాల్గో దశలో 175.5 కేజీల బరువు ఉన్న ఈఓఎస్‌–08 మొదటిగా కక్ష్యలో ప్రవేశ పెట్టింది. తర్వాత ఎస్‌ఆర్‌–0 డెమోశాట్‌ ఉపగ్రహాన్ని లియో అర్బిట్‌లో ప్రవేశ పెట్టింది. 

NEET Cutoff Ranks-2024-25

NEET Cutoff Ranks-2024-25

NEET Cutoff Ranks: నీట్‌ MBBS కౌన్సెలింగ్‌లో ఏ ర్యాంకుకు ఎక్కడ సీటొస్తుందో తెలుసుకోవాలా? ఒక్క క్లిక్‌తో పూర్తి వివరాలు

తెలుగు రాష్ట్రాల్లో నీట్‌-2024 కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. కౌన్సెలింగ్‌ ప్రక్రియలో పాల్గొనే నీట్‌ యూజీలో ర్యాంకు పొందిన అభ్యర్ధులు తమ ర్యాంకుకు ఏ కాలేజీలో సీటు వస్తుందో తెలుసుకోవాలంటే గతేడాది కౌన్సెలింగ్‌ తీరుతెన్నులను ఓసారి గమనించి చూడాలి. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఏపీలో 34, తెలంగాణలో 54 కాలేజీల్లో ఎంబీబీఎస్‌ ప్రవేశాలు నిర్వహించారు. ఈ సారి నీట్ కౌన్సెలింగ్ లో పాల్గొనే అభ్యర్థులు..

తెలుగు రాష్ట్రాల్లో నీట్‌-2024 కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. కౌన్సెలింగ్‌ ప్రక్రియలో పాల్గొనే నీట్‌ యూజీలో ర్యాంకు పొందిన అభ్యర్ధులు తమ ర్యాంకుకు ఏ కాలేజీలో సీటు వస్తుందో తెలుసుకోవాలంటే గతేడాది కౌన్సెలింగ్‌ తీరుతెన్నులను ఓసారి గమనించి చూడాలి. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఏపీలో 34, తెలంగాణలో 54 కాలేజీల్లో ఎంబీబీఎస్‌ ప్రవేశాలు నిర్వహించారు. ఈ సారి నీట్ కౌన్సెలింగ్ లో పాల్గొనే అభ్యర్థులు గత ఏడాది జాతీయ, రాష్ట్ర స్థాయి ర్యాంకుల వివరాలతో పాటు ఏ ర్యాంకుకు ఏ కాలేజీల్లో సీటు వచ్చిందో పోల్చుకొని, ఈసారి ఏ కాలేజీలో సీటు వచ్చే అవకాశాలున్నాయో అంచనా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ నేప‌థ్యంలో గతేడాది (2023-24) తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన కౌన్సెలింగ్‌ వివరాలు ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోవచ్చు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గతేడాది (2023-24) చివరి మెడిక‌ల్ సీటు పొందిన ర్యాంకు/ స్కోరు వివ‌రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తెలంగాణ రాష్ట్రంలో గతేడాది (2023-24) చివరి మెడిక‌ల్ సీటు పొందిన ర్యాంకుల వివ‌రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

incometax-2024-new-vs-old-tax-benefits

incometax-2024-new-vs-old-tax-benefits

Income Tax: పాత Vs కొత్త పన్ను విధానం – ఇప్పుడు దేనివల్ల ఎక్కువ ప్రయోజనం?

New Income Tax Slabs: కొత్త పన్ను విధానంలో స్లాబ్‌ల వల్ల ఒక్కో టాక్స్‌ పేయర్‌పై రూ.17,500 వరకు పన్ను భారం తగ్గుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు.

Old Vs New Income Tax Regime: ఆదాయ పన్నుకు సంబంధించి, కేంద్ర బడ్జెట్‌లో ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇచ్చింది. కొత్త పన్ను విధానానికి ప్రాధాన్యత ఇచ్చిన మోదీ సర్కారు, టాక్స్‌ శ్లాబ్‌లను మార్చింది. దీంతో పాటు, ఉద్యోగులకు ప్రామాణిక తగ్గింపు (Standard Deduction) పరిమితిని రూ.50,000 నుంచి రూ.75,000కు పెంచింది. ఇది ఏకంగా 50% వెసులుబాటు.

కొత్త పన్ను విధానం ప్రకారం, రూ.7 లక్షల వరకు ఆదాయంపై పన్ను ఉండదు. దీనికి రూ.75,000 స్టాండర్డ్‌ డిడక్షన్‌ కలిపితే, మొత్తం 7 లక్షల 75 వేల రూపాయల (రూ.7,75,000) వరకు ఆదాయంపై టాక్స్‌ కట్టాల్సిన అవసరం లేదు. ఈ మార్పు వల్ల ఒక్కో టాక్స్‌ పేయర్‌కు అదనంగా రూ.17,500 వరకు ప్రయోజనం చేకూరుస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ చెప్పారు. అయితే, కొత్త పన్ను విధానంలో ఎలాంటి మినహాయింపులను క్లెయిమ్‌ చేసుకునేందుకు వీలుండదు. 

కొత్త పన్ను విధానంలో ఇప్పటివరకు అమల్లో ఉన్న టాక్స్‌ రేట్లు ఇవి:     

రూ.3,00,000 వరకు —– 0 టాక్స్‌ 
రూ.3,00,001 నుంచి రూ. రూ.6,00,000 వరకు —– 5% టాక్స్‌ 
రూ.6,00,001 నుంచి రూ.9,00,000 వరకు —– 10% టాక్స్‌ 
రూ.9,00,001 నుంచి రూ.12,00,000 వరకు —– 15% టాక్స్‌ 
రూ.12,00,001 నుంచి రూ.15,00,000 వరకు —– 20% టాక్స్‌ 
రూ.15,00,001 లేదా అంతకంటే ఎక్కువ ఆదాయం ఉంటే —– 30% టాక్స్‌ 

కొత్త బడ్జెట్‌ (2024-25) ప్రకారం, కొత్త పన్ను విధానంలోని పన్ను శ్లాబ్‌ల్లో జరిగిన మార్పులు:   

రూ.3,00,000 వరకు —– 0 టాక్స్‌ 
రూ.3,00,001 నుంచి రూ. రూ.7,00,000 వరకు —– 5% టాక్స్‌ 
రూ.7,00,001 నుంచి రూ.10,00,000 వరకు —– 10% టాక్స్‌ 
రూ.10,00,001 నుంచి రూ.12,00,000 వరకు —– 15% టాక్స్‌ 
రూ.12,00,001 నుంచి రూ.15,00,000 వరకు —– 20% టాక్స్‌ 
రూ.15,00,001 లేదా అంతకంటే ఎక్కువ ఆదాయం ఉంటే —– 30% టాక్స్‌ 

పాత పన్ను విధానంలో మాత్రం ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ ఎలాంటి మార్పులు చేయలేదు.

