apteachers-employees-doubts-answers-with-G.O’s-1

1) స్థానికతను ఎలా నిర్ణయిస్తారు..?*

జి.ఓ.నెం:674,తేదీ: 20-10-1975,జి.ఓ నెం:168, తేదీ:10-03-1977 ప్రకారం ఒక వ్యక్తి 4వ తరగతి నుండి 10 వరకు గల 7 సంవత్సరాల కాలంలో ఏ జిల్లాలో ఎక్కువ చదివితే అది అతని స్థానిక జిల్లాగా గుర్తించాలి.

2) EOL పెట్టిన కారణంగా ఇంక్రిమెంట్ నెల మారితే తిరిగి పాత ఇంక్రిమెంట్ నెల ఎలా పొందవచ్చు..?*

జి.ఓ.నెం:43, తేదీ: 05-02-1976 ప్రకారం వైద్య కారణాలతో EOL లో ఉన్నప్పటికీ సంబందిత వైద్య ద్రువపత్రాలతో డీఈఓ గారి ద్వారా CSE కి ప్రపోసల్స్ పంపి అనుమతి పొందితే పాత ఇంక్రిమెంట్ నెల కొనసాగుతుంది. 180 రోజులకు మించిన EOL అయితే విద్యాశాఖ కార్యదర్శి నుండి అనుమతి పొందాలి.

3) EL’s ను ఉద్యోగి ఖాతాలో ఎలా జమ చేస్తారు..?*

01-01-1978 ముందు వరకు డ్యూటీ పీరియడ్ అయిన  తరువాతే EL’s జమ చేసేవారు. జి.ఓ.నెం:384,తేదీ: 05-11-1977 నుండి జనవరి 1న ఒకసారి, జులై 1న ఒకసారి అడ్వాన్స్ గా EL’S క్రెడిట్ చేస్తున్నారు. నాన్ వెకేషన్ డిపార్ట్మెంట్ వారికి జనవరి 1న 15, జులై 1న మరో 15 EL’S సర్వీస్ ఖాతాలో జమ చేయగా, వెకేషన్ డిపార్ట్మెంట్ వారికి జనవరి 1న 3, జులై 1న మరో 3 EL’S సర్వీస్ ఖాతాలో జమ చేస్తారు.

4) లీవ్ నాట్ డ్యూ అంటే ఏమిటి..?*

ఒక ఉద్యోగి లీవ్స్ ఖాతాలో హాఫ్ పే లీవ్స్ గానీ EL’S గానీ లేనపుడు ఉద్యోగికి కల్పించబడిన సౌకర్యమే లీవ్ నాట్ డ్యూ. ఒక ఉద్యోగికి అత్యవసరంగా లీవ్స్ అవసరం అయ్యి ఖాతాలో హాఫ్ పే లీవ్స్ గానీ EL’S గానీ లేనపుడు భవిష్యత్తులో ఉద్యోగికి వచ్చే హాఫ్ పే లీవ్స్ ను లెక్కించి 180 రోజుల వరకు వైద్య కారణాల నిమిత్తం లీవ్ నాట్ డ్యూ మంజూరు చేస్తారు. లీవ్ నాట్ డ్యూ గా మంజూరు చేసిన సెలవుల ను హాఫ్ పే లీవ్స్ ఉద్యోగి ఖాతాలో జమ కాగానే తగ్గిస్తారు.

5) ఆగష్టు-15,జనవరి-26న జెండా వందనానికి హాజరు కాకపోతే చర్యలు ఉంటాయా?

ఆగష్టు-15, జనవరి-26 తేదీలు జాతీయ సెలవు దినాలు కావున రిజిస్టర్ లో సంతకం అవసరం లేదు. అనారోగ్యం ఉంటే జెండా వందనానికి హాజరు కాకుండా ఉండవచ్చు. అయితే సివిల్ సర్వీస్ కోడ్ ప్రకారం తగిన కారణాలు లేకుండా జెండా వందనానికి హాజరు కాకపోతే పై అధికారులు చర్యలు తీసుకోవచ్చు.

6) CPS ఉద్యోగులు basic pay + DA లో 10%కు అదనంగా మినహాయించవచ్చా..?*

ఉద్యోగి బేసిక్ పే + డి.ఏ లో 10% ను మాత్రమే సిపియస్ డిడక్షన్ చేయాలి. దీనికి సమానంగా ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ జమ చేస్తుంది. వాలంటరీ గా కంట్రిబ్యూట్ చేసి టైర్-1 అకౌంట్లో అమౌంట్కు జత చేయవచ్చు. టాక్స్ మినహాయింపు పొందవచ్చు. వాలంటరీ కాంట్రిబ్యూషన్  కు మ్యాచింగ్ గ్రాంటు జత చేయబడదు.

7) మెటర్నిటీ లీవ్స్ వేసవి సెలవులలో  పెడితే కౌంట్ అవుతాయా..?*

FR 101(a) ప్రకారం మెటర్నిటీ లీవ్ కు ముందు గానీ తరువాత గానీ వేసవి సెలవులు ఉంటే మొత్తం 180 రోజులను మెటర్నిటీ లీవ్ గానే భావించాలి.

8) రిటైర్మెంట్ తరువాత  ఇంక్రిమెంట్ ఉంటే లెక్కిస్తారా..?*

 జి.ఓ.నెం:235,తేదీ:27-10-1998 ప్రకారం రిటైర్మెంట్ అయ్యిన మరుసటి రోజు ఇంక్రిమెంట్ ఉన్నట్లయితే ఆ ఇంక్రి మెంట్ ను నోషనల్ గా సాంక్షన్ చేసి దానిని ఇంక్రిమెంట్ బెనిఫిట్స్ లెక్కింపులో పరిగణలోనికి తీసుకోవాలి.

9) 5 సంవత్సరాల 8 నెలలు పూర్తి చేసిన ఉద్యోగికి ఎన్ని అర్ధ వేతన సెలవులు వస్తాయి..?*

సమాధానం డ్యూటీ పీరియడ్ ఒక సంవత్సరం పూర్తి అయిన తరువాతనే అర్ధవేతన సెలవులు ఉద్యోగి ఖాతాకు జమ చేయబడతాయి. సంవత్సరానికి 20 చొప్పున 5 సంవత్సరాలకు 100 అర్ధవేతన సెలవులు అర్ధవేతన సెలవుల ఖాతాకు జమ చేస్తారు.

10) ప్రభుత్వ సెలవు  దినాలకు ముందు తరువాత కమ్యూటేడ్ లీవ్స్ పెట్టవచ్చా?

జి.ఓ.నెం:319,తేదీ:18-12-1981 ప్రకారం వైద్య కారణాలపై వినియోగించుకున్న సెలవుకు ముందు గానీ తరువాత ఉన్న ప్రభుత్వ సెలవులను మినహాయించవచ్చు. కాబట్టి ప్రభుత్వ సెలవును కమ్యూ టెడ్ సెలవుగా పరిగణించకూడదు.

అయితే ఎన్ని రోజులు కమ్యూటెడ్ – లీవ్స్ పెట్టుకుంటే అన్ని పనిదినాలకు మాత్రమే వైద్య ధ్రువ పత్రాలు సమర్పించాలి.

error: Don\'t Copy!!!!