apteachers-employees-doubts-clarification-service-matter

సందేహాలు - సమాధానాలు
*596. ❓ప్రశ్న:*
GIS పెంచినపుడు SR లో నమోదు చేయించుకోవాలా?
*✅జవాబు:*
ఏ ఏ పీరియడ్ లో ఎంత మినహాయింపు జరిగిందో తెలియాలి అంటే SR మాత్రమే కీలకం. కాబట్టి SR లో నమోదు చేయించుకోవాలి.
•••••••••
*597. ❓ప్రశ్న:*
ఒక మహిళా టీచర్ ప్రసూతి సెలవులో ఉన్నారు. పెరిగిన DA ఆమెకు ఎప్పటినుంచి ఇవ్వాలి??
*✅జవాబు:*
మెమో.853 ; ఆర్ధిక ; తేదీ:22.1.13 ప్రకారం ప్రసూతి సెలవు సహా ఏ సెలవు కైనా సెలవుకి ముందు రోజు వేతనం మాత్రమే చెల్లించబడుతుంది.
•••••••••
*598. ❓ప్రశ్న:*
ఒక టీచర్ అనారోగ్యంతో 6 నెలల పాటు హాఫ్ పే లీవ్ పెట్టాడు.ఆ కాలానికి ELs ఎలా ఇవ్వాలి.
*✅జవాబు:*
Aplr 1933 లోని రూల్ 4 ప్రకారం ELs ను డ్యూటీ పీరియడ్ పై మాత్రమే లెక్కించాలి.ఏ విధమైన ఆకస్మికేతర సెలవు కూడా డ్యూటీ గా పరిగణించబడదు.కనుక 3 ELs జమ చేయకూడదు.
•••••••••
*599. ❓ప్రశ్న:*
ఎవరెవరిని బదిలీల కి spouse కేటగిరీ గా పరిగణిస్తారు.
*✅జవాబు:*
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, స్థానిక సంస్థలు,గ్రాంట్ ఇన్ ఎయిడ్,ప్రభుత్వ రంగ సంస్థ ల ఉద్యోగుల ను మాత్రమే spouse కేటగిరీ గా పరిగణిస్తున్నారు.
•••••••••
*600. ❓ప్రశ్న:*
ఫిబ్రవరి 29న విధులలో చేరిన టీచర్ కి 6 ఇయర్స్ స్కేల్ ఏ తేదీ నుంచి ఇవ్వాలి?
*✅జవాబు:*
మార్చి1 నుండి ఇవ్వాలి.AAS నిబంధనలు ప్రకారం 6 ఇయర్స్ సర్వీసు పూర్తి ఐన మరుసటిరోజు నుంచి స్పెషల్ గ్రేడ్ స్కేల్ మంజూరు చేయాలి.

*సందేహాలు - సమాధానాలు - 107 (581-585)*
*581. ❓ప్రశ్న:*
మెడికల్ సెలవుకోసం డాక్టరు సర్టిఫికెట్ మరియు ఫిట్ నెస్ సర్టిఫికెట్ వేరేవేరే డాక్టర్ల నుండి సమర్పించవచ్చునా? వైద్య కారణాలపై తీసుకున్న EOL ఇంక్రిమెంట్ కోసం లెక్కించబడుతుందా?
*✅జవాబు:*
రెండు సర్టిఫికెట్లు ఒకే డాక్టర్ ఇవ్వాలని ఏ ఉత్తర్వులోనూ లేదు.ఇద్దరూ క్వాలిఫైడ్ వైద్యులైనంత వరకు ఎట్టి అభ్యంతరము ఉండదు. సాధారణంగా EOL వాడుకుంటే ఇంక్రిమెంట్ అన్ని రోజులు వాయిదా పడుతుంది. అయితే ప్రభుత్వం G.O.Ms.No.43 తేది:5-2-1976 ద్వారా వైద్య కారణాలపై 6 నెలల కాలం వరకు EOL ను ఇంక్రిమెంటుకు పరిగణించే అధికారం శాఖాధిపతులకు (ఉపాధ్యాయుల విషయంలో పాఠశాల విద్యా సంచాలకులకు) ఇవ్వడం జరిగింది.
•••••••••
*582. ❓ప్రశ్న:*
ఉద్యోగి కాని భార్య కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటే ఉద్యోగి అయిన భర్తకు సెలవులు ఏమైనా లభిస్తాయా?
*✅జవాబు:*
అవును G.O.Ms.No.802 M&H Dated:21-4-1972 ప్రకారం 7 రోజుల ప్రత్యేక ఆకస్మిక సెలవులు లభిస్తాయి.
•••••••••
*583. ❓ప్రశ్న:*
ఒక ఉపాధ్యాయుడు SA క్యాడర్ లో 12 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసాడు. అయితే Departmental Test E.O.T/G.O T పరీక్షలు పాస్ కాలేదు.తదుపరి పాస్ అయితే 12 సంవత్సరాల స్కేల్ ఎప్పటినుండి ఇస్తారు??
*✅జవాబు:*
F.R-26(a) క్రింద గల రూలింగ్ 2 ప్రకారం చివరి పరీక్ష మరుసటి తేది నుండి 12 సంవత్సరాల స్కేలు మరియు ఆర్ధిక లాభం ఇవ్వాలి.
•••••••••
*584. ❓ప్రశ్న:*
పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే డిపార్టుమెంటల్ పరీక్షలలో Spl.Language Tests Telugu,Hindi,Urdu ఎవరు రాయాలి?
*✅జవాబు:*
ఇంటర్మీడియేట్ ఆ పై స్థాయిలో తెలుగు ఒక భాషగా చదవనివారు Spl.language Test in Telugu(P.code-37) రాయాల్సి ఉంటుంది.
10వ తరగతి ఆ పై స్థాయిలో హింది/ఉర్దూ ఒక భాషగా చదవని వారు Spl.language Test in Hindi/Urdu రాయాల్సి ఉంటుంది.
•••••••••
*585. ❓ప్రశ్న:*
సరెండర్ లీవ్ ను నెలలో ఎన్ని రోజులకు లెక్కగడతారు? 11 రోజుల సంపాదిత సెలవులున్నను లీవ్ సరెండర్ చేసుకోవచ్చునా?
*✅జవాబు:*
G.O.Ms.No.306 Fin Dept Dt:8-11-1974ప్రకారం సదరు నెలలో 28/29/30/31 ఎన్ని రోజులున్నను,రోజులతో నిమిత్తం లేకుండా 30 రోజులకు మాత్రమే లీవ్ సరెండర్ లెక్కగట్టి నగదు చెల్లిస్తారు.
G.O.Ms.No.334 F&P,Dt:28-9-1977 లో ఇలా వుంది Leave may be surrendered at any time not exceeding 15/30 days...అని వున్నది. అందుచేత 11రోజులు సరెండర్ చేసుకుని నగదు పొందవచ్చు.

error: Don\'t Copy!!!!