Admission into 2/3 year diploma courses of ANGRAU-SVVU-YSRHU for academic year 2021-22

అగ్రి కల్చరల్  డిప్లోమా కోర్సుల నోటిఫికేషన్ 

*రెండు సంవత్సరాల వ్యవసాయ విత్తన సాంకేతిక పరిజ్ఞానం / సేంద్రియ వ్యవసాయ/ పశుపోషణ/మత్స్యశాస్త్ర/హార్టీకల్చరల్ డిప్లొమా కోర్సులు మరియు మూడు సంవత్సరాల అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సు ప్రవేశము కొరకు ప్రకటన.  పూర్తి వివరాలు.

అగ్రి పాలిటెక్నిక్ దరఖాస్తుల గడువు 13 వరకు పెంపు
ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ, డాక్టర్ వైఎస్సార్ ఉ ద్యాన వర్సిటీ, శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయాల పరిధిలో నిర్వహి స్తున్న వివిధ పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్దేశించిన గడువును ఈ నెల 13 వరకు పొడి గించారు. కరోనా పరిస్థితులు, పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రుల వినతి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు యూనివర్శిటీ రిజి స్ట్రార్ టి.గిరిధరకృష్ణ మంగళవారం ఒక ప్రక టనలో తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. మూడు వర్సిటీల పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో 2021 22 విద్యా సంవత్సరానికి సంయుక్త ఆన్లైన్ కౌన్సెలింగ్ నిర్వహణ బాధ్యతను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం చేపట్టింది.

Last Date For Polytechnic Registrations For Admissions is 28.08.2021

Courses offered by ANGRAU:

1. Agricultural Polytechnic (2 years)
2. Seed Technology (2 years)
3. Agricultural Engineering(3 years)
4. Organic Agriculture(the new course had been introduced)

వ్యవసాయ ఉద్యాన మరియు పశు వైద్య డిప్లొమా కోర్సుల ప్రవేశాలకు సంయుక్త ఆహ్వానం 

           ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, లాం, గుంటూరు  పరిధి లోని  వ్యవసాయ, సేంద్రియ వ్యవసాయ, విత్తన సాంకేతిక పరిజ్ఞానము, వ్యవసాయ ఇంజనీరింగ్ పాలిటెక్నిక్  లకు, డా. వై.యస్.ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయం, వెంకటరామన్నగూడెం పరిధి లోని  ఉద్యాన పాలిటెక్నిక్ లకు  మరియు శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం, తిరుపతి  పరిధి లోని   పశుపోషణ మరియు మత్స్యశాస్త్ర పాలిటెక్నిక్ లకు  2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించిన సంయుక్తంగా నిర్వహించబడు ప్రవేశముల కొరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను కోరడం జరిగింది. 

     ఈ పాలిటెక్నిక్ లలో ప్రవేశముల కొరకు ఆంధ్ర మరియు తెలంగాణాకు చెందిన పదవ తరగతి విద్యార్థులు, దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులైనవారు మరియు ఇంటర్మీడియేట్ ఫెయిలైన వారు కూడా ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇంటర్మీడియేట్ పాసైనవారు దానికంటే పై చదువులు చదివినవారు అర్హులు కారు. గత ఏడాది పదవ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకొనవచ్చు. పదవ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా విద్యార్ధి యొక్క ఎంపిక నిర్ణయించబడును. డిప్లొమా కోర్సులో చేరబోవు అభ్యర్ధి                          31. 08. 2021 నాటికి 15-22 సంవత్సరముల మధ్య వయస్సు కలిగినవారై ఉండాలి. (31. 08. 1999 తరువాత మరియు 31.08.2006 లోపు జన్మించిన వారై ఉండాలి). గ్రామీణప్రాంతాలలోని పాఠశాలలో చదివినవారికి మరియు మునిసిపల్ పరిధి పాఠశాలలో చదివిన వారికి మధ్య 75:25 ప్రాతిపదికన సీట్ల కేటాయింపు జరుగును.

మిగిలిన అన్ని రేజర్వేషన్స్ ప్రభుత్వ నిబంధనల మేరకు చేపట్టబడతాయి . అంతే కాక ఈ ఏడాది నుండి  ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఆర్ధికంగా వెనుక బడిన అగ్ర వర్ణ పేదలకు కేటాయింప బడిన EWS కోటా క్రింద 10 శాతం సీట్లు అదనంగా కేటాయింపబడతాయి.

ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో

16 వ్యవసాయ పాలిటెక్నిక్ లు,

54 ప్రైవేటు వ్యవసాయ పాలిటెక్నిక్ లు ఉన్నాయి.

విత్తన సాంకేతిక పరిజ్ఞాన పాలిటెక్నిక్ విశ్వవిద్యాలయానికి సంబంధించి  జంగమహేశ్వర పురంలో ఒకటి, ప్రైవేట్లో 11 పాలిటెక్నిక్ లు ఉన్నాయి. సేంద్రియ వ్యవసాయ పాలిటెక్నిక్ లు విశ్వ విద్యాలయానికి సంబంధించి చింతపల్లిలో  ఒకటి, ప్రైవేట్లో 3 పాలిటెక్నిక్ లు ఉన్నాయి.

