ap-model-schools-Intermediate-admissions-application-form-guidelines
AP Model Schools – Guidelines and Procedure for admissions into Intermediate for the Academic Year 2022-23 – On merit basis secured in SSC Exams. – Orders Issued.
Government have ordered to enhance the seats from 80 to 100 (each group)) for Class VI to X and from 20 to 40 seats for each group for Intermediate Course from the academic year 2022-2023 in permanent basis, duly amending the G.O. 1st read above, subject to follow the rule of reservation/orders/guidelines issued by the Government of .A.P. /GoI from time to time duly implementing the reservation of 10% for EWS in admissions into A.P. Model Schools.
ఆదర్శ పాఠశాలల్లో సీట్ల పెంపు*
6-10 ఒక్కో తరగతిలో 100 మంది , ఇంటర్ ప్రతి గ్రూపులో 40* ఈడబ్ల్యూఎస్కు 10 శాతం రిజర్వేషన్
ఆదర్శ పాఠశాలల్లో విద్యార్థులకు సీట్ల సంఖ్యను పెంచుతూ రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది . మేరకు పాఠశాలల ప్రధానాచార్యులకు ఉత్తర్వులు అందాయి .
రాష్ట్రవ్యాప్తంగా ఆదర్శ విద్యాలయ వ్యవస్థ 2013 నుంచి అమల్లోకి వచ్చింది . అప్పటి నుంచి ఆదర్శ పాఠశాలల్లో 6 నుంచి 10 వ తరగతి వరకు , తరగతికి 80 మంది చొప్పున విద్యార్థులకు ప్రవేశం కల్పించారు .
తాజా ఉత్తర్వుల మేరకు తరగతికి మరో 20 మందిని అదనంగా చేర్చుకునేందుకు అవకాశం కలిగింది . ఇప్పటి వరకు ఒక్కో తరగతిని రెండు సెక్షన్లుగా చేసి , ఒక్కో సెక్షనుకు 40 మంది చొప్పున 80 సీట్లుండేవి . కొత్తగా వచ్చిన ఆదేశాల మేరకు 2022-23 విద్యా సంవత్సరం నుంచి 6 నుంచి 10 వ తరగతి వరకు ఒక్కో సెక్షన్కు 50 మంది చొప్పున రెండు సెక్షన్లకు కలిపి మొత్తం 100 సీట్లు ఉంటాయి . ఆ మేరకు అంత మంది విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తారు .
ఇప్పటి వరకు 6-10 తరగతుల్లో 400 మందికి ప్రవేశ అవకాశం ఉండగా ప్రస్తుతం మరో 100 మందికి ఆదర్శ పాఠశాలల్లో చదువుకునే అవకాశం దక్కనుంది .
INTERMEDIATE ADMISSIONS IN AP MODEL SCHOOLS NOTIFICATION
ఆదర్శ పాఠశాల ప్రవేశాల్లో ఎస్సీ , ఎస్టీ , బీసీ , మైనార్టీ రిజర్వేషన్లు అమలు చేస్తూనే బాలికలకు ప్రాధాన్యం కల్పించారు . ఇకమీదట ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు ప్రవేశాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పించారు . ప్రారంభంలో బడిలోనే లాటరీ విధానంలో ప్రవేశాలు జరిగేవి , రెండేళ్ల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించి జిల్లా కేంద్రంలో లాటరీ ద్వారా ప్రవేశాలు కల్పిస్తున్నారు . ఏటా ఆదర్శ పాఠశాలల్లో 6 వ తరగతి , ఇంటర్ మెదటి సంవత్సరానికి ప్రవేశాలు కల్పిస్తుండగా ఈ ఏడాది 7-10 వరకు ఏర్పడిన ఖాళీలతో పాటు పెంచిన 20 సీట్ల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ రావచ్చు
*నాలుగు గ్రూపుల్లో 20 సీట్లు అదనం*
ఆదర్శ పాఠశాలల్లో ఇప్పటి వరకు ఇంటర్లో ఒక్కో గ్రూప్ లో 20 సీట్లు మాత్రమే ఉండేవి తాజా ఉత్తర్వు మేరకు గ్రూపునకు అదనంగా 20 సీట్లు పెంచింది . దీంతో ఇకపై ఒక్కో గ్రూపునకు 40 సీట్లు ఉంటాయి . మేరకు విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తారు . ఆదర్శ పాఠశాలల్లో నాలుగు ( ఎంపీసీ , బైపీసీ , సీఈసీ , ఎంఈసీ ) గ్రూపులున్నాయి . ప్రస్తుత ఆదేశాల మేరకు ప్రథమ , ద్వితీయ ఇంటర్లో 160 మంది విద్యార్థులు చదువుకునే అవకాశం విద్యాశాఖ కల్పించింది.
APMS – INTERMEDIATE |
|
Notification & Schedule |
Click Here |
Presee Note |
Click Here |
Payment |
Click Here to Payment |
Application / Print Form |
Inter Candidate Login |
Forgot Candidate Details |
– |
Payment Start Date | Payment End Date |
05.06.2022 | 16.06.2022 |
Application Start Date | Application End Date |
05.06.2022 | 17.06.2022 |