apsrtc-buses-introduce-digital-payment-option-details

APSRTC కీలక నిర్ణయం.. ఇకపై బస్సుల్లో డిజిటల్ చెల్లింపులు, అమలుకు డేట్ ఫిక్స్!

ఏపీఎస్ ఆర్టీసీ (APSRTC) డిజిటల్ చెల్లింపులుకు సంబంధించి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. బస్సుల్లో కూడా నగదు రహిత డిజిటల్‌ చెల్లింపులకు రంగం సిద్ధమైంది. ఈ నెల 15 నుంచి ఈ-పోస్ మిషన్లు అందుబాటులోకి రాబోతున్నాయి..

ప్రస్తుతం ఉన్న టికెట్ ఇష్యూయింగ్ మెషీన్ (టిమ్) స్థానంలో వీటిని తీసుకురావాలని ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ముందుగా విజయవాడ, గుంటూరు-2 డిపోలను పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకున్నారు.. అక్కడ ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు.

ఆర్టీసీ తీసుకొస్తున్న ఈ-పోస్ మిషన్ల ద్వారా ప్రయాణికులు డబ్బులు చెల్లించనవసరం లేకుండా డెబిట్‌/క్రెడిట్‌ కార్డులు, ఫోన్‌పే, గూగుల్‌ పే, పేటీఎం వంటి వాటితో టికెట్లు పొందే అవకాశం ఉంటుంది. అలాగే బస్సుల్లో చిల్లర సమస్య కూడా ఉండదని అధికారులు భావిస్తున్నారు.

పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకున్న విజయవాడ, గుంటూరు-2 డిపోల నుంచి తిరుపతి, విశాఖపట్నం, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వెళ్లే బస్సుల్లో ఈ-పోస్ మెసిన్లు ప్రవేశపెట్టబోతున్నారు

అలాగే డ్రైవర్లు, కండక్టర్లకు ఈ–పోస్‌ యంత్రాల వినియోగంపై శిక్షణ అందిస్తున్నారు. మూడు వారాలుగా ఒక్కో డిపో నుంచి పది మంది చొప్పున డ్రైవర్లు, కండక్టర్లు ఈ శిక్షణ పొందుతున్నారు. ఈ ట్రైనింగ్ పూర్తికాగానే ఈ–పోస్‌ యంత్రాలు ప్రవేశపెడతారు.

దశలవారీగా ఈ-పోస్ యంత్రాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. అంతేకాదు అన్ని డిపోలు, బస్టాండ్లలో టిక్కెట్లు ఇచ్చే గ్రౌండ్‌ బుకింగ్‌ స్టాఫ్‌కు కూడా ఈ–పోస్‌ యంత్రాలు అందజేస్తారు.

డిజిటిల్ చెల్లింపులతో పాటూ డబ్బులు కూడా చెల్లించొచ్చు. అంతేకాదు మొబైల్ యాప్ ద్వారా కూడా టికెట్ కొనుగోలు చేసుకునే సౌకర్యం కూడా ఉంది.

దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో సీట్ల ఖాళీలను బట్టి ‘స్టేజ్ టు టికెట్’ ఇష్యూ అవకాశం ఉంది. అాగే బస్సు రూట్‌ ట్రాకింగ్‌ను యాప్‌లో చూడొచ్చు.

error: Don\'t Copy!!!!