ap-scert-B.Ed-D.Ed-text-books-for-TET-exams-all-classs-text-books

‘టెట్ , షెడ్యూల్, నోటిఫికేషన్ జారీ.

పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు సిలబస్ ఖరారు చేసిన ఎస్సీఈఆర్టీ.

టెట్ సర్టిఫికెట్కు జీవితకాల చెల్లుబాటు, డీఎస్సీలో 20% వెయిటేజీ*

డీఎడ్ అభ్యర్థులతో పాటు గతంలో రాసినవారూ సన్నద్ధం*

 ప్రభుత్వ టీచర్ పోస్టుల భర్తీకి కీలకమైన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (బెట్ 2024) ఈ ఏడాది ఆగస్టులో నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ సన్నాహాలు .

పేపర్లవారీగా పరీక్షల తేదీలు, ఇతర సమా చారంతో  నోటిఫికేషన్ విడుదల. టెట్ రాసేందుకు అభ్యర్ధులు చాలా రోజు తెలుగా ఎదురు చూస్తున్నారు.

జాతీయ ఉపా ధ్యాయ విద్యామండలి (ఎన్ సీటీఈ) నిబంధనల ప్రకారం ఏటా రెండుసార్లు టెట్ నిర్వహించాలి.

డీఎస్సీలో 20 శాతం వెయిటేజీ*

దీర్ఘకాలంగా టెట్ నిర్వహించకపోవడంతో లక్షల సంఖ్యలో అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. టెట్ మార్కులకు ఉపాధ్యాయ నియామక పరీక్ష (డీఎస్సీ) లో వెయిటేజీ కల్పించడంతోపాటు బీఈడీ, ఎంఈడీ అభ్యర్ధులను ఎస్ఏ పోస్టులకు కూడా అర్హులుగా ప్రకటించడంతో గతంలో క్వాలిఫై అయిన వారు సైతం మరోసారి రాసేందుకు సిద్ధమవుతున్నారు. టెట్ మార్కులకు డీఎస్సీలో 20 శాతం మేర వెయిటేజీ ఉన్నందున వీటికి ప్రాధాన్యత ఏర్పడింది. బెట్ ఉత్తీర్ణత సర్టిఫికెట్ చెల్లుబాటు గతంలో ఏడేళ్లు మాత్రమే ఉండగా గతేడాది ఎన్ సీటీఈ దీన్ని సవరించి జీవితకాలం చెల్లుతుందని ప్రకటించింది.

 వెబ్సైట్లో ప్యాట్రన్, సిలబస్*

టెట్ 2024 విధివిధానాలు, సిలబస్ ను పాఠశాల విద్యాశాఖ గతంలో విడుదల చేసింది. సిలబస్ను https://aptet.apcfss.in వెబ్సైట్లో పొందుపరి చింది. బెట్లో రెండు పేపర్లు (పేపర్ 1, పేపర్ 2) ఉంటాయి. వీటిని 1 వ, 1 బీ, 2 ఏ, 2 బీ అని నిర్వహిస్తారు. అభ్యర్థుల అర్హతలకు సంబంధించి ఎన్సీటీఈ మార్పులు చేయడంతో ప్రభుత్వం ఆ మేరకు సవరణలు చేసింది. గతంలో టెట్కు సంబంధించి జారీ చేసిన జీవో 23కు సవరణలు చేస్తూ జీవో 27 విడుదల చేసింది. దీని ప్రకారం అభ్యర్థులకు మేలు చేకూరేలా టెట్ నోటిఫికేషన్లో పొందుపర్చనున్నారు.

*ఎవరెవరు ఏ పరీక్ష రాయాలంటే…*

■ రెగ్యులర్ స్కూళ్లలో 1 – 5 తరగతుల్లో టీచర్ పోస్టులకు పేపర్ 1ఏలో అర్హత సాధించాలి..

■  దివ్యాంగులు, ఇతర విభిన్న ప్రతిభావంతులు స్పెషల్ స్కూళ్లలో 1 5 తరగతులు బోధించాలంటే పేపర్ 1బీలో అర్హత తప్పనిసరి.

■ రెగ్యులర్ స్కూళ్లలో 6 – 8. ఆ పై తరగతులు బోధించాలంటే పేపర్ 2ఏలో అర్హత సాధించాలి. అలాగే స్పెషల్ స్కూళ్లలో ఇవే తరగతులకు పేపర్ 2 బీలో అర్హత సాధించాల్సి ఉంటుంది…

■ టెట్లో అర్హత మార్కులు గతంలో మాదిరిగానే ఉండనున్నాయి. జనరల్ అభ్యర్థులకు 60 శాతం, బీసీ అభ్యర్ధులకు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, మాజీ సైనికోద్యోగుల పిల్లలు 40 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది.

 

 ●టెట్‌ను 1ఎ, 1బీ, 2ఎ, 2బీ పేపర్లుగా నిర్వహిస్తారు.

1ఎ 1-5 రెగ్యులర్‌ ఎస్జీటీ ఉపాధ్యాయులకు ఉంటుంది.

1బీని ప్రత్యేక పాఠశాలల ఉపాధ్యాయులకు నిర్వహిస్తారు.

2ఎ స్కూల్‌ అసిస్టెంట్లకు, 2బీ పేపర్‌ 6-8 ప్రత్యేక పాఠశాలల ఉపాధ్యాయులకు ఉంటుంది.

●1ఎ, 1బీ పేపర్లలో 150 మార్కులకు 150 బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి.

పిల్లల అభివృద్ధి, పెడగాజీ, భాష-1, 2, గణితం, పర్యావరణంపై ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష సమయం 2 గంటలు.

●పేపర్‌- 2ఎలోనూ 150 మార్కులకు 150 ప్రశ్నలు ఉంటాయి. పిల్లల అభివృద్ధి, పెడగాజీ, భాష-1,2తోపాటు స్కూల్‌ అసిస్టెంట్‌ అభ్యర్థుల సబ్జెక్టు ఉంటుంది. సబ్జెక్టు నుంచి 60 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు.

● పేపర్‌- 2బీలో పిల్లల అభివృద్ధి, పెడగాజీ, భాష-1,2తోపాటు 60 మార్కులకు దివ్యాంగుల స్పెషలైజేషన్‌ విభాగం, పెడగాజీ ఉంటుంది.

●టెట్‌లో అర్హత సాధించాలంటే జనరల్‌ అభ్యర్థులు కనీసం 60%, బీసీలు 50%, ఎస్సీ, ఎస్టీలు,  దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులు 40% మార్కులు తెచ్చుకోవాలి.

Paper I Test Pattern

Topic Name Total Questions Total Marks
Child Development & Pedagogy 30 30
Language I 30 30
Language II (English) 30 30
Mathematics 30 30
Environmental Studies 30 30
Total 150 Questions 150 Marks

Paper-II Pattern

Subject Name Total Questions Total Marks
Child Development & Pedagogy 30 30
Language I 30 30
Language II (English) 30 30
Mathematics Science Teacher/ Social Studies Teacher 60 60
Total 150 Questions 150 Marks

APSCERT 1st CLASS TO 10th CLASS ALL SUBJECTS TEXT BOOKS PDF FILES 

10TH CLASS TEXT BOOKS

9TH CLASS TEXT BOOKS

8TH CLASS TEXT BOOKS

7TH CLASS TEXT BOOKS

6TH CLASS TEXT BOOKS

5TH CLASS TEXT BOOKS

4TH CLASS TEXT BOOKS

3RD CLASS TEXT BOOKS

2ND CLASS TEXT BOOKS

1ST CLASS TEXT BOOKS

error: Don\'t Copy!!!!