AP-RGUKT-IIIT-dmission-2023-notification-online-application
AP RGUKT IIIT admissions 2023: ఏపీ ట్రిపుల్ ఐటీల్లో 2023-24 ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల, ఎంపిక ఇలా!
ఆంధ్రప్రదేశ్ రాజీవ్‌గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) ఆధ్వర్యంలో 2023-24 విద్యాసంవత్సరానికి ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. ప్రవేశాలు కోరేవారు జూన్ 4 నుంచి జూన్ 26న సాయంత్రం 5 గంటల్లోపు వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు.
దరఖాస్తు ఫీజుగా జనరల్ అభ్యర్ధులు రూ.300, ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులు రూ.200లు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అకడమిక్ మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా విద్యార్ధులకు సీటు కేటాయింపు ఉంటుంది.
ఏపీ ఆర్జీయూకేటీ పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ఐఐఐటీ క్యాంపస్‌లలో ప్రవేశాలకు యేటా మూడు సార్లు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న తర్వాత కౌన్సెలింగ్‌కు పిలుస్తారు. అధికారిక వెబ్‌సైట్ నుంచి కాల్ లెటర్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఆయా తేదీల్లో కౌన్సెలింగ్‌కు హాజరుకావాల్సి ఉంటుంది.
సీట్లు పొందిన విద్యార్ధులకు రెండేళ్ల పీయూసీ, నాలుగేళ్ల బీటెక్ కోర్సుతో కలిపి మొత్తం ఆరేళ్ల కోర్సులో ప్రవేశాలు పొందుతారు. ప్రవేశాల్లో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు అదనంగా నాలుగు శాతం మార్కులు కేటాయిస్తారు.
జులై 13న ఎంపికైన విద్యార్థుల జాబితా విడుదల కానుంది. ఇక ఆగస్టు మొదటి వారంలో తరగతులు ప్రారంభంకానున్నాయి. 4 క్యాంపస్‌లలో కలిపి 4,400 సీట్లు భర్తీ చేయనున్నారు.
ఇందులో 85 శాతం సీట్లు ఏపీ అభ్యర్థులకు, 15 శాతం సీట్లు తెలంగాణ, ఏపీ విద్యార్థులకు ఓపెన్ మెరిట్ కింద కేటాయిస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో పదోతరగతి చదివిన విద్యార్థులకు 4 శాతం డిప్రివేషన్ స్కోర్‌ను జోడించి మెరిట్ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేయనున్నారు.
వివరాలు..
ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్
వ్యవధి: 6 సంవత్సరాలు (పీయూసీ రెండేళ్లు, బీటెక్ నాలుగేళ్లు)
అర్హత: ఈ ఏడాది నిర్వహించిన పదోతరగతి లేదా తత్సమాన పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు ఫీజు: దరఖాస్తు ఫీజుగా జనరల్ అభ్యర్ధులు రూ.300, ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులు రూ.200లు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు..
RGUKT IIIT ONLINE APPLICATION LINK