పాత పన్ను విధానం ప్రకారం అమల్లో ఉన్న శ్లాబ్‌ రేట్లు:     

రూ. 2,50,000 లక్షల వరకు —– 0 టాక్స్‌ 
రూ. 2,50,001 నుంచి రూ.5,00,000 లక్షల మధ్య ఆదాయంపై 5% టాక్స్‌ 
రూ.5,00,001 నుంచి రూ.10,00,000 లక్షల వరకు ఆదాయంపై 20% టాక్స్‌ 
రూ.10,00,001 లేదా అంతకుమించిన ఆదాయంపై 30% టాక్స్‌ 

పాత పన్ను విధానం శ్లాబ్‌ రేట్లలో సీనియర్‌, సూపర్‌ సీనియర్‌ సిటిజన్లకు కొన్ని వెసులుబాట్లు ఇచ్చారు. దీంతోపాటు… ఈ విధానంలో టాక్స్‌ పేయర్లందరికీ (వయస్సుతో సంబంధ‍ం లేకుండా) కొన్ని పన్ను మినహాయింపులు, తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. HRA, LTA, సెక్షన్‌లు 80C, 80D, 80CCD(1b), 80CCD(2) సహా చాలా మినహాయింపులను ఈ విధానంలో క్లెయిమ్‌ చేసుకోవచ్చు.

ఏ పన్ను విధానం మేలు?
గృహ రుణం, 80C, 80D సెక్షన్ల కిందకు వచ్చే పెట్టుబడులు ఉన్న టాక్స్‌పేయర్లలో ఎక్కువ మంది పాత పన్ను విధానమే మేలని నమ్ముతున్నారు, మెజారిటీ వర్గం దానినే ఎంచుకుంటున్నారు. పెద్దగా పొదుపులు, పెట్టుబడులు లేని వ్యక్తులు, తమ వార్షికాదాయం ఎప్పటికీ రూ.7,50,000 దాటదని అంచనా వేస్తున్న ఉద్యోగులు కొత్త పన్ను విధానాన్ని ఫాలో అవుతున్నారు.

india-post-dak-sevaks-recruitment-2024

india-post-dak-sevaks-recruitment-2024

Postal Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, పోస్టల్‌ శాఖలో 44,228 ఉద్యోగాలు – టెన్త్ అర్హత చాలు, ఎలాంటి పరీక్ష లేదు

postal Jobs: పోస్టల్ శాఖలో 44,228 గ్రామీణ డాక్ సేవక్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఇందులో నుంచి ఏపీకి 1355 పోస్టులు, తెలంగాణకు 981 పోస్టులు కేటాయించారు. ఆగస్టు 5 వరకు దరఖాస్తుకు అవకాశం ఉంది.

India Post Gramin Dak Sevaks Recruitment Notification 2024: దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో గ్రామీణ డాక్ సేవక్(జీడీఎస్‌) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా మొత్తం 44,228 పోస్టులను భర్తీచేయనున్నారు. ఇందులో బ్రాంచ్ పోస్టు మాస్టర్‌, అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌, డాక్‌ సేవక్‌ పోస్టులు ఉన్నాయి. ఈ ఖాళీల్లో తెలుగు రాష్ట్రాలకు 2336 పోస్టులను కేటాయించారు. ఇందులో ఏపీకి 1355 పోస్టులు కేటాయించగా.. తెలంగాణకు 981 పోస్టులు కేటాయించారు. పదోతరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జులై 15న ప్రారంభంకాగా.. ఆగస్టు 5 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.  

పోస్టుల వివరాలు..

గ్రామీణ డాక్ సేవక్ పోస్టులు

➥ బ్రాంచ్ పోస్టు మాస్టర్‌ (బీపీఎం)

➥ అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌ (ఏబీపీఎం)

➥ డాక్‌ సేవక్‌

మొత్తం పోస్టుల సంఖ్య: 44,228. 

తెలుగు రాష్ట్రాలకు కేటాయించిన పోస్టులు: ఏపీ-1355, తెలంగాణ-981.

పోస్టుల కేటాయింపు: యూఆర్ (జనరల్)-19,862; ఓబీసీ-8024; ఎస్సీ-5941; ఎస్టీ-4892; ఈడబ్ల్యూఎస్-4330; దివ్యాంగులు-1179.

అర్హతలు: పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి.

వయోపరిమితి: 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు కేటగిరీలవారీగా 10-13-15 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది. 

దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు, ట్రాన్స్‌ఉమెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. అభ్యర్థులు మొదట రిజిస్ట్రేషన్ ప్రక్రియ, ఫీజు చెల్లింపులు చేయాలి. ఇది పూర్తయిన తర్వాత ఆన్‌లైన్ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.

ఎంపిక విధానం: అభ్యర్థుల పదోతరగతిలో సాధించిన మెరిట్‌లిస్ట్‌ మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేసి ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తారు.

జీతభత్యాలు: నెలకు బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌ పోస్టుకు రూ.12,000 నుంచి రూ.29,380, అసిస్టెంట్‌బ్రాంచ్‌పోస్టు మాస్టర్‌/ డాక్‌ సేవక్‌ పోస్టుకు రూ.10,000 నుంచి రూ.24,470.

ధ్రువపత్రాల పరిశీలనకు సిద్ధం చేసుకోవాల్సిన డాక్యుమెంట్లు..