ఇవి కాక,  వ్యవసాయ ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ లు   విశ్వ విద్యాలయానికి సంబంధించి 2 కళాశాలలు అనకాపల్లి మరియు కలికిరి, చిత్తూరు జిల్లా లో రెండు కళాశాలలు మరియు 17 ప్రైవేట్ పాలిటెక్నిక్ లు అందుబాటులో ఉన్నాయి. మొత్తం మీద వ్యవసాయ డిప్లొమా కోర్సులలో 3010 సీట్లు, విత్తన సాంకేతిక పరిజ్ఞాన డిప్లొమా కోర్సులలో 505 సీట్లు, సేంద్రియ వ్యవసాయ డిప్లొమా కోర్సులలో 145 సీట్లు మరియు  వ్యవసాయ ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులలో 570 సీట్లు అందుబాటు లో ఉన్నాయి.

డా. వై.యస్.ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయం, వెంకటరామన్నగూడెం, పశ్చిమగోదావరిజిల్లా ఆధ్వర్యంలో 4 ఉద్యాన పాలిటెక్నిక్ లలో 200 సీట్లు మరియు 7 ప్రైవేటు పాలిటెక్నిక్ లలో 280 సీట్లు అందుబాటు లో ఉన్నాయి. శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం, తిరుపతి ఆధ్వర్యంలో 10 పశుపోషణ పాలిటెక్నిక్ లలో 300 సీట్లు, 12 ప్రైవేట్ రంగ పాలిటెక్నిక్ లలో 600 సీట్లు అందుబాటులో ఉన్నాయి మరియు మత్స్యశాస్త్ర పాలిటెక్నిక్ లలో 39 సీట్లు మరియు 8 ప్రైవేట్ పాలిటెక్నిక్ లలో 400 సీట్లు అందుబాటు లో ఉన్నాయి.

ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, గుంటూరు మరియు డా. వై.యస్.ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయం, వెంకటరామన్నగూడెం, పశ్చిమగోదావరి జిల్లా వారిచే నిర్వహించబడుతున్న అన్ని డిప్లొమా కోర్సులు 2021-22 విద్యాసంవత్సరం నుండి ఇంగ్లీషు మాధ్యమంగా బోధనచేపట్టబడుతుంది.  వ్యవసాయ ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సు  కాల పరిమితి మూడు సంవత్సరములు కాగా మిగిలిన అన్ని డిప్లొమా కోర్సుల  కాల పరిమితి రెండు సంవత్సరములు. 

ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, గుంటూరు వారి ప్రయత్నం వలన ఆయా డిప్లొమాలు పూర్తి చేసిన విద్యార్థులకు  సాధారణ డిగ్రీ లలో ప్రవేశానికి అర్హత లభించినది. అంతే కాక అగ్రి సెట్ మరియు హార్టీ సెట్ ద్వారా వ్యవసాయ మరియు ఉద్యాన డిగ్రీల్లో ప్రవేశం పొందే అవకాశం ఉంది. ఆయా  డిప్లొమా లు పూర్తి చేసిన విద్యార్థులకు ఆయా శాఖల  లో  ఏఈవో,  ఎంపీఈవో  లు గాను లేక గ్రామ సచివాలయాలలో  కార్యదర్శిగా ఉద్యోగ అవకాశాలు కలవు. ప్రైవేటు విత్తన తయారీ కేంద్రాల లో, కోళ్ల పరిశ్రమ ల లోను  మరియు  వ్యవసాయ పనిముట్ల తయారీ కర్మాగారాలలోనూ ఉద్యోగ అవకాశాలు కలవు.

మూడు విశ్వ విద్యాలయాల పరిధి లో ని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాలిటెక్నిక్ లలో 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు ఈ ఏడాది సంయుక్త ఆన్ లైన్ కౌన్సెలింగ్ నిర్వహణ బాధ్యత ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, గుంటూరు వారు చేపట్టినారు.

ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వెబ్ సైట్ లో ఈ నెల 19 వ తేదీ నుండి 28 వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించబడును. 

*AGRICET 2021 Agriculture, Seed Technology, Organic Farming, Animal Husbandry, Fisheries Polytechnic Diploma Courses Admissions 2021-21 Notification, Fee Payment, Schedule.

Common Admission notification for Diploma Courses (Polytechnic) in Govt institutions and Private recognised institutions of the following three Universities.

(a) AP Agriculture Polytechnic Diploma Courses: Agriculture Diploma Courses in Govt and Private Polytechnic Colleges of Acharya NG Ranga Agricultural University, Guntur,

(b) AP Veterinary Polytechnic Diploma Courses: Veterinary Diploma Courses in Govt and Private Polytechnic Colleges of Sri Venkateswara Veterinary University, Tirupati,

(c) AP Horticulture Polytechnic Diploma Courses: Horticulture Diploma Courses in in Govt and Private Polytechnic Colleges of Dr YSR Horticulture University for the 2020-2021 academic year. Online applications are invited from the candidates who have passed in SSC and interested in admissions in diploma courses.

Eligibility for AP Agricultural Polytechnic Diploma Courses:

The students who have passed SSC or equivalent exam and those who are residing in rural areas are eligible. The student must have studied at least 4 years during the period of first to tenth class schools located in rural areas. The candidates should obtain 55 per cent marks (excluding Hindi) or 5.0 Grade Point Average.  

In case SCs and STs categories the candidates should obtain at least 45 per cent of marks or 4.0, 5.0 Grade Point Average. The medium of instructions for all the Polytechnic course is Telugu.

Age Limit for AP Agricultural Polytechnic Diploma Courses: 

The candidates for admission to first-year polytechnic courses in the University shall be required to have completed 15 years of age as on 31st August 2020 of the year of admission with an upper age limit of 22 years.

Information Brochure

Click here to download the proforma (Form-I) to claim Rural status

Registration form for Admission into 2/3 years Diploma Courses 2021-22

Print of Registration form

ANGRAU OFFICIAL WEBSITE CLICK HERE

error: Don\'t Copy!!!!