ap-schools-working-days-holidays-list-exams-dates

188 పనిదినాలతో విద్యాసంవత్సరం, 70 సెలవులు

అకడమిక్ క్యాలెండర్ విడుదల చేసిన ఎసీసీఈఆర్టీ*

 రాష్ట్రంలో పాఠశాలల పనిదినాలు, సెలవులపై స్టేట్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రిసెర్చ్ ట్రైనింగ్(ఎస్సీఈఆర్టీ) స్పష్టతనిచ్చింది. 

కరోనా సెకండ్ వేవ్ కారణంగా రాష్ట్రంలో విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. సాధారణంగా జూన్ లో ప్రారంభం కావాల్సిన విద్యా సంవత్సరం గతేడాది కరోనా ఫస్ట్్వవ్ కారణంగా నవంబర్ 12 నుంచి, ఈ ఏడాది సెకండ్ వేవ్ వల్ల ఆగస్టు 16 నుంచి ప్రారంభమైంది.

ఈ నేపథ్యంలో విద్యార్థులపై భారం పడకుండా సిలబస్ను కూడా కొంత మేర తగ్గిస్తూ పాఠశాల విద్యాశాఖ ఇటీవల ఉత్తర్వులు కూడా విడుదల చేసింది. అదే విధంగా తాజాగా ఎస్సీఈఆర్టీ 188 పని దినాలతో అకడమిక్ క్యాలెండర్ను విడుదల చేసింది.

 ఈ క్యాలెండర్ ప్రకారం ఆగస్టు నెలలో 12 రోజుల పనిదినాలు ఇప్పటికే పూర్తి కాగా.. సెప్టెంబర్ లోని 24 పనిదినాల్లో సగానికిపైగా గడిచాయి. ఇక అక్టోబర్ 17, నవంబర్ 24, డిసెంబర్ 19 నుంచి 25 రోజులు, జనవరిలో 18 నుంచి 24 రోజులు, ఫిబ్రవరిలో 23, మార్చిలో 24, ఏప్రిల్లో 21 రోజులతో మొత్తం 188 పనిదినాల క్యాలెండర్ విడుదలైంది. 

అలాగే ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 70 సెలవు దినాలు ఉండనున్నట్లు పేర్కొంది.

ఎఫ్ఎ, ఎస్ఏ పరీక్షలకూ షెడ్యూల్

పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు నిర్వహించే ఫార్మేటివ్ అసెస్మెంట్, సమ్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలపైనా ఎస్సీఈఆర్టీ స్పష్టతనిచ్చింది. దీనిలో ఈ నెల మొదటి వారంలో బేస్లైన్ పరీక్ష పూర్తి కాగా.. నెలాఖరులోగా నిర్మాణాత్మక మూల్యాంకనం- 1, నవంబర్ 25లోగా నిర్మాణాత్మక మూల్యాంకనం- 2 జరగాల్సి ఉన్నాయి. 

అలాగే డిసెంబర్ 9 నుంచి 22వ తేదీ వరకు సంగ్రహణాత్మక మూల్యాంకనం- 1 నిర్వహించాలి.

ఫిబ్రవరి 26లోపు నిర్మాణాత్మక మూల్యాంకనం- 3,

మార్చి 31వ తేదీలోపు 1 నుంచి 9వ తరగతికి నిర్మాణాత్మక మూల్యాంకనం- 4,

పదో తరగతికి మార్చి 15లోపు నిర్వహించాలి.

ఏప్రిల్ 18 నుంచి 29లోపు 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు సంగ్రహణాత్మక మూల్యాంకనం- 2 పూర్తి చేయాల్సి ఉంటుంది.

పదో తరగతి ప్రీ ఫైనల్, ఫైనల్ పరీక్షలు ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్స్ ప్రకారం జరుగుతాయి.

LIST OF HOLIDAYS IN AP SCHOOLS CLICK HERE

error: Don\'t Copy!!!!