➥ మార్కుల సర్టిఫికేట్లు

➥ ఫొటో గుర్తింపు కార్డు

➥ క్యాస్ట్ సర్టిఫికేట్

➥ PWD సర్టిఫికేట్ (దివ్యాంగులైతే)

➥ EWS సర్టిఫికేట్ 

➥ ట్రాన్స్‌జెండర్ సర్టిఫికేట్

➥ పుట్టినతేదీ ధ్రువీకరణ పత్రం

➥ మెడికల్ సర్టిఫికేట్

➥ ఇతర అవసరమైన డాక్యుమెంట్లు

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 15.07.2024.

➥ ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేదీ: 05.08.2024.

➥ దరఖాస్తుల సవరణ: 06.08.2024 – 08.08.2024.

Notification
Circlewise Vacancy Details
Online Application
Fee Payment 
Website

ANU-distance-education-notification-details

ANU Distance Education : నాగార్జున యూనివ‌ర్సిటీ దూర విద్యా కోర్సుల‌కు నోటిఫికేష‌న్, ద‌ర‌ఖాస్తులకు జులై 31 వరకు గడువు

ANU Distance Education : గుంటూరు ఆచార్య నాగార్జున యూనివ‌ర్సిటీ (ఏఎన్‌యూ)లో దూర విద్యా యూజీ, పీజీ, డిప్లొమా త‌దిత‌ర‌ కోర్సుల‌కు అడ్మిష‌న్ నోటిఫికేష‌న్ విడుద‌ల అయింది. 2024-25 విద్యా సంవ‌త్సరానికి గాను అడ్మిష‌న్లకు సంబంధించిన నోటిఫికేష‌న్ ఏఎన్‌యూ దూర విద్యా విభాగం విడుద‌ల చేసింది. పీజీ ఆర్ట్స్‌, యూజీ ఆర్ట్స్‌, లైబ్రరీ ప్రోగ్రామ్స్‌, పీజీ కామ‌ర్స్ అండ్ మేనేజ్‌మెంట్‌, యూజీ కామ‌ర్స్ అండ్ మేనేజ్‌మెంట్‌, డిప్లొమా, స‌ర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ విభాగాల్లో మొత్తం 31 కోర్సుల్లో ప్రవేశానికి అభ్యర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తుంది. ద‌ర‌ఖాస్తు చేసేందుకు జులై 31 వ‌ర‌కు గ‌డువు నిర్ణయించింది. ద‌ర‌ఖాస్తు ఆన్‌లైన్‌లోనే చేయాల్సి ఉంటుంది. యూనివ‌ర్శిటీ అధికారిక వెబ్‌సైట్ www.anucde అప్లికేష‌న్ చేసుకోవాలి. ఈ కోర్సులు సెమిస్టర్ మోడ్‌లోనే ఉంటాయి.

కోర్సులు…అర్హత‌లు…ఫీజులు

ఏఎన్‌యూ డిస్టెన్స్ ఎడ్యూకేష‌న్‌లో కోర్సులకు తెలుగు, ఇంగ్లీష్ మీడియం ఉన్నాయి. ఏదైనా అభ్యర్థి ఎంపిక బ‌ట్టి ఏ మీడియం న‌చ్చితే ఆ మీడియం తీసుకోవ‌చ్చు. అలాగే కోర్సులు, అందులో చేరేందుకు అర్హత‌లు, ఫీజుల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

యూజీ ఆర్ట్స్ కోర్సులు

అండ‌ర్ గ్రాడ్యూయేట్ (యూజీ) ఆర్ట్స్‌ కోర్సులు తొమ్మిది ఉన్నాయి. అందులో ఎనిమిది కోర్సులు బీఏ (ఈహెచ్‌పీ), బీఏ (ఈపీపీ), బీఏ (ఈపీఎస్‌), బీఏ (ఈహెచ్ఎస్‌), బీఏ (ఈపీఎస్‌), బీఏ (హెచ్‌పీఎస్‌), బీఏ (పీపీహెచ్‌), బీఏ (స్పెష‌ల్ ఇంగ్లీష్, హీస్టరీ, స్పెష‌ల్ తెలుగు)కు అర్హత ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్మీడియ‌ట్ లేదా పాలిటెక్నిక‌ల్ లేదా రెండేళ్ల ఐటీఐ చేసి ఉండాలి. కోర్సు కాల వ్యవ‌ధి మూడేళ్లు (ఆరు సెమిస్టర్స్‌). ఫీజు ఏడాదికి రూ.4,880 ఉంటుంది. అలాగే బీఏ (ఎక‌నామిక్స్‌, బ్యాంకింగ్‌, కంప్యూట‌ర్ అప్లికేష‌న్‌) కోర్సుకు అర్హత‌, కోర్సు కాల వ్యవ‌ధి పైన పేర్కొన్న కోర్సుల‌కు ఉన్నవే. అయితే ఫీజులో మార్పు ఉంది. ఈ కోర్సుకు ఫీజు ఏడాదికి రూ.5,480 ఉంటుంది.

యూజీ కామ‌ర్స్ అండ్ మేనేజ్మెంట్ కోర్సులు

అండ‌ర్ గ్రాడ్యూయేట్ (యూజీ) కామ‌ర్స్ అండ్ మేనేజ్‌మెంట్ కోర్సులు మూడు ఉన్నాయి. బీకాం (కంప్యూట‌ర్ అప్లికేష‌న్స్‌) కోర్సు ఏడాది ఫీజు రూ.7,130, బీకాం (జ‌న‌ర‌ల్‌) కోర్సు ఏడాది ఫీజు రూ.5,630, బీబీఏ (బ్యాచిల‌ర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేష‌న్‌) కోర్సుకు ఏడాది ఫీజు రూ.6,530 ఉంది. ఈ మూడు కోర్సుల కాల వ్యవ‌ధి మూడేళ్ల పాటు ఆరు సెమిస్టర్స్ ఉంటాయి. అర్హతలు ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్మీడియ‌ట్ లేదా పాలిటెక్నిక‌ల్ లేదా రెండేళ్ల ఐటీఐ చేసి ఉండాలి.

