Aadhar-PAN-card-link-details

Aadhaar-Pan Link: ఈ వ్యక్తులకి ఆధార్-పాన్ లింక్‌ అవసరం లేదు.. మిగతా వారికి తప్పనిసరి..!

Aadhaar-Pan Link: 2020-21 ఆర్థిక సంవత్సరం మరో 2 రోజుల్లో ముగియనుంది. అందుకే మార్చి 31 కంటే ముందు ఆధార్‌ పాన్‌ లింక్‌ చేసుకోవడం తప్పనిసరి.

Aadhaar-Pan Link: 2020-21 ఆర్థిక సంవత్సరం మరో 2 రోజుల్లో ముగియనుంది. అందుకే మార్చి 31 కంటే ముందు ఆధార్‌ పాన్‌ లింక్‌ చేసుకోవడం తప్పనిసరి. ఈ విషయంలో ఇప్పటికే ప్రభుత్వం చాలాసార్లు వినియోగదారులని హెచ్చరిస్తూ వస్తోంది. ఇంతకు ముందు కూడా ప్రభుత్వం ఆధార్‌, పాన్ చివరితేదిని పలుమార్లు పొడిగించింది. ఇప్పుడు ఆధార్-పాన్ లింక్ చివరి తేదీ మార్చి 31గా నిర్ణయించింది. కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే లింక్ చేయండి. లేదంటే భారీ ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 139AA ప్రకారం.. ఆధార్, పాన్ కలిగి ఉన్న ప్రతి వ్యక్తి 31 మార్చి 2022 లోపు లింక్ చేయాల్సి ఉంటుంది. అయితే ఆధార్, పాన్ లింక్ అవసరం లేని కొందరు ఉన్నారు. వారి గురించి తెలుసుకుందాం.

PAN Aadhaar Link: పాన్ ఆధార్ లింక్ చేయలేకపోతున్నారా? వివరాలు ఇలా సరిదిద్దుకోండి CLICK HERE

ఈ వ్యక్తులకు పాన్-ఆధార్ లింక్ అవసరం లేదు

1. అస్సాం, J&K, మేఘాలయ నివాసులకి అవసరం లేదు.

2. ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం నాన్ రెసిడెంట్‌కు తప్పనిసరి కాదు.

3. 80 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పౌరులకు అవసరం లేదు.

4. భారతదేశ పౌరులు కాని వారికి ఇది అవసరం లేదు.

మీరు పైన పేర్కొన్న కేటగిరీలలో దేనిలోకి రాకపోతే మార్చి 31లోపు ఏ సందర్భంలో అయినా ఆధార్‌, పాన్‌ లింక్‌ చేయాల్సి ఉంటుంది. లేకపోతే పౌరులు ఆర్థిక లావాదేవీల విషయంలో అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. దీని వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తుతాయో తెలుసుకుందాం.

1. మీరు 50 వేల రూపాయల కంటే ఎక్కువ FD పొందలేరు.

2. మీరు రూ.50,000 కంటే ఎక్కువ నగదును డిపాజిట్ చేయలేరు.

3. కొత్త డెబిట్-క్రెడిట్ కార్డ్ తీసుకోలేరు.

4. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టలేరు.

5. మ్యూచువల్ ఫండ్స్‌ నుంచి డబ్బులు విత్‌ డ్రా చేయలేరు

PAN-AADHAR LINK STATUS CLICK HERE

Link Aadhaar TO PAN CARD CLICK HERE

error: Don\'t Copy!!!!