apteachers-employees-soubts-answers-2-with-G.O-copies

సoదేహాలు-సమాధానాలు

1. ప్రశ్న:
భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగస్తులైనపప్పుడు, వారిలో ఎవరైనా ఒకరు మరణించిన సందర్భంలో ఆ కుటుంబ సభ్యులలో ఒకరికి కారుణ్య నియామకం ఇస్తారా? ఏదైనా జీవో ఉన్నదా?*
జవాబు:
కారుణ్య నియామకం హక్కు కాదు. చనిపోయిన ఉద్యోగి కుటుంబం రోడ్డున పడకుండా ఇచ్చిన Social Welfare Scheme.  కుటుంబానికి ఆదాయ మార్గాలున్నప్పుడు కారుణ్య నియామకం ఇవ్వరు.*
2. ప్రశ్న:
సార్ నాకు ఇంక్రిమెంట్ జనవరి నెలలో వస్తుంది కానీ నేను 2020 అక్టోబర్ లో లీవ్ వెళ్లినాను. జూన్ 2021 నెలలో జాయిన్ అయ్యాను. ఇంక్రిమెంట్ డేట్ జనవరి లోనా? జూన్ లోనా? చెప్పండి.*
జవాబు:
జనవరిలో ఇంక్రిమెంట్ తేదీన మీరు లీవ్ లో ఉన్నారు కాబట్టి, ఆ లీవ్ నుండి జాయిన్ అయిన తర్వాత మాత్రమే, జాయినింగ్ తేదీన వస్తుంది. మెడికల్ లీవులో వెళ్ళారు కాబట్టి, ఈ సంవత్సరం, జూన్ లో వస్తుంది. తర్వాత జనవరికి వస్తుంది.
3. ప్రశ్న:
నేను 10వ తరగతి తర్వాత ఇంటర్ చదవకుండా ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ చేశాను. తదుపరి బి.ఎడ్ చేసి ప్రస్తుతం Sgt గా పనిచేస్తున్నాను. నాకు పదోన్నతి ఇస్తారా? ఇవ్వరా?
*జవాబు:*
స్కూల్ అసిస్టెంట్ పదోన్నతికి మీకు ఈ అర్హతలు సరిపోతాయి.
4. ప్రశ్న:
డిపార్ట్మెంట్ పరీక్షలకు హాజరయ్యే ఉపాధ్యాయులు ఎన్నిసార్లు Onduty సౌకర్యం ఏ ఉత్తర్వుల ప్రకారం ఉంటుంది ?*
జవాబు:
AP ట్రావలింగ్ రూల్స్ లో 73 ప్రకారం , F.R 9(6)(B)(iii) ప్రకారం ఒక అభ్యర్థి డిపార్ట్ మెంట్ పరీక్షలకు హాజరగుటకు DA లేకుండా రెండుసార్లు TA మరియు OD సౌకర్యాన్ని వినియోగించవచ్చును.
5. ప్రశ్న:
SA(Hindi) గా పనిచేయుచున్న నేను HM Post ప్రమోషన్ కు అర్హుడనేనా ?*
జవాబు:
అవును. సంబంధిత డిపార్ట్ మెంట్ టెస్టు పాస్ అయి, డైరెక్ట్ స్కూల్ అసిస్టెంట్ అయితే 45 సం.లు దాటినా లేదా స్కూల్ అసిస్టెంట్ గా ప్రమోషన్ పొందినవారు 50సం.లు వయస్సు దాటినా హెచ్.ఎం గా ప్రమోషన్ పొందడానికి అర్హులు. 10వ తరగతి తర్వాత 5 సంవత్సరములు స్టడీ ఉండాలి.
6. ప్రశ్న:
ఉద్యోగాలలో మహిళలకు రిజర్వేషన్లు ఎలా అమలు చేస్తారు?
