ap-mlhp-recruitment-2022-notification-1681-jobs
ఏపీలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
1,681 ఎంఎల్‌హెచ్‌పీ పోస్టులకు నోటిఫికేషన్
ఆన్‌లైన్ పరీక్షలో మెరిట్ ఆధారంగా ఎంపికలు
ఈ నెల 9 నుంచి 22వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరణ
24 నుంచి 30వ తేదీ వరకు హాల్‌టికెట్లు జారీ
సెప్టెంబర్ మొదటి వారంలో పరీక్ష
హాల్ టిక్కెట్లలో పరీక్ష తేదీ
వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్‌లలో సేవలు అందించడానికి 1,681 మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ (ఎంఎల్‌హెచ్‌పీ) పోస్టుల భర్తీకి వైద్య శాఖ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయిన నాటి నుంచి రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా వైద్య శాఖలో విప్లవాత్మక మార్పులు చేపడుతున్నారు.
ఇందులో భాగంగా గ్రామాల్లోనే ప్రజలకు వైద్య సేవలు చేరువ చేయడానికి 10,032 వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్‌లు ఏర్పాటు చేస్తున్నారు. వీటిల్లో సేవలందించడానికి భారీగా ఎంఎల్‌హెచ్‌పీలను నియమిస్తున్నారు.
