ap-ssc-inter-public-exams-results-july-2nd-week-or-3rd-week-clarification

Andhra Pradesh: విద్యార్థులకు క్లాసుల ప్రారంభంపై ఏపీ మంత్రి కీలక వ్యాఖ్యలు.. ఆ నెలలోనే..

ఆగస్టులో సెట్ ఎగ్జామ్స్ యథాతథంగా జరుగుతాయని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు

ఆగస్టు రెండో వారం కల్లా విద్యా సంవత్సరం ప్రారంభిస్తామని ఆయన తెలిపారు

క్లాసులు నిర్వహించకపోవడంతో 70 శాతం ఫీజులే తీసుకోవాలని ఆయన ప్రైవేటు విద్యాసంస్థలకు సూచించారు.

రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిటీ ఫీజులు నిర్ణయిస్తుందని మంత్రి తెలిపారు

టెన్త్, ఇంటర్ పరీక్షల రద్దుతో హైపవర్ కమిటీ వేశామన్న ఏపీ మంత్రి.. మూడు, నాలుగు రోజుల్లో ప్రభుత్వానికి కమిటీ నివేదిక ఇస్తుందని తెలిపారు

Andhra Pradesh: టెన్త్, ఇంటర్ పరీక్షల రద్దుతో హైపవర్ కమిటీ వేశామన్న ఏపీ మంత్రి.. మూడు, నాలుగు రోజుల్లో ప్రభుత్వానికి కమిటీ నివేదిక ఇస్తుందని తెలిపారు.

6TH CLASS TO 10TH CLASS ALL SUBJECTS WORK SHEETS CLICK HERE

AP Inter, SSC Marks: ఏపీలో ఇంటర్, టెన్త్ మార్కుల కేటాయింపు ఎలా? ఫలితాల ప్రకటన ఎప్పుడంటే?

ఆంధ్రప్రదేశ్ లో పది, ఇంటర్ పరీక్షల రద్దుతో విద్యార్థులకు మార్కులు ఎలా కేటాయిస్తారు..? ఎప్పుడు ఫలితాలు ప్రకటిస్తారు..? ఇంటర్, డిగ్రీ అడ్మిషన్ అప్పుడు ఏఏ అంశాలను పరిగణలోకి తీసుకోవాలి..? వీటన్నటిపై క్లారిటీ ఇచ్చే దిశగా కసరత్తు మొదలైంది..

ఆంధ్రప్రదేశ్ లో కరోనా పంజా కారణంగా ఇంటర్, పదో తరగతి పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. అందర్నీ పాస్ చేస్తున్నట్టు ప్రకటించింది. అయితే మరి విద్యార్థులకు మార్కులు ఎలా కేటాయిస్తారు.. పదో తరగతి విద్యార్థులకు ఏ ప్రతిపాదకను మార్కులు ఇస్తారు.. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకెండ్ ఇయర్ విద్యార్థుల పరిస్థితి ఏంటి..?

ఇప్పటికే ఫలితాలు ప్రకటించడంపై అనుసరించాల్సిన విధివిధానాలను రూపొందించడానికి విశ్రాంత ఐఏఎస్‌ అధికారిణి ఎం.ఛాయారతన్‌ చైర్‌పర్సన్‌గా ప్రభుత్వం హైపవర్‌ కమిటీని ఏర్పాటు చేసింది. గురువారమే ఉత్తర్వులు కూడా ఇచ్చింది ప్రభుత్వం. ఈ కమిటీకి ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌ ఎ.సుబ్బారెడ్డి కేన్వీనర్‌గా వ్యవహరిస్తారు. రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి డైరెక్టర్‌ బి.ప్రతాప్‌రెడ్డి, ప్రకాశం జిల్లా డీఈవో సుబ్బారావు సభ్యులుగా ఉంటారు. వీరితోపాటు కమిటీలో మరో ఆరుగురు నిపుణులను నియమించారు.