పీజీ ఆర్ట్స్ కోర్సులు

పోస్టు గ్రాడ్యూయేట్ (పీజీ) ఆర్ట్స్‌ కోర్సులు 11 ఉన్నాయి. ఈ కోర్సుల కాల వ్యవ‌ధి రెండేళ్లు (నాలుగు సెమిస్టర్స్‌) ఉంటుంది. ఎంఏ ఇంగ్లీష్‌, ఎంఏ తెలుగు, ఎంఏ సంస్కృతం, ఎంఏ హిందీ, ఎంఏ ఎక‌నామిక్స్‌, ఎంఏ హిస్టరీ, ఎంఏ పొలిటిక‌ల్ సైన్స్‌, ఎంఏ సోషియాల‌జీ కోర్సుల‌కు ఏడాది ఫీజు రూ.6,530 ఉంటుంది. అలాగే ఈ కోర్సుల్లో ఎంఏ ఇంగ్లీష్‌, ఎంఏ సంస్కృతం, ఎంఏ హిందీ మిన‌హా ఇస్తే మిగిలిన కోర్సుల‌న్నీ తెలుగు మాధ్యమంలోనే ఉంటాయి. ఎంఏ ఇంగ్లీష్ కోర్సుకు అర్హత ఇంగ్లీష్‌తో పాటు ఏదైనా డిగ్రీ, ఒక పేప‌ర్ వంద మార్కుల‌తో కూడిన ఇంగ్లీష్ ఉండే ప్రొఫెస‌న‌ల్ గ్రాడ్యూయేష‌న్ ఉండాలి. ఎంఏ తెలుగుకి తెలుగుతో ఏదైనా డిగ్రీ ఉండాలి. ఎంఏ సంస్కృతం కోర్సుకు సంస్కృతంతో ఏదైనా డిగ్రీ, క‌నీసం ఒక సంస్కృతం పేప‌రు ఉండే ఎంఏ తెలుగు ఉండాలి. ఎంఏ హిందీకి హిందీ రెండో భాష‌గా ఏదైనా డిగ్రీ, బీఏలో హిందీ స్పెష‌ల్ స‌బ్జెక్ట్, రాష్ట్రీయ భాష ప్రవీణ్యం వంటి అర్హత‌లు ఉన్నాయి. ఇత‌ర కోర్సుల‌కు ఏదైనా డిగ్రీ ఉండాలి.

అలాగే మ‌రో మూడు పోస్టు గ్రాడ్యూయేట్ కోర్సులు ఫీజులు ఇలా ఉన్నాయి. ఎంఎస్‌డబ్ల్యూ కోర్సు ఫీజు రూ.10,030, ఎంఏ జ‌ర్నలిజం అండ్ మాస్ క‌మ్యూనికేష‌న్ కోర్సు ఫీజు రూ.7,730, ఎంఏ హెచ్ఆర్ఎం కోర్సు ఫీజు రూ.8,930 ఉంది. వీటికి అర్హ‌త ఏదైనా డిగ్రీ చేసి ఉండాలి. ఈ మూడు కోర్సులు ఇంగ్లీష్‌ మాధ్యమంలో ఉంటాయి.

పీజీ కామ‌ర్స్‌ కోర్సులు

పోస్టు గ్రాడ్యూయేట్ (పీజీ) కామ‌ర్స్ కోర్సులు రెండు ఉన్నాయి. అవి ఎంకాం (అకౌంట్‌న్సీ), ఎంకాం (బ్యాకింగ్‌) కోర్సులు. వీటికి అర్హ‌త బీకాం, బీబీఎం ఉండాలి. అలాగే కోర్సుల కాల వ్యవ‌ధి రెండేళ్లు (నాలుగు సెమిస్టర్స్‌) ఉంటాయి. ఫీజు ఏడాదికి ఒక్కో కోర్సుకి రూ.6,730 ఉంటుంది. ఈ కోర్సులు ఇంగ్లీష్ మాధ్యమంలో ఉంటాయి.

లైబ్రరీ అండ్ ఇన్‌ఫ‌ర్మేష‌న్ సైన్స్ కోర్సులు

లైబ్రరీ అండ్ ఇన్‌ఫ‌ర్మేష‌న్ సైన్స్ కోర్సులు రెండు. అందులో బీఎల్ఐఎస్‌సీ (బ్యాచిల‌ర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్‌ఫ‌ర్మేష‌న్ సైన్స్‌) దీనికి అర్హత ఏదైనా డిగ్రీ ఉండాలి. ఈ కోర్సుకు ఫీజు రూ.8,975 ఉంటుంది. అలాగే ఎంఎల్ఐఎస్‌సీ (మాస్టర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్‌ఫ‌ర్మేష‌న్ సైన్స్‌) దీనికి అర్హ‌త బీఎల్ఐఎస్‌సీ ఉండాలి. ఈ కోర్సుకు ఫీజు రూ.10,675 ఉంటుంది. ఈ రెండు కోర్సుల‌ కాల వ్య‌వ‌ధి ఏడాది (రెండు సెమిస్టర్స్ ) ఉంటుంది. ఇంగ్లీష్ మాధ్యమంలో ఉంటాయి.

డిప్లొమా కోర్సులు

డిప్లొమా కోర్సులు రెండు ఉన్నాయి. డిప్లొమా ఇన్ ఫుడ్ ప్రొడ‌క్సన్ కోర్సు దీనికి అర్హత ఎస్ఎస్‌సీ, లేదా దానికి స‌మాన‌మైన విద్యాలో ఉత్తీర్ణత సాధించాలి. ఈ కోర్సు ఫీజు రూ.8,025 ఉంటుంది. డిప్లొమా ఇన్ సైక్లాజిక‌ల్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ కోర్సుకు అర్హత‌ ప‌దో త‌ర‌గ‌తితో పాటు ఇంట‌ర్మీడియ‌ట్ ఉత్తీర్ణత సాధించాలి. అలాగే పాలిటెక్నిక‌ల్‌, లేదా రెండేళ్ల ఐటీఐ చేసి ఉండాలి. ఈ కోర్సు ఫీజు రూ.8,170 ఉంటుంది. ఈ రెండు కోర్సుల‌ కాల వ్యవ‌ధి ఏడాది ఉంటుంది. ఇంగ్లీష్ మాధ్యమంలో ఉంటాయి.

