1st-class-to-10th-class-varadhi-work-sheets-workbooks-all-subjects

1st-class-to-10th-class-varadhi-work-sheets-workbooks-all-subjects

LATEST WORK BOOKS/WORK SHEETS 2021-22

వారధి ప్రాతిపదికగా ప్రశ్నలు! SCERT నుంచి పత్రాలు
21 నుంచి ఎఫ్‌ఏ-1 పరీక్షల నిర్వహణ
 పాఠశాలల్లో ఎఫ్‌ఏ-1 (నిర్మాణాత్మక మూల్యాంకనం) పరీక్షల నిర్వహణకు పాఠశాల విద్యా శాఖ సమాయత్తమైంది. ఒకటి నుంచి అన్ని తరగతులకు ఈ నెల 21 నుంచి 25వ తేదీ వరకు జరిగే లఘుపరీక్షలకు ప్రాథమిక విద్య పరిశోధన, శిక్షణ మండలి ద్వారా ప్రశ్నపత్రాలు రూపొందించి ప్రధానోపాధ్యాయులకు పంపించనున్నారు. పరీక్ష సమయానికి గంట ముందు పంపిస్తే నల్ల/పచ్చబల్లలపై ప్రదర్శించాలని అధికారులు మార్గదర్శకాలు జారీ చేశారు. సుదీర్ఘ లాక్‌డౌన్‌ అనంతరం పాఠశాలలు తెరుచుకోవడంతో విద్యార్థుల సంసిద్ధత కోసం అమలు చేసిన వారధి వర్క్‌షీట్ల ఆధారంగా ప్రశ్నపత్రాలు ఉండే అవకాశం ఉందని సమాచారం.
మూల్యాంకనం ఇలా..
ఎఫ్‌ఏ పరీక్షలకు సంబంధించి ఇప్పటివరకు పది మినహా అన్ని తరగతులకు పాఠశాల స్థాయిలోనే ప్రశ్నపత్రాలు రూపొందించేవారు. ఇకపై రాష్ట్రస్థాయి నుంచే ప్రశ్నపత్రాలు ఇస్తున్న నేపథ్యంలో జవాబుపత్రాల మూల్యాంకనంపై దిశానిర్దేశం చేశారు. ఉపాధ్యాయుల మూల్యాంకనం తర్వాత ప్రధానోపాధ్యాయులు తనిఖీ చేయాలని సూచించారు. ఆ తర్వాత మార్కులను అంతర్జాలంలో పొందుపరచాలి. తల్లిదండ్రులకు తప్పనిసరిగా ప్రగతిసూచిక(ప్రోగెస్‌ కార్డు)లు అందజేయాలి. పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులకు ప్రత్యేక రెమిడియల్‌ తరగతులు నిర్వహించాలని నిర్దేశించారు.
ఎంఈవోల ద్వారా హెచ్‌ఎంలకు..
ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఈ ఏడాది ఎఫ్‌ఏ-1 పరీక్షల ప్రశ్నపత్రాలను వాట్సాప్‌ గ్రూపుల్లో ఎంఈవోల ద్వారా ప్రధానోపాధ్యాయులకు పంపించనున్నారు. పరీక్షల నిర్వహణ అనంతరం ఉపాధ్యాయులు విద్యార్థుల మార్కులను అంతర్జాలంలో పొందుపర్చాల్సి ఉంటుంది. 
ప్రశ్నపత్రం సరళి ఇలా*
ఎఫ్‌ఏ-1 పరీక్షల ప్రశ్నపత్రాల సరళి ఇలా ఉండొచ్చని భావిస్తున్నారు. వారధి వర్క్‌షీట్లతో పాటు తొలి పాఠ్యాంశాల ప్రాతిపదికగా ప్రశ్నలను రూపొందించనున్నారు. మొత్తం 20 మార్కులకు ప్రశ్నపత్రం ఉండనుంది. వీటిలో ఒక మార్కు చొప్పున బహుళైచ్ఛిక 5, ఖాళీలు 5, రెండు మార్కుల లఘు సమాధాన ప్రశ్నలు 3, నాలుగు మార్కుల వ్యాసరూప ప్రశ్న ఒకటి ఉండే అవకాశం ఉంది.

10TH CLASS ALL SUBJECTS WORK BOOKS

9TH CLASS ALL SUBJECTS WORK BOOKS

8TH CLASS ALL SUBJECTS WORK BOOKS

7TH CLASS ALL SUBJECTS WORK BOOKS

6TH CLASS ALL SUBJECTS WORK BOOKS

5TH CLASS ALL SUBJECTS WORK BOOKS

4TH CLASS ALL SUBJECTS WORK BOOKS

3rd CLASS ALL SUBJECTS WORK BOOKS

2nd CLASS ALL SUBJECTS WORK BOOKS

1st CLASS ALL SUBJECTS WORK BOOKS

SUBJECT WISE WORK BOOKS 2021-22 T.M/E.M 1st CLASS to 10th CLASS T.M/E.M

TELUGU

HINDI

ENGLISH

MATHS(T.M & E.M)

PHYSICAL SCIENCE(T.M & E.M)

BIOLOGICAL SCIENCE(T.M & E.M)

SOCIAL STUDIES(T.M & E.M)

APSCERT TEXT BOOKS CLASS 1ST TO CLASS 10TH NEW SYLLABUS CLICKHERE