జవాబు:
రూల్-22A ప్రకారం అన్ని కేటగిరీలకు చెందిన రిజర్వేషన్ స్థానాలలో మహిళలు కి 33 1/2 % రిజర్వ్ చేయబడి ఉన్నది. sc/st/bc/oc కేటగిరీల వారికి కేటాయించబడిన స్థానాలలో ఆయా కేటగిరీకి చెందిన మొదటి స్థానం, ఆ తదుపరి ప్రతి మూడవ స్థానం మహిళలకి రిజర్వ్ చేయబడింది. పై రెండు రకాల రిజర్వేషన్లు వర్తింపజేస్తూ కమ్యూనల్ రోస్టర్ తయారు చేయబడుతుంది.
1. ప్రశ్న:
నేను 13.6.16 న విధులలో చేరాను. ట్రైనింగ్ లేదు. కానీ జీతం 1.6.16 నుండి ఇచ్చారు. ఇపుడు జాయినింగ్ తేదీగా ఏది SR లో రాయాలి?*
జవాబు:
జీతం 1.6.16 నుండి ఇచ్చారు కాబట్టి మీ date of జాయినింగ్ కూడా 1.6.16 రే అవుతుంది.
2. ప్రశ్న:
నేను CPS ఉద్యోగిని. సేవింగ్స్ 1,20,000/- ఉన్నాయి. CPS మినహాయింపు 53,000/- ఉన్నాయి. వీటిని ఐటీ ఫారంలో ఎలా చూపాలి?*
జవాబు:
30,000/- వరకు 80ccd(1) కింద, మిగిలిన 23,000/- ను 80ccd(1బి)కింద చూయించి పన్ను మినహాయింపు పొందవచ్చు.
3. ప్రశ్న:
ఈ సంవత్సరం రెండు DA లు కలపటం వల్ల నా ఆదాయం 5 లక్షలు దాటింది. 20% పన్ను పరిధిలోకి వెళ్ళాను. ఆ రెండు DA లు గత సంవత్సరం ఆదాయంలో చూయించుకోవచ్చా?*
జవాబు:
చూపించుకోవచ్చు. గత సంవత్సరంనకు చెందిన బకాయిలను ఆయా సంవత్సరాలలో చూపి పన్ను మినహాయింపు పొందవచ్చు. అందుకోసం ఫారం 10-E సమర్పించాలి.
4. ప్రశ్న:
నేను ఎయిడెడ్ స్కూల్ లో స్కూల్ అసిస్టెంట్ గా ఉన్నాను. నేను HM అకౌంట్ టెస్ట్ పాస్ కాలేదు. నేను 6,12,18 ఇయర్స్ స్కేల్స్ పొందాను. నాకు 24 ఇయర్స్ స్కేల్ కి అర్హత ఉన్నదా?
జవాబు:
ఉన్నది. నేరుగా స్కూల్ అసిస్టెంట్ గా నియమించబడినందున మీరు 24 ఇయర్స్ స్కేల్ పొందాలంటే రెండవ ప్రమోషన్ పోస్ట్ లేనందువలన మీకు అర్హతలతో సంబంధం లేకుండా 24 ఇయర్స్ పూర్తి కాగానే స్కేల్ మంజూరు చేయబడుతుంది.
5. ప్రశ్న:
నేను LFL HM గా పనిచేయుచున్నాను. 6 ఇయర్స్ స్కేల్ తీసుకున్నాను. 12 ఇయర్స్ స్కేల్ పొందటానికి ఏ ఏ అర్హతలు కావాలి. నాకు ప్రస్తుతం 50 ఇయర్స్ నిండినవి.
జవాబు:
మీరు 12 ఇయర్స్ స్కేల్ తీసుకోవాలి అంటే డిగ్రీ, బి.ఎడ్ లతో పాటు డిపార్ట్మెంట్ టెస్టులు పాస్ అయి ఉండాలి. మెమో.34408 తేదీ:4.2.12 ప్రకారం 50 ఇయర్స్ మినహాయింపు వర్తించదు.
error: Don\'t Copy!!!!