స‌ర్టిఫికేట్ కోర్సులు

స‌ర్టిఫికేట్ కోర్సులు రెండు ఉన్నాయి. హోట‌ల్ అండ్ హాస్పిటల్ హౌస్ కీపింగ్ కోర్సుకు అర్హత ఎస్ఎస్‌సీ, లేదా దానికి స‌మాన‌మైన విద్యాలో ఉత్తీర్ణత సాధించాలి. ఈ కోర్సు ఫీజు రూ.6,525 ఉంటుంది. హెచ్ఐవీ అండ్ ఎయిడ్స్ కౌన్సిలింగ్ కోర్సుకు అర్హత ఏదైనా డిగ్రీ ఉండాలి. లేదా ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్మీడియ‌ట్ ఉత్తీర్ణతతో పాటు పారా మెడిక‌ల్ అర్హత సాధించి ఉండాలి. ఈ కోర్సు ఫీజు రూ.5,625 ఉంటుంది. ఈ రెండు కోర్సుల‌ కాల వ్యవ‌ధి ఏడాది ఉంటుంది. ఇంగ్లీష్ మాధ్యమంలో ఉంటాయి.

ఇత‌ర వివ‌రాల కోసం అధికారిక వెబ్‌సైట్ www.anucde.info సంప్రదించాలి. అలాగే అధికారిక ఈ మెయిల్ anucdedirector@gmail.com

JNVST Admissions-6th-class-admissions

JNVST Admissions-6th-class-admissions

JNVST Admission : నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి అడ్మిషన్లు.. అప్లికేషన్‌ ప్రాసెస్‌ ప్రారంభమైంది

JNVST Class 6 Admission 2025 : దేశవ్యాప్తంగా ఉన్న నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశాలకు సంబంధించి జవహార్‌ నవోదయ విద్యాలయ (Navodaya Vidyalaya Samiti) సెలక్షన్‌ టెస్ట్‌ – 2025 నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తుల ప్రక్రియ జులై 16 నుంచి ప్రారంభమైంది. 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు సెప్టెంబరు 16వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. దేశంలోని 653 విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ప్రవేశ పరీక్ష నిర్వహించనుంది. 01-05-2013 నుంచి 31-07-2015 మధ్య జన్మించిన వారు అర్హులు. రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ-9, ఆంధ్రప్రదేశ్‌-15 జవహార్‌ నవోదయ విద్యాలయాలున్నాయి. విద్యార్థులు పూర్తి వివరాలకు CLICK HERE

రాత పరీక్ష విధానం :

రాత పరీక్ష ఆయా తేదీల్లో ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు జరుగుతుంది. మొత్తం 3 విభాగాల నుంచి 80 ప్రశ్నలకు 100 మార్కులకు పరీక్ష జరుగుతుంది. మెంటల్‌ ఎబిలిటీలో 40 ప్రశ్నలకు 50 మార్కులు, అర్ధమెటిక్‌ నుంచి 20 ప్రశ్నలకు 25 మార్కులు, ల్యాంగ్వేజ్‌ టెస్ట్‌ నుంచి 20 ప్రశ్నలకు 25 మార్కులకు పరీక్ష ఉంటుంది. మొత్తం 2 గంటల్లో పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఆఫ్‌లైన్‌ విధానంలో పరీక్ష జరుగుతుంది. ఓఎమ్మార్‌ షీట్‌పై సరైన సమాధానాలను గుర్తించాల్సి ఉంటుంది. నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది.

ప్రతి తప్పు సమాధానానికి 1.25 మార్కుల చొప్పున కోత ఉంటుంది. రాత పరీక్ష స్థానిక భాషల్లో కూడా నిర్వహిస్తారు. తెలుగుతో సహా ఇంగ్లిష్, హిందీ, మరాఠీ, ఉర్దూ, ఒరియా, కన్నడ, బోడో, బెంగాళీ, అస్సామీ,పంజాబీ వంటి అన్ని స్థానిక భాషల్లో పరీక్షలు నిర్వహిస్తారు.

pradhan-mantri-kaushal-vikas-yojana-pmkvy-details

pradhan-mantri-kaushal-vikas-yojana-pmkvy-details

10వ తరగతి ఉత్తీర్ణులైతే చాలు నెలకు 8,000. ఇలా దరఖాస్తు చేసుకోండి

ప్రధాన్ మంత్రి కౌశల్ వికాస్ యోజన (PMKVY) : 10వ తరగతి ఉత్తీర్ణులైతే చాలు నెలకు 8,000. ఇలా దరఖాస్తు చేసుకోండి

ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన (PMKVY) అనేది భారతదేశ యువతలో నైపుణ్యం అభివృద్ధిని ప్రోత్సహించడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన ఫ్లాగ్‌షిప్ పథకం. :

PMKVY యొక్క వివరాలు

– యువతలో నైపుణ్యాలను పెంపొందించడం ద్వారా ఉపాధి అవకాశాలను సృష్టించడం.
– 10వ తరగతి ఉత్తీర్ణులైన వారితో సహా నిరుద్యోగ యువత.
– నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ.
– శిక్షణ కాలంలో నెలకు ₹8,000 అందిస్తుంది.

PMKVY యొక్క లక్షణాలు

– ఆన్‌లైన్ శిక్షణ : యువత స్కిల్ ఇండియా డిజిటల్ ద్వారా ఆన్‌లైన్‌లో శిక్షణ పొందవచ్చు.
– ప్రాక్టికల్ కోర్సులు : ఉపాధిని మెరుగుపరచడానికి వివిధ ప్రాక్టికల్ కోర్సులు అందించబడతాయి.
– ధృవీకరణ : పూర్తయిన తర్వాత, భారతదేశం అంతటా చెల్లుబాటు అయ్యే ప్రమాణపత్రం జారీ చేయబడుతుంది.
– అదనపు ప్రయోజనాలు : లబ్ధిదారులు T- షర్ట్ లేదా జాకెట్, డైరీ, ID కార్డ్, బ్యాగ్ మొదలైనవాటిని అందుకుంటారు.

అర్హత ప్రమాణం

– భారతదేశ పౌరుడిగా ఉండాలి.
– 18 ఏళ్లు నిండిన నిరుద్యోగ యువత అయి ఉండాలి.
– కనీస విద్యార్హత: 10వ తరగతి.
– హిందీ మరియు ఇంగ్లీషులో ప్రాథమిక పరిజ్ఞానం అవసరం.

అవసరమైన పత్రాలు

– ఆధార్ కార్డ్ లేదా ఏదైనా ఇతర గుర్తింపు కార్డు.
– విద్యా పత్రాలు.
– నివాస ధృవీకరణ పత్రం.
– మొబైల్ నంబర్.
– పాస్‌పోర్ట్ సైజు ఫోటో.
– బ్యాంక్ ఖాతా పాస్‌బుక్.