ఈ కమిటీ సభ్యుల సూచనల మేరకే విద్యార్థులకు మార్కులు కేటాయిస్తారు. ఈ కమిటీ పది పరీక్ష ఫలితాలకు సంబంధించి ఏయే మార్కులను పరిగణనలోకి తీసుకోవాలో ప్రభుత్వానికి సూచనలు చేస్తుంది.

అలాగే ఇంటర్మీడియెట్‌ పరీక్ష ఫలితాలకు అనుసరించాల్సిన విధివిధానాలు నిర్ణయించడానికి ఛాయారతన్‌ నేతృత్వంలోనే మరో హైపవర్‌ కమిటీని కూడా విద్యాశాఖ నియమించింది. ఈ కమిటీ సూచనల మేరకు ఇంటర్‌ ఫలితాలను ప్రకటిస్తామని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ తెలిపారు.

మొదటి నుంచి టెన్త్‌, ఇంటర్మీడియేట్‌ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం పట్టుదలగానే కనిపించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ పరిక్షలు నిర్వహించి తీరుతామని ప్రకటించింది. కానీ సుప్రీం కోర్టు సూచనల నేపథ్యంలో పరీక్షలు రద్దు చేయక తప్పలేదు..

తప్పని సరి పరిస్థితుల్లో పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలను రద్దు చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు ఫలితాలను వెల్లడించేందుకు కమిటీలను నియమించింది. ఈ నెల రెండు లేదా మూడో వారంలో టెన్త్‌, ఇంటర్‌ ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది.

ఫలితాల విడుదలకు గాను విద్యార్థులకు మార్కులు ఎలా కేటాయించాలన్న అంశంపై ప్రభుత్వం విశ్రాంత ఐఏఎస్ అధికారి ఛాయరతన్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటి ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. మరో రెండు, మూడు రోజుల్లో తమ నివేదికను ప్రభుత్వానికి అందించాలని భావిస్తోంది. ఆ కమిటీ సూచనలు ఆధారంగా త్వరగానే ఫలితాలు ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తోంది.

ముఖ్యంగా ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు మార్కుల కేటాయింపుపై మాత్రం తర్జన భర్జన పడుతోంది. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ పూర్తి చేసిన విద్యార్థులు గతేడాది టెన్త్ పరీక్షలు కూడా రాయలేదు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆ సమయంలో పరీక్షలు రద్దు చేసిన ప్రభుత్వం పరీక్షలు లేకుండానే వారిని పై తరగతులకు ప్రమోట్ చేసింది.

అందరికీ అర్హత మార్కులను ఇచ్చి పాస్ చేయడమా.. లేక కరోనా తగ్గిన తర్వాత పరీక్షలను నిర్వహించి మార్కులు కేటాయించాలన్న అన్న అంశంపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. అయితే తెలంగాణలో లాగా ప్రస్తుతానికి ఫలితాలను విడుదల చేయకుండానే విద్యార్థులందరినీ ప్రమోట్ చేసే అవకాశం ఉంది. అతి త్వరలో ఈ అంశాలపై అధికారికంగా స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

సెకండ్ ఇయర్ విద్యార్థులకు మాత్రం.. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో వచ్చిన మార్కులనే పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. అంటే మొదటి సంవత్సరంలో ఎన్ని మార్కులు వచ్చాయో చూసి.. ఇప్పటి వరకు వచ్చిన ల్యాబ్ మార్కులు.. ఇతర పరీక్షల ఆధారంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

పది, ఇంటర్ పరీక్షలకు తోడు.. తరువాత క్లాస్ లకు అడ్మిషన్లు ఎలా అన్నదానిపైనా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇంటర్ ప్రవేశాలు, అలాగే డిగ్రీ ప్రవేశాలకు ఏఏ అంశాలను పరిగణలోకి తీసుకోవాలి అన్నదానిపైనా కమిటీ సూచనలు చేసే అవకాశం ఉంది.

1st CLASS to 10th CLASS ALL SUBJECTS TEXT BOOKS & WORK BOOKS

error: Don\'t Copy!!!!