ap-inter-1st-year-academic-calander-2021-22-details

ap-inter-1st-year-academic-calander-2021-22-details

ఏపీ ఇంటర్మీడియట్‌ 2021–22 విద్యా క్యాలెండర్‌ విడుదల

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఇంటర్‌ విద్యకు సంబంధించి 2021–22 విద్యాసంవత్సరానికి ఇంటర్‌ బోర్డు క్యాలెండర్‌ విడుదల చేసింది.

ఈ విద్యాసంవత్సరంలో 188 పనిదినాలున్నాయి. కోవిడ్‌ కారణంగా అడ్మిషన్లు, తరగతుల నిర్వహణ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఫస్టియర్‌ విద్యార్థులకు తరగతులు, పరీక్షల నిర్వహణ వంటి ప్రక్రియలపై ఈ క్యాలెండర్‌ రూపొందించింది. సెకండియర్‌ విద్యార్థులకు జూలై 1వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభించిన బోర్డు ఈనెల 16 నుంచి ప్రత్యక్ష తరగతులు కూడా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఫస్టియర్‌ విద్యాసంవత్సరానికి సంబంధించిన ప్రవేశాలను ఈ ఏడాది ఆన్‌లైన్లో నిర్వహించనున్నారు.

ఇందుకు సంబంధించి నోటిఫికేషన్‌ జారీచేసిన బోర్డు ఆన్‌లైన్‌ దరఖాస్తు తేదీని ఈనెల 27వ తేదీ వరకు పొడిగించింది. అడ్మిషన్లు పూర్తయిన అనంతరం సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి ఫస్టియర్‌ విద్యార్థులకు తరగతులను ప్రారంభించనుంది.

2021–22 విద్యాసంవత్సరంలో నెలవారీ సెలవులు, పనిదినాల వివరాలు

All the Principals of Junior Colleges and Composite Colleges offering Intermediate Course in the State are hereby informed that the 1t year Tentative Annual Academic Programme (Calendar) for the academic year 2021-2022 in respect of Junior and Composite Degree Colleges in the State offering two years Intermediate course in general and vocational courses is as follows:

నెల

మొత్తం రోజులు

సెలవులు

పనిదినాలు

సెప్టెంబర్‌

30

05

25

అక్టోబర్‌

31

08

23

నవంబర్‌

30

05

25

డిసెంబర్‌

31

05

26

2022 జనవరి

31

09

22

ఫిబ్రవరి

28

04

24

మార్చి

31

06

25

ఏప్రిల్‌

23

05

18

మొత్తం

235

47

188

All the Principals/Managements are requested to follow the instructions given hereunder:
1. All the Managements of Private Un-Aided Junior Colleges are informed that according to Annual Calendar of 2021-2022, the Junior Colleges are deemed to be closed for summer vacation from 24-04-2022 (Sunday) to 31-05-2022 (Tuesday).
2. In addition to the vacation, all Sundays & public holidays declared by the Government of Andhra Pradesh shall be observed as holidays.
3. Admissions shall be made only in accordance with the admission schedule announced by Andhra Pradesh State Board of Intermediate Education.
4. No college shall indulge in undue canvassing to force/ convince / attract students which results in unhealthy competition among colleges.
5. No advertisement should be carried out through hoardings, pamphlets, wall writings, electronic media or print media etc., that will result in unhealthy competitions among the colleges.
6. All the principals of un-aided Junior Colleges are instructed not to offer or promise any guarantee of performance or success at a public examination in advance as an inducement for admission as it amounting to violation of Rule 7 of Andhra Pradesh pubic Examinations (prevention of Malpractice & Unfair means) Rules 1997 issued in G.O.Ms.No.114, dated 13.05.1997. Any violation noticed will be dealt under Law. All the Managements of private un-aided Jr. Colleges are hereby informed that, if any deviation is noticed, the Andhra Pradesh State Board of Intermediate Education will take action against the managements including dis-affiliation of the college

47 సెలవులు

ఇంటర్‌ బోర్డు క్యాలెండర్‌ ప్రకారం ఈ విద్యాసంవత్సరంలో 47 సెలవుదినాలున్నాయి.

అన్ని రెండో శనివారాలు పనిదినాలుగానే ఉంటాయి. టర్మ్‌ సెలవులు లేవు. వేసవి సెలవుల్లో అన్ని యాజమాన్యాల్లోని జూనియర్‌ కాలేజీలను మూసి ఉంచాలి.

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మేరకు అన్ని ఆదివారాలు, పబ్లిక్‌సెలవుదినాలను తప్పనిసరిగా పాటించాలి. అడ్మిషన్లు పూర్తిగా బోర్డు ప్రకటించిన షెడ్యూళ్లలో మాత్రమే జరుగుతాయి. విద్యార్థులను తమ కాలేజీల్లో చేరేలా ఒత్తిడి చేయడం, తమ కాలేజీ ఫలితాలు అంటూ ఆకర్షించేలా ప్రలోభపెట్టడం వంటివి చేయరాదు.

హోర్డింగులు, పాంప్లేట్లు, పత్రికలు, టీవీల్లో ప్రకటనలు చేయరాదు. పబ్లిక్‌ పరీక్షల్లో మంచి మార్కులు వచ్చేలా చేస్తామని హామీలివ్వడం నిబంధనలకు విరుద్ధమని, ఇలా చేస్తే చర్యలుంటాయని కాలేజీల యాజమాన్యాలకు బోర్డు స్పష్టం చేసింది.

ఈ విద్యాసంవత్సరంలో చేపట్టే కార్యక్రమాల తాత్కాలిక షెడ్యూల్‌ ఇలా ఉంది

ఫస్ట్‌ టర్మ్‌: 2021 సెప్టెంబర్‌ 1 నుంచి డిసెంబర్‌ 18 వరకు
మొదటి యూనిట్‌ టెస్టు: 2021 అక్టోబర్‌
రెండో యూనిట్‌ టెస్టు: 2021 నవంబర్‌
అర్థసంవత్సర పరీక్షలు : 2021 డిసెంబర్‌ 12 నుంచి
సెకండ్‌ టర్మ్‌: 2021 డిసెంబర్‌ 20 నుంచి 2022 ఏప్రిల్‌ 23 వరకు
మూడో యూనిట్‌ టెస్టు: 2022 జనవరి
నాలుగో యూనిట్‌ టెస్టు: 2022 ఫిబ్రవరి
ప్రీ ఫైనల్‌ పరీక్షలు: 2022 ఫిబ్రవరి చివరి వారం
థియరీ పబ్లిక్‌పరీక్షలు: 2022 మార్చి మొదటి వారంలో
చివరి పనిదినం: 2022 ఏప్రిల్‌ 23
వేసవి సెలవులు: 2022 ఏప్రిల్‌ 24 నుంచి 2022 మే 31 వరకు
అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ : 2022 మే చివరి వారంలో
2022–23 విద్యాసంవత్సర ప్రారంభం: 2022 జూన్‌ 1 నుంచి

1st year Annual Calendar for the Academic year 2021-2022 CLICK HERE

INTER 1ST YEAR ONLINE APPLICATION LINK

error: Content is protected !!
Scroll to Top