PMKVY కోసం నమోదు చేసుకోవడానికి దశలు

– PMKVY Official వెబ్‌సైట్ https://www.pmkvyofficial.org/ పీజీని కి ఓపెన్ చేయండి

– హోమ్ పేజీలో “PMKVY Online ” ఎంపికపై ఎంటర్ చేయండి.

– రిజిస్ట్రేషన్ ఫారమ్ కనిపిస్తుంది. అభ్యర్థించిన మొత్తం సమాచారాన్ని ఖచ్చితంగా అందించండి.

గుర్తింపు రుజువు, విద్యా పత్రాలు మరియు ఇతర అవసరమైన సర్టిఫికేట్‌లతో సహా అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి.

– అన్ని వివరాలను పూరించి, పత్రాలను అప్‌లోడ్ చేసిన తర్వాత, “సమర్పించు” బటన్‌పై క్లిక్ చేయండి.

అదనపు సమాచారం

– పూర్తి అధికారిక వివరాల కోసం, మీరు [PMKVY అధికారిక పత్రం](https://www.pmkvyofficial.org/pmkvy2/App_Documents/News/PMKVY_Scheme-Document_v1.1.pdf) నుండి PDFని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఈ దశలను అనుసరించడం ద్వారా, అర్హతగల అభ్యర్థులు PMKVY పథకం కోసం సులభంగా నమోదు చేసుకోవచ్చు మరియు ఉపాధిని పొందడంలో మరియు వారి నైపుణ్యాలను మెరుగుపరచడంలో సహాయపడే శిక్షణను పొందవచ్చు.

how-to-apply-sbi-pradhan-mantri-e-mudra-loans

how-to-apply-sbi-pradhan-mantri-e-mudra-loans

how-to-apply-sbi-pradhan-mantri-e-mudra-loans

మీకు SBIలో ఖాతా ఉంటే చాలు.. ఈజీగా రూ.1 లక్ష లోన్.. ఏ పూచీకత్తు అవసరం లేదు!

SBI Loan: చిన్నగా ఏదైనా బిజినెస్ ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే, మీకు మంచి అవకాశం. తక్కువ వడ్డీకే, ఎలాంటి పూచీకత్తు అవసరం లేకుండా రూ.1 లక్ష వరకు లోన్ పొందొచ్చు. అది కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే ఇస్తోంది. మీరు బ్యాంకులో ఖాతా తీసుకుని 6 నెలలు పూర్తయితే సరిపోతుంది. మీకు లోన్ మంజూరు చేస్తుంది బ్యాంక్ ఆ వివరాలు ఇప్పుడే తెలుసుకోండి మరి.

SBI Loan: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్‌బీఐలో అకౌంట్ కలిగి ఉన్న కస్టమర్లకు ఇది మంచి అవకాశం. చాలా ఈజీగా రూ. 1 లక్ష వరకు రుణం అందుకోవచ్చు. ఎస్బీఐ వివిధ రకాల లోన్స్ అందిస్తోంది. అందులో ప్రధాన మంత్రి ముద్రా లోన్స్ ఒకటి. ఎస్‌బీఐ ప్రస్తుతం ఇ-ముద్రా లోన్స్ సైతం జారీ చేస్తోంది. అంటే మీరు బ్యాంక్‌కు వెళ్ల కుండానే ఇంటి నుంచే ఈ లోన్లకు అప్లై చేసుకుని పొందవచ్చు. ముద్రా లోన్ కోసం ఎలాంటి పూచీకత్తు పెట్టాల్సిన అవవసరం లేదు. చాలా తక్కువ పత్రాలతో, తక్కువ వడ్డీకే అందిస్తోంది బ్యాంక్. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇ-ముద్రా స్కీమ్ ద్వారా చిన్న మొత్తాల్లో రుణాలు ఇస్తోంది. రుణం కావాల్సిన కస్టమర్లు బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లకుండానే లోన్ అమౌంట్ అందుకోవచ్చు. ఈ తరహా లోన్ తీసుకునేందుకు మైక్రో ఎంట్రప్రెన్యూర్ అయ్యి ఉండాలి. బ్యాంక్‌లో సేవింగ్స్ అకౌంట్ లేదా కరెంట్ అకౌంట్ ఉండాలి. అకౌంటి ఓపెన్ చేసి కనీసం 6 నెలలు పూర్తై ఉండాలి. ఇ-ముద్రా లోన్స్ ద్వారా ఎస్‌బీఐ బ్యాంక్ గరిష్టంగా రూ. 1 లక్ష వరకు లోన్ ఇస్తోంది. లోన్ పొందిన తర్వాత 5 సంవత్సరాల కాల పరిమితిలోపు తిరిగి చెల్లించాలి.

ఇ-ముద్రా ద్వారా తీసుకున్న లోన్ రూ.50 వేల కంటే తక్కువగా ఉంటే నేరుగా ఆన్‌లైన్‌ విధానంలోనే పొందొచ్చు. అదే రూ. 50 వేలు దాటితే బ్యాంక్‌కు వెళ్లి రుణం కోసం అప్లై చేసుకోవాలి. రుణం పొందాలనుకునే కస్టమర్లు సేవింగ్స్ లేదా కరెంట్ అకౌంట్ నంబర్, ఏ బిజినెస్ చేస్తున్నారనే ప్రూఫ్, ఆధార్ నంబర్, కమ్యూనిటీ వివరాలు (జనరల్/ ఎస్సీ / ఎస్టీ/ ఓబీసీ/ మైనారిటీ), జీఎస్‌టీఎన్ నంబర్, యూడీవైఓజీ ఆధార్ వివరాలు, షాప్ చిరునామా, బిజినెస్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు చూపించాల్సి ఉంటుంది. ఇ-ముద్రా ఎస్‌బీఐ వెబ్‌సైట్‌లోకి వెళ్లి లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇప్పటికే వ్యాపారం చేస్తూ తమ బిజినెస్ విస్తరించుకోవాలనే వారు ఈ రుణాలు సులభమంగా పొందొచ్చు. రూ. 1 లక్ష వరకు లోన్ అందిస్తోంది బ్యాంక్. అలాగే తిరిగి చెల్లించే టెన్యూర్ 5 ఏళ్ల వరకు ఎంచుకోవచ్చు. త్వరగా చెల్లించాలనుకునే వారు అంతకన్నా తక్కువ టెన్యూర్ ఎంచుకోవచ్చు. 5 ఏళ్ల టైం పెట్టుకుంటే నెల వారీ ఈఎంఐ తక్కువే పడుతుంది. అయితే టెన్యూర్ పెరిగితే వడ్డీ భారం పెరుగుతుందని కస్టమర్లు గుర్తించుకోవాలి. ఎస్‌బీఐ ముద్రా లోన్ గరిష్ఠంగా రూ.10 లక్షల వరకు పొందవచ్చు.

ఆన్‌లైన్‌లో ఇలా అప్లై చేసుకోవచ్చు..

  • ముందుగా ఎస్‌బీఐ ఇ-ముద్రా పోర్టల్‌లోకి వెళ్లాలి.
  • హోమ్ పేజీలో కనిపించే అప్లై నౌ బటన్ పై క్లిక్ చేయాలి.
  • సూచనలు చదివి ఓకే బటన్ పై క్లిక్ చేస్తే తదుపరి పేజీలోకి వెళ్తుంది.
  • మొబైల్ నంబర్, ఎస్‌బీఐ సేవింగ్స్ అకౌంట్ లేదా కరెంట్ అకౌంట్ నంబర్, ఎంత లోన్ కావాలి అని వివరాలు ఇవ్వాలి.
  • క్యాప్చా కోడ్ ఎంట్ చేసి ప్రొసీడ్ నొక్కాలి.
  • ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారంలో వివరాలు నింపాలి. కావాల్సిన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి.
  • ఎస్‌బీఐ ఇ-ముద్రా షరతులు, నిబంధనలు ఆమోదించి ఇ-సైనిన్ కావాలి.
  • ఆధార్ ద్వారా ఇ-సైనిన్ అయితే మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి ఓటీపీ వస్తుంది.
  • ఓటీపీ ఎంటర్ చేసి అప్లికేషన్ పూర్తి చేయాలి.

ap-engineering-colleges-fees-details-2024-25

ap-engineering-colleges-fees-details-2024-25

Engineering: ఏపీలో ఇంజినీరింగ్‌ ఫీజుల ఖరారు

రాష్ట్రంలో 210 బీటెక్, రెండు ఆర్కిటెక్చర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలకు 2024-25 సంవత్సరానికి ఫీజులు ఖరారు చేస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులిచ్చింది. ఇంజినీరింగ్‌లో బీటెక్‌ కోర్సులకు అత్యధికంగా రూ.1.03 లక్షల నుంచి రూ.1.05 లక్షలు, అత్యల్పంగా రూ.40 వేల చొప్పున నిర్ణయించారు.

అమరావతి: రాష్ట్రంలో 210 బీటెక్, రెండు ఆర్కిటెక్చర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలకు 2024-25 సంవత్సరానికి ఫీజులు ఖరారు చేస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులిచ్చింది. ఇంజినీరింగ్‌లో బీటెక్‌ కోర్సులకు అత్యధికంగా రూ.1.03 లక్షల నుంచి రూ.1.05 లక్షలు, అత్యల్పంగా రూ.40 వేల చొప్పున నిర్ణయించారు.

AP ENGINEERING COLLEGES FEES DETAILS G.O PDF CLICK HERE

ఇందులో రూ.40 వేల రుసుము ఉన్న కళాశాలలు 114, రూ.లక్షపైన రుసుము ఉన్న కళాశాలలు ఎనిమిది ఉన్నాయి. రెండు ఆర్కిటెక్చర్‌ కళాశాలలకు రూ.35 వేల చొప్పున రుసుము ఖరారు చేశారు. ట్యూషన్, అఫిలియేషన్, గుర్తింపుకార్డు, మెడికల్, ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర విద్యార్థి కార్యకలాపాలు తదితర ఖర్చులన్నీ ఈ రుసుములోకే వస్తాయి. అదనంగా కళాశాలలు వసూలు చేయకూడదు. వసతి, రవాణా, మెస్, రిజిస్ట్రేషన్, ప్రవేశ, రిఫండబుల్‌ ఫీజులు ఇందులో చేర్చలేదు.

నిర్ణయించిన రుసుములకు మించి అదనంగా క్యాపిటేషన్, డొనేషన్లు తదితరాల పేరుతో ఎలాంటి మొత్తమూ వసూలు చేయకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలా చేసేవారిపై చట్టప్రకారం జరిమానా విధించడంతోపాటు న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొంది.

పెండింగ్‌లో ఉన్న రిట్‌ పిటిషన్లపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తీర్పునకు లోబడి రుసుములు ఉంటాయని ఉత్తర్వుల్లో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి సౌరబ్‌గౌర్‌ పేర్కొన్నారు.

గుంటూరులోని ఆర్‌వీఆర్‌అండ్‌జేసీ, విశాఖలోని గాయత్రీ విద్యాపరిషత్‌ విద్యా సంస్థలు,

విజయవాడలోని ప్రసాద్‌ వి పొట్లూరి సిద్దార్థ, వీఆర్‌ సిద్దార్థ,

భీమవరంలోని ఎస్‌ఆర్‌కేఆర్, శ్రీవిష్ణు ఇంజినీరింగ్‌ కాలేజి ఫర్‌ ఉమెన్‌ కళాశాలలకు రూ.1.05 లక్షల చొప్పున, విష్ణు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ కళాశాలకు రూ.1.03 లక్షలుగా ఖరారు చేశారు. విశాఖలోని జీవీపీ కాలేజీ ఫర్‌ డిగ్రీ, పీజీ కాలేజీకి రూ.92,400, పెద్దాపురంలోని ఆదిత్య ఇంజినీరింగ్‌ కళాశాల ఫీజు రూ.93,700గా ఉంది.

ap-tet-2024-revised-schedule-details

ap-tet-2024-revised-schedule-details

APTET Schedule: ఏపీటెట్ – 2024 షెడ్యూలులో మార్పులు – దరఖాస్తు, పరీక్షల కొత్త తేదీలు

AP TET: ఏపీలో టెట్‌కు, డీఎస్సీకి సన్నద్ధమవుతున్న అభ్యర్థులు చేసిన వినతుల మేరకు టెట్ పరీక్షల తేదీల్లో విద్యాశాఖ మార్పులు చేసింది. జులై 17తో ముగియాల్సిన దరఖాస్తు గడువును ఆగస్టు 3 వరకు పొడిగించింది.

AP TET July 2024 New Schedule: ఏపీలో టెట్ 2024 జులై సెషన్‌లో విద్యాశాఖ మార్పులు చేసింది. దరఖాస్తు గడువును పెంచడంతోపాటు.. పరీక్షల తేదీల్లోనూ మార్పులు చేసింది. టెట్‌కు, డీఎస్సీకి సన్నమయ్య సన్నద్ధమవుతున్న అభ్యర్థులు తమకు పరీక్షల కోసం మరింత సమయం కావాలని, ఒక్కో పరీక్షకు కనీసం 90 రోజుల వ్యవధి ఉండాలని చేసిన వినతులకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు కొత్త షెడ్యూలును విద్యాశాఖ ప్రకటించింది.

ఏపీటెట్ ఫీజు చెల్లింపు ప్రక్రియ జులై 3న ప్రారంభంకాగా.. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జులై 4న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఏపీ టెట్ ఫీజు చెల్లింపు గడువు జులై 16తో, దరఖాస్తు గడువు జులై 17తో ముగియాల్సి ఉంది. అయితే ఆగస్టు 3 వరకు ఫీజు చెల్లింపు, దరఖాస్తు గడువును పొడిగించారు. పరీక్ష ఫీజు కింద అభ్యర్థులు ఒక్కో పేపరుకు (పేపర్-1ఎ, పేపర్-1బి, పేపర్-2ఎ, పేపర్-2బి) రూ.750 వేర్వేరుగా చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే హెల్ప్‌లైన్ నెంబర్లు: 9505619127, 9705655349, 8121947387, 8125046997 ద్వారా సంప్రదించవచ్చు. 

కొత్తగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. అక్టోబరు 3 నుంచి 20 వరకు టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. కంప్యూటర్ ఆధారిత విధానంలో ఈ పరీక్షలు జరుగనున్నాయి. ఆయా తేదీల్లో ప్రతిరోజూ రెండు సెషన్లలో టెట్‌ పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను సెప్టెంబరు 22 నుంచి అందుబాటులో ఉంచనున్నారు.

AP TET JULY 2024 Fee Payment

AP TET 2024 Online Application 

Website

ఏపీటెట్ జులై 2024 కొత్త షెడ్యూలు..

➥ AP TET – జులై -2024 నోటిఫికేషన్ వెల్లడి: 02.07.2024.

➥ దరఖాస్తు ఫీజు చెల్లింపు తేదీలు: 03.07.2024 – 03.08.2024.

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 04.07.2024 – 03.08.2024. 

➥ ఆన్‌లైన్ మాక్ టెస్టులు అందుబాటులో: 19.09.2024 నుంచి.

➥ టెట్ హాల్‌టికెట్ల డౌన్‌లోడ్: 22.09.2024 నుంచి 

➥ టెట్ పరీక్ష షెడ్యూలు: 03.10.2024 – 20.10.2024.  రెండు సెషన్లలో{పేపర్-1(ఎ) & పేపర్-1(బి), పేపర్-2(ఎ) & పేపర్-2(బి)}

➥ టెట్ ప్రాథమిక ‘కీ’ విడుదల: 04.10.2024 నుంచి,

➥ ఆన్సర్ కీపై అభ్యంతరాల స్వీకరణ: 05.10.2024 నుంచి.

➥ టెట్ ఫైనల్ కీ విడుదల: 27.10.2024.

➥ టెట్ ఫలితాల వెల్లడి: 02.11.2024.

ఏపీటెట్ -2024 పరీక్ష విధానం..

ఒక్కో పేపరుకు 150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 150 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు కేటాయించారు. పరీక్షలో నెగెటివ్ మార్కులు లేవు. పరీక్ష సమయం 2.30 గంటలు.

➥ పేపర్-1 ఎలో 150 ప్రశ్నలకుగాను 150 మార్కులకు: చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగోగి 30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వేజ్-1 30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వేజ్-2 (ఇంగ్లిష్) 30 ప్రశ్నలు-30 మార్కులు, మ్యాథమెటిక్స్-30 ప్రశ్నలు-30 మార్కులు, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్-30 ప్రశ్నలు-30 మార్కులు ఉంటాయి.

➥ పేపర్-1 బిలో 150 ప్రశ్నలకుగాను 150 మార్కులకు: చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగోగి 30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వేజ్-1 30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వేజ్-2 (ఇంగ్లిష్) 30 ప్రశ్నలు-30 మార్కులు, మ్యాథమెటిక్స్-30 ప్రశ్నలు-30 మార్కులు, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్-30 ప్రశ్నలు-30 మార్కులు ఉంటాయి.

➥ పేపర్-2 ఎలో 150 ప్రశ్నలకుగాను 150 మార్కులకు: చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగోగి 30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వేజ్-1 30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వేజ్-2 (ఇంగ్లిష్) 30 ప్రశ్నలు-30 మార్కులు, మ్యాథమెటిక్స్/బయాలజీ/ఫిజిక్స్/సోషల్ స్టడీస్/లాంగ్వేజ్-60 ప్రశ్నలు-60 మార్కులు ఉంటాయి.

➥ పేపర్-2 బిలో 150 ప్రశ్నలకుగాను 150 మార్కులకు: చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగోగి 30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వేజ్-1 30 ప్రశ్నలు-30 మార్కులు, లాంగ్వేజ్-2 (ఇంగ్లిష్) 30 ప్రశ్నలు-30 మార్కులు, కేటగిరీ ఆఫ్ డిజెబిలిటీ స్పెషలైజేషన్ అండ్ పెడగోగి -60 ప్రశ్నలు-60 మార్కులు ఉంటాయి.
పరీక్షలో అర్హత మార్కులను ఓసీలకు 60 మార్కులు, బీసీలకు  50 మార్కులు, ఎస్సీ-ఎస్టీ-దివ్యాంగులు-ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 40 శాతం ఉంటే సరిపోతుంది.

error: Content is